హాయ్ మామయ్య, ఎలా ఉన్నారు. నేను మాత్రం యావరేజ్ అండ్ యాంగ్రీ. ఎందుకా? మొన్న వచ్చినప్పుడు డాడీతో నా కాలేజ్ గురించి మాట్లాడమని చెప్పాను. మీరేయో బిజినెస్ అంటూ బిజిబిజీగా వెళ్లిపోయారు. నాన్న నా బ్రెయిన్ ఇక్కడ ప్రై చేసుకుని తినేస్తున్నాడు. మామయ్యా! జీవితమంటే పరీక్షలు, ఫలితాలేనా? అనిపిస్తోంది. మొన్నటి దాకా ఇంటర్ పరీక్షలు. ఆ తర్వాత మోడల్ ఎంసెట్, ఎంసెట్. ఆ వెంటనే ఎఐ త్రిపుల్ ఇ. పరీక్షలు అయిపోయాక రోజుకో రిజల్ట్. కాలేజ్ అయిపోయింది కదా అనుకుంటే అమ్మానాన్నలతో రోజూ ఇంట్లో ప్రయివేట్ క్లాస్ తప్పటం లేదు మామయ్య. నేను అన్నం తినడం మానేసి రోజూ డాడీతో తిట్లు తింటున్నాను. డాడీ ఆయన కలలన్నీ నా మీద రుద్దుతున్నారు. ఆయన జీవితంలో సాధించలేనివన్నీ నేను సాధించాలట. ఇంజినీర్‌ని కావాలట. లేకుంటే ఆర్యభట్టులా జీరో లాంటిది ఏదైనా కనిపెట్టాలట. ఆయన చెప్పింది చేస్తే నేనే పెద్ద జీరోలా మిగిలిపోయేలా ఉన్నా. నాకూ ఓ చిన్న మనసు ఉందని దానికీ చిన్నిచిన్నికోరికలు ఉన్నాయని డాడీకి ఎందుకు తెలియడం లేదు మామయ్య. అమ్మ అయినా అర్థం చేసుకుంటుందెమో అనుకున్నా, కానీ ఆమె ఓటు కూడా డాడీకే. నాకేమో కామ్‌గా బికామ్ చేయాలని ఉంది. డాడీ ఎమో ఎంసె...