జీవితమంటే పరీక్షలు ఫలితాలేనా? (మా కోడలి ఉత్తరం )

By | June 19, 2009 2 comments
హాయ్‌ మామయ్య,

ఎలా ఉన్నారు. నేను మాత్రం యావరేజ్‌ అండ్‌ యాంగ్రీ. ఎందుకా? మొన్న వచ్చినప్పుడు డాడీతో నా కాలేజ్‌ గురించి మాట్లాడమని చెప్పాను. మీరేయో బిజినెస్‌ అంటూ బిజిబిజీగా వెళ్లిపోయారు. నాన్న నా బ్రెయిన్‌ ఇక్కడ ప్రై చేసుకుని తినేస్తున్నాడు.

మామయ్యా! జీవితమంటే పరీక్షలు, ఫలితాలేనా? అనిపిస్తోంది. మొన్నటి దాకా ఇంటర్‌ పరీక్షలు. ఆ తర్వాత మోడల్‌ ఎంసెట్‌, ఎంసెట్‌. ఆ వెంటనే ఎఐ త్రిపుల్‌ ఇ. పరీక్షలు అయిపోయాక రోజుకో రిజల్ట్‌. కాలేజ్‌ అయిపోయింది కదా అనుకుంటే అమ్మానాన్నలతో రోజూ ఇంట్లో ప్రయివేట్‌ క్లాస్‌ తప్పటం లేదు మామయ్య. నేను అన్నం తినడం మానేసి రోజూ డాడీతో తిట్లు తింటున్నాను.

డాడీ ఆయన కలలన్నీ నా మీద రుద్దుతున్నారు. ఆయన జీవితంలో సాధించలేనివన్నీ నేను సాధించాలట. ఇంజినీర్‌ని కావాలట. లేకుంటే ఆర్యభట్టులా జీరో లాంటిది ఏదైనా కనిపెట్టాలట. ఆయన చెప్పింది చేస్తే నేనే పెద్ద జీరోలా మిగిలిపోయేలా ఉన్నా.

నాకూ ఓ చిన్న మనసు ఉందని దానికీ చిన్నిచిన్నికోరికలు ఉన్నాయని డాడీకి ఎందుకు తెలియడం లేదు మామయ్య. అమ్మ అయినా అర్థం చేసుకుంటుందెమో అనుకున్నా, కానీ ఆమె ఓటు కూడా డాడీకే.

నాకేమో కామ్‌గా బికామ్‌ చేయాలని ఉంది. డాడీ ఎమో ఎంసెట్‌, ఎఐత్రిపుల్‌ఇ అంటున్నారు. చివరకు ఏదీ రాకపోతే బిఎస్సీ మ్యాథ్స్‌లోనైనా జాయిన్‌ చెయ్యాలని చూస్తున్నారు. ఆ మ్యాథ్స్‌ నాకు రాదు మామయ్య. ఆ పుస్తక ం చూస్తే బుక్‌ నిండా ఎన్ని ప్రాబ్లమ్‌సో అనిపిస్తుంది నాకు. మామయ్య నువ్వైనా కాస్త చెప్పకూడదు.

నిన్న టీవీలో అనకొండ సినిమా చూశాను. అందులో డాడీయే కనిపించారు. అర్థరాత్రి కలలో అరకు వెళ్లాను. అక్కడికి కూడా పుస్తకం పట్టుకుని 'వదల బొమ్మాళీ' అని వచ్చేశారు డాడీ. నాకైతే శశిరేఖపరిణయంలో జెన్నీలా ఇంట్లోంచి పారిపోవాలనిపిస్తోంది. రెక్కలు కట్టుకుని పక్షిలా స్వేచ్ఛగా విహరించి రావాలని ఉంది.

సమ్మర్‌లో కూడా నాకు ఈ పరీక్షల గోల ఏంటి మామయ్య. నాలుగు ఎక్జామ్స్‌ రాశాను. తమ్ముడు చిన్నుగాడు చూడు అమ్మమ్మ వాళ్ల ఊరెళ్లాడు. నిన్న ఫోన్‌ చేశాడు. అక్కడ తెగ ఎంజాయ్‌ చేస్తున్నాడట. వాణ్ణి చూస్తే కుళ్లుగా ఉంది.
త్వరగా వచ్చి నాన్నతో మాట్లాడి నన్ను బికాంలో చేర్పిస్తావు కదూ. ఇదంతా చెప్పుకోవడానికి నాకు మీరు తప్ప ఇంకెవరున్నారు. అందుకే మెయిల్‌ చేస్తున్నాను. వెంటనే మొయిల్‌ చేస్తారు కదూ. మీ మెయిల్‌ కోసం ఎదురుచూస్తూ...
బాయ్‌ మామయ్య
యువర్స్‌
లతిక

2 comments:

బ్లాగ్ చిచ్చు said...

జెన్ని
బొమ్మాలి
లతిక
మరీ ఇంత స్త్రిక్టా ..అంతా మాయ మీకు త్వరలోనే శాంతి దొరుకుతుందని ఆశిస్తూ ఒక కామెంట్

Anonymous said...

చాలా బాగా వ్రాశారు. మీ "ప్రయత్నాలు" విజయవంతమౌతాయని ఆశిస్తూ.....