Skip to main content

Posts

Showing posts from June, 2011

ఒక అమ్మాయి ఆఖరి లేఖ

ప్రపంచంలో ఇంత ఆనందంగా చనిపోయేది నేనే అనుకుంట. నాకు ఇష్టమైన పనులన్నీ చేసి మరీ చనిపోతున్న. నాన్నా ఏ తండ్రయినా కూతురిమీద అతిప్రేమ చూపిస్తాడు. కానీ నువ్వు అనుమానాలు చూపించావ్. కూతురి మీద అంత నమ్మకం లేనివాడివి ఆడపిల్లని ఎందుకు కన్నావ్. నేనేదో నిన్ను నువ్వు చేసిన పనికి చావట్లే. ఫ్యూచర్‌లో ఇలాంటి పనులు ఎన్ని చేస్తావో అన్న భయంతో చస్తున్నా. రేపట్నాడు నా బెస్ట్ ఫ్రెండ్‌తో కనిపించినా బోయ్‌ఫ్రెండా అని అడుగుతావ్. నీమీద భయంతో నేను ఇంత వరకూ ఎవర్నీ ప్రేమించలే. ప్రేమించను కూడా. చిన్నప్పట్నించి నీ పిల్లల కోసం నువ్వు ఏం చేశావో నీ మనసుతో ఆలోచించు. ఎప్పుడూ తిట్లు.. కోపాలు... అంతేకానీ మీమడిగిందేదైనా మనసుపెట్టి ఇచ్చావా? ఎంత సంపాదించి ఎంత కూడబెట్టినా పిల్లల సంతోషం కోసమే కదా. కానీ అది నువ్వు మాకు ఏ రోజు ఇవ్వలే నాన్న. అయినా నేను చనిపోతే మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు నాన్న. నా మీద అనుమానాలుండవు.. ప్రాబ్లమ్స్ ఉండవు. మనీ ఖర్చుకావు. కట్నం ఇవ్వాక్కర్లేదు... కదా సో బి హ్యాపీ. అన్నయ్యనన్నా ప్రేమగా చూసుకుంటావనుకుంటున్న. అమ్మ జాగ్రత్త. కోపం తగ్గించుకో. అన్నింటికీ కోపమొకటే పరిష్కారం కాదు నాన్న. ప్రేమగా ఉంటే నీకు అర్థమైత...

ఎవరినైనా ప్రేమిస్తే.. మనసుతో ప్రేమించండి. టైంపాస్ కోసం ప్రేమించకండి..

ఈ అమ్మాయి పేరు శ్రీదేవి. వినోద్ అనే అబ్బాయిని ప్రేమించింది. అతనితో కొంతకాలం తిరిగాక.. సంతోష్ అనే మరో అబ్బాయికి దగ్గరయ్యింది. తనకు దూరంగా ఉండడం వినోద్‌కి నచ్చలేదు. దీంతో 2010.. ఏప్రిల్ 18.. ఆదివారం.. బేగంపేటలోని లైఫ్‌స్టయిల్ బిల్డింగ్ నాలుగో అంతస్తు మీది నుంచి తోసేసి.. తానూ దూకాడు వినోద్. ఆ రోజు వినోద్ ప్యాంట్ జేబులో ఒక సూసైడ్‌నోట్ దొరికింది. మై లాస్ట్ డే సూసైడ్ లెటర్ అని మొదలుపెట్టాడు వినోద్. మూడేళ్లుగా నేనూ శ్రీదేవి పేమించుకుంటున్నాం... అయితే కొన్ని నెలలుగా ఆమె నాతో సరిగా మాట్లాడటం లేదు. ఇదే విషయమై అడిగితే సంతోష్ అనే యువకుని పేమిస్తున్నానని చెప్పింది. అది నాకు నచ్చలేదు. తనే జీవితంగా బతుకుతున్న నన్ను కాదని వేరొకర్ని ప్రేమించడం నేను భరించలేకపోయాను. తను నన్ను మోసం చేసింది. నాలా మరో యువకుని జీవితం నాశనం కాకూడదు. అందుకే తనను చంపాలనుకుంటున్నాను. తను లేనిది నేను బతకలేను. అందుకే నేనూ చనిపోతున్నాను... అని రాశాడు. ఎవరినైనా ప్రేమిస్తే.. మనసుతో ప్రేమించండి. టైంపాస్ కోసం ప్రేమించకండి.. అని కూడా రాశాడు. అమ్మానాన్నలకు సారీ చెప్పాడు. ఇప్పటివరకు మీకోసం ఏమీ చేయలేకపోయాను. నన్ను క్షమించండి.. అని రాశాడు.