నేను బ్లాగర్‌గా కొత్త. కానీ కొంత కాలంగా బ్లాగులను గమనిస్తూనే ఉన్నాను. కామెంట్స్ విషయంలో ప్రత్యేక నిబంధనలు ఏమీ లేవని నేను గమనించాను. అభిప్రాయాలను నేరుగా తెలపడం పట్ల ఆశ్చర్యపడ్డాను. విమర్శలను సున్నితంగా తెలపడం పట్ల ఆనందపడ్డాను. కానీ వారం రోజులుగా కొన్ని బ్లాగుల(అరుణమ్, గోన్‌విత్‌ఇన్, చెరుకురసమ్) మధ్య ఘాటైన వాదన జరుగుతోంది. ప్రశంసలు వచ్చినప్పుడు పొంగి పోవడం.. విమర్శలు వచ్చినప్పుడు కుంగిపోవడం సరికాదు అని నేను అనుకుంటున్నాను. బ్లాగర్ల మధ్య వివాదం రావడం ఇది కొత్తేమి కాదు. బాలీవుడ్‌లో మొదట బ్లాగ్ మొదలు పెట్టింది అమీర్‌ఖాన్, షారూఖ్ ఖాన్‌లు. అయితే అమీర్‌ఖాన్ "తాను కొత్తగా కొన్న బంగ్లా వాచ్‌మెన్ కుక్కపేరు షారూఖ్'' అని తన బ్లాగులో పోస్ట్ చేశారు. ఇది షారూఖ్, అమీర్ ఖాన్‌ల మధ్య వివాదానికి దారితీసింది. ఆ తర్వాత ఆ ఇద్దరు ఖాన్‌లు ఓ అండర్‌స్టాండింగ్‌కు వచ్చారు. బ్లాగింగ్ అనేది మనోభావాల్ని నేరుగా తెలిపేందుకు అనువైనదని, దీన్ని వివాదంగా కాకుండా సానుకూలంగా స్పందించాలని వారు అటు తర్వాత బ్లాగారు. ఆ తర్వాత బిగ్‌బీ అమితాబ్ ఈ బ్లాగర్ల జాబితాలోకి చేరిపోయారు. బ్లాగ్ మొదలెట్టిన కొద్ది...