108 సంఖ్య ప్రాచీన భారతీయులకు చాలా పవిత్రమైనది. అన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలలోనూ 108 అనే సంఖ్యకు వారు చాలా ప్రాముఖ్యత నిచ్చారు. దేవున్ని / దేవతలను మంత్ర పుష్పాలతో పూజిస్తూ 108 పవిత్ర పూసలు గల జపమాలను గణిస్తూ జపం చేసేవారు. 108 సంఖ్య యొక్క ప్రాముఖ్యతను భారతదేశంలో హిందువులే కాదు, బౌద్ధులు, జైనులు, సిక్కులువంటి వారందరూ గుర్తించారు. తనలోని దైవత్వాన్ని గ్రహించటానికి ఆత్మ 108 మెట్లు దాటాలని వీరి నమ్మకం. ఈ సంఖ్య భగవంతునికీ భక్తునికీ మధ్య అనుసంధాన కారకమని భారతీయుల నమ్మకం. వేద ఋషులు ఖగోళ శాస్త్రానికి సంబంధించిన గణనలో.. భూమికి, చంద్రునికి మధ్య దూరం, చంద్రుని వ్యాసానికి 108 రెట్లు ఉందని.. భూమికి, సూర్యునికి మధ్య దూరం, సూర్యుని వ్యాసానికి 108 రెట్లు ఉందని.. సూర్యుని వ్యాసం భూమి వ్యాసానికి 108 రెట్లు అనీ నిర్థారించారు. ఈ వేదగణన ఆధునిక సాంకేతిక విశ్వగణనలో లభించిన భూమికీ, చంద్రునికీ, చంద్రునికీ సూర్యునికీ ఉన్న దూరంతో దాదాపు సరిపోయింది. ఆయుర్వేదం మనిషి శరీరంలో 108 మర్మ స్థానాలను గుర్తించింది. 108 అనే మర్మాల గొలుసులో 107 గ్రంధులు శరీరంలో ఉంటాయని ఆయుర్వేదం చెబుతుంది. ఇవి జీవచైతన్యం మానవ శరీరంలో...