మనసంతా మ...మ్మ.. మాస్‌

By | September 18, 2009 3 comments

జూబ్లీహిల్స్‌ స్కార్లెట్‌ క్లబ్‌...
సర్రున ఓ కారు వచ్చి ఆగింది...
నలుగురు స్త్రీలు... తలకు పాగాలు.. నుదుట నల్లని తిలకం.. చేతిలో తుపాకులతో అందులోంచి దిగారు...
అక్కడి వారంతా వారిని చూసి బందిపోటు దొంగలనుకుని భయపడ్డారు. ఆ హోటల్‌ వారు కూడా కంగారు పడ్డారు.
అంతలోనే తేరుకుని ఆరాతీస్తే... ఓ పార్టీకి సరదాగా ఆ గెటప్‌లో వచ్చారని తెలుసుకుని నాలుక కరుచుకున్నారు. 'మామా... కల్లు మామా..' పాట చూశారుగా మాఫిమా గ్యాంగ్‌ పార్టీ ఎలా ఉంటుందో. మాఫియా డాన్లంటే మగాళ్లేనా మహిళలమూ ఏ మాత్రం తీసిపోమని సరదాగా ఆ గెటప్‌లో వచ్చారు వారు. చూశారా? వీరి మనసెంత మ... మ్మ... మాసో.

మనసు అచెంచలమైనది. మనదే అయినా అది మనకు చిక్కదు, దొరకదు. కొత్తవి కోరుకోవడం దానికి కొత్తేం కాదు. మోనాటనీ అంటే దానికి మొహం మొత్తుతుంది. చిటపట చినుకులు పడుతూ ఉంటే చెలికాడే సరసన ఉంటే చెట్టు నీడకై పరుగెత్తి వేడి వేడి మిరపకాయ బజ్జీలు తింటే చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగా ఉంటుంది. ఇది ఒకప్పుడు. కాని ఇప్పుడు వర్షంలో మిరపకాయ బజ్జీలు ఏ వెధవైనా తింటాడు ఐస్‌క్రీమ్‌ తినేవాడే రొమాంటిక్‌ ఫెలో అంటారు ఈ తరం వారు. ఔను అర్థరాత్రి అలా రోడ్డు మీద వెళ్తుంటే ఆన్‌ ది వేలో ఎన్ని ఐస్‌క్రీమ్‌ బళ్లుంటాయో ఎప్పుడైనా చూశారా. అంటే ఏంటీ? మనసెంతో మారిందనే కదా.

3 comments:

కొత్త పాళీ said...

మనసు చంచలమైనది అని మీ ఉద్దేశ మనుకుంటా.

భావన said...

ఏంటి ఇదంతా హైదరాబాద్ లోనే...

Anonymous said...

ఎందమ్మో టపాలు తెగ రాసెస్తున్నారు ఈ నెలలో అమ్మగోరు!