Skip to main content

Posts

Showing posts from May, 2010

మల్లి

సెల్‌ఫోన్‌ రింగయ్యింది. లిఫ్ట్‌ చేసి "హలో'' అన్నాను. "హలో... ఇందాక ఎవరు మిస్స్‌డ్‌ కాల్‌ ఇచ్చింది'' అంటూ ఓ లేడీ వాయిస్‌. "మిస్డ్‌కాలా? నేనివ్వలేదండి!'' సమాధానమిచ్చా. "ఇంకోసారి చేస్తే చంపేస్తా '' అంటూ కోపంగా ఫోన్‌ పెట్టేసింది ఆమె. * * * తల తీసేసినట్టయ్యింది. ఆ గొంతు ఎక్కడో విన్నట్టుంది. "ఎవరా అమ్మాయి? ఎందుకలా అంది? మిస్డ్‌కాల్‌ ఎవరిచ్చారు?'' ఆ గుర్తొచ్చింది! శీను!! ఇందాక ఫోన్‌ చేసుకుంటానంటే సెల్‌ ఇచ్చా. వెంటనే శీనుకు ఫోన్‌ చేసి విషయం అడిగా. "ఔన్రా నేనే చేశా. లిఫ్ట్‌ చేయలేదు. ఏం కాదు లైట్‌ తీస్కో'' నిర్లక్ష్యంగానే సమాధానమిచ్చాడు శీను. "ఇంతకు ఎవర్రా అమ్మాయి?'' "అదేరా మీ క్లాస్‌మెట్‌ మల్లి'' "ఓ... యా... మల్లి.. మల్లిక. తనకు పెళ్లయిపోయింది కదా, నువ్వెందుకు ఫోన్‌ చేశావ్‌'' "ఔను.. పెళ్లీ అయిపోయింది... మొగుడూ వదిలేశాడు. అందుకే... ట్రయల్‌ ''అంటూ అదోలా నవ్వాడు వాడు. * * * మల్లికి పెళ్లయిపోయింది. భర్త నుంచి వేరుగా ఉంటోందా?! ఒక్కసారి కలవాలి. ఎందుకో తెలియదు. బస్‌ ఎక్కాన...