Skip to main content

Posts

Showing posts from January, 2012

ఎవరూ నేర్పని ఎనిమిది పాఠాలు

గ్రీకు పురాణాల్లో ఫీనిక్స్ అనే పక్షి ఉంటుంది సూర్యుడిని అందుకోవాలని అది ఆశపడుతుంది ఎగిరి.. ఎగిరి.. సూర్యునికి దగ్గరవుతుంది వేడికి రెక్కలు మాడి కింద పడిపోతుంది కానీ దాని కోరిక చావదు గాయాలు మానాక మళ్లీ ఎగరడం మొదలెడుతుంది ఇది ఫీనిక్స్ పట్టుదలను పాఠంగా నేర్పే కథ! ఈమె జీవితం కూడా తెలుసుకోవాల్సిన ఓ పాఠమే! మైలారం గ్రామం, వరంగల్, 1988లో ఒకరోజు.. ఓ యువతి పొలంలో కలుపుతీస్తోంది.. ‘ఝయ్..’మని ఆకాశంలో ఏదో చప్పుడు... ఆమె ఆసక్తిగా పైకి చూసింది. విమానం! ‘నా జీవితంలో ఎప్పటికైనా ఆ విమానం ఎక్కాలి’ ఆశ పడిందామె. అందులో తప్పులేదు. కానీ ఆమె పరిస్థితులు వేరు. పెళ్లయింది. ఇద్దరు పిల్లలు. బంధాలు.. బంధుత్వాలు.. కట్టుబాట్లు.. వీటి మధ్య ఆమెకది అత్యాశే. కానీ ఆమె అలా అనుకుంటే ఇప్పటికీ ఇంకా అదే పొలంలో పనిచేస్తుండేదేమో! మే 2, 2000.. బేగంపేట ఎయిర్‌పోర్ట్, హైదరాబాద్ ఫీనిక్స్ ఎంత ఎగిరినా సూర్యుడిని అందుకోలేకపోయింది. కానీ ఆ యువతి కల నెరవేరింది. ఆకాశంలో ఎగరాలన్న ఆశ తీరింది. అమెరికా వెళ్లింది. అంతటితో ఆగిపోలేదు. ఆమె లక్ష్యం మరింత విస్తృతమైంది. ఆమె సంకల్పం ఫీనిక్స్ ఆశ కన్నా గొప్పది. అందుకే ఇప్పుడా...