Skip to main content

Posts

Showing posts from September, 2011

ముచ్‌కుందా - ఒకచెట్టు ఆత్మకథ

ఈ అనంత కాలగమనంలో.. మహానగరాల ప్రస్థానంలో...ఏదో ఒకరోజు.. ఏదో ఒక క్షణం..చీకటి అలుముకుంటుంది. ఉజ్వలంగా వెలుగొందిన నగరాలన్నీ ఇలాంటి పెనువిషాదాన్ని చవి చూసినవే. ఇది చరిత్ర చెప్పిన సత్యం.అలాంటి విషాదానికి, ప్రకృతి విలయానికి నిలువెత్తు సాక్ష్యం ఈ ప్రాణధాత్రి. ఒకప్పుడది.. తెల్లటి నురగల హారంతో పరవళ్లు తొక్కుతూ ఆందంగా కనిపించే నది. పేరు ‘ముచ్‌కుందా’ నేడు చలనం లేని మూసీ. ఒక మురికి కాలువ. దిగాలుగా కదిలే ఆ నీటిలో ఒక విషాదం ఉంది. చరివూతలో ‘మూడు రోజుల’ మచ్చ ఉంది. ఏంటా మూడు రోజులు? అసలేమైంది? చెప్పేవావరు? ఉన్నారు. మూసీకి ఉత్తరానున్న ఉస్మానియా ఆసుపత్రి ఇన్‌పేషెంట్ బ్లాక్‌లో ఒక పెద్ద చింత చెట్టు ఉంది. ఆ మూడు రోజులకు ఇదొక్కటే సజీవ సాక్ష్యం. 150 మందికి పునర్జన్మనిచ్చిన ఆ ‘ప్రాణధాత్రి’ ఆత్మకథ ఇది. 103 సంవత్సరాల క్రితం.. సరిగ్గా ఇదేరోజు.. ( సెప్టెంబర్ 24, 1908 - గురువారం) ఆ రాత్రి.. బంగాళాఖాతంలో వాయుగుండమేదో ఏర్పడుతున్నట్లు భూమి పొరల్లోంచి నా వేర్లకు సంకేతం అందినట్లనిపించింది. నా ఒళ్లు జలదరించింది. అటూ ఇటూ చూశాను. నగరం ప్రశాంతంగా ఉంది. తుఫాను ముందు ఉండే ప్రశాంతత. నన్ను కలవరపెట్టింది. మ...