తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచే ఆమెకు కష్టాలు మొదలయ్యాయి... పుట్టాక ఆమె ఏడుపు ఆపేందుకు ప్రయత్నించిన తల్లిదండ్రులకు ఓ చేదు నిజం... ఆ తర్వాత మాట లూ రావని తెలిశాక వారి మనసులో మరో గరళం. కన్నవారి ఆదరణే కరువైతే... చుట్టూ ఉన్నవారి అభిమానం తనదౌతుందా? అయినా ఆమె అదరలేదు. బెదరలేదు. కన్నీటి కడలిలో ఈదింది. చివరికి దరికి చేరింది. మౌనమే ఆమె భాష... ధైర్యమే ఆమె ఆస్తి... ఆమే హెలెన్ కెల్లర్ - 2007 అవార్డును అందుకున్న జానకి. జానకి డెఫ్ అండ్ డంబే కాదు రఫ్ అండ్ టఫ్ కూడా. తాను అనుకున్నది సాధించేంత వరకు పోరాడుతూనే ఉంటుంది. మాటలు రాకపోతే నేం. మౌనమే ఆమె భాష. ఆమె కన్నులు కూడా మాట్లాడతాయి. ఆ భావాలు అర్థం కాని వారి ముందు ఆమె చేతి వేళ్లు సెల్‌ఫోన్‌పై చకచకా కదిలి సమాధానాలు చెబుతాయి. వినిపించకపోతేనేం ఎదుటి వాళ్ల మనోభావాలను ఇట్టే పట్టేస్తుంది. తన జీవితంలో ఎన్నో చేదు అనుభవాలు... అవి తనలాంటి వారెవరికీ ఎదురుకాకూడదనుకుంది. అందుకే బధిరుల కోసం సంస్థకు స్థాపించి వారికి సేవ చేస్తోంది. జానకిది మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట. పుట్టి, పెరిగింది మాత్రం మహారాష్ట్ర పూనేలో. చదువు కూడా అక్కడే. ఇంటర్ వరకు చదువుకుంది. తల్లిద...