అరవై ఆరెళ్ళ తర్వాత ఒక ఉత్తరం తిరిగొచ్చింది.. మా తాత తన ప్రేయసి నజియాకు రాసింది.. అది చూసి ఆయన గుండె వేగం పెరిగింది.. హాస్పిటల్ బెడ్ మీద కొన ఊపిరితో ఆమెను కలవరిస్తున్నారాయన.. ఎవరీ నజియా? ప్రేమించుకుని ఎందుకు పెళ్ళి చెసుకోలేక పోయారు? తాత వస్తానని ఉత్తరం రాసి.. ఎందుకు వెళ్ళలేదు? ఎవరీ నిజాం? అసలు ఆయన్ని ఎందుకు చంపాలనుకున్నాడు? మరి నజియా ఏమై పోయింది? నేనిప్పుడు గుచ్చుకుంటున్న ఈ ప్రశ్నల కత్తులు గుండె ఒరలో పెట్టుకుని.. ముంబై నుంచి హైదరాబాద్ బయలుదెరుతున్నాను. నా ప్రయాణం సమాధానాల కోసం, తాత కోసం మాత్రమే కాదు.. నాకు తెలియని నా ములాల కోసం కూడా.. ఈ కార్తీక్ రామస్వామి అన్వేషణ ఒక నజియా కోసం.. నజియా పుస్తకానికి సంబంధించిన అప్ డేట్స్ అందించేందుకు ఫేస్ బుక్ లో ఒక ప్రత్యేక పేజీ క్రియేట్ చేశాం. ఒక నజియా కోసం : Oka Nazia Kosam ఈ కథ మీద మీకు ఆసక్తి ఉంటే ఎప్పటి కప్పుడు అపడేట్స్ తెలుసుకునేందుకు పై లింక్ క్లిక్ చేసి లైక్ నొక్కండి.. పోస్టు వివరాలు మీకు కనిపిస్తాయి..