ఒక అమ్మాయి ఆఖరి లేఖ

By | June 07, 2011 7 comments

ప్రపంచంలో ఇంత ఆనందంగా చనిపోయేది నేనే అనుకుంట. నాకు ఇష్టమైన పనులన్నీ చేసి మరీ చనిపోతున్న. నాన్నా ఏ తండ్రయినా కూతురిమీద అతిప్రేమ చూపిస్తాడు. కానీ నువ్వు అనుమానాలు చూపించావ్. కూతురి మీద అంత నమ్మకం లేనివాడివి ఆడపిల్లని ఎందుకు కన్నావ్. నేనేదో నిన్ను నువ్వు చేసిన పనికి చావట్లే. ఫ్యూచర్‌లో ఇలాంటి పనులు ఎన్ని చేస్తావో అన్న భయంతో చస్తున్నా. రేపట్నాడు నా బెస్ట్ ఫ్రెండ్‌తో కనిపించినా బోయ్‌ఫ్రెండా అని అడుగుతావ్. నీమీద భయంతో నేను ఇంత వరకూ ఎవర్నీ ప్రేమించలే. ప్రేమించను కూడా. చిన్నప్పట్నించి నీ పిల్లల కోసం నువ్వు ఏం చేశావో నీ మనసుతో ఆలోచించు. ఎప్పుడూ తిట్లు.. కోపాలు... అంతేకానీ మీమడిగిందేదైనా మనసుపెట్టి ఇచ్చావా? ఎంత సంపాదించి ఎంత కూడబెట్టినా పిల్లల సంతోషం కోసమే కదా. కానీ అది నువ్వు మాకు ఏ రోజు ఇవ్వలే నాన్న. అయినా నేను చనిపోతే మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు నాన్న. నా మీద అనుమానాలుండవు.. ప్రాబ్లమ్స్ ఉండవు. మనీ ఖర్చుకావు. కట్నం ఇవ్వాక్కర్లేదు... కదా సో బి హ్యాపీ. అన్నయ్యనన్నా ప్రేమగా చూసుకుంటావనుకుంటున్న. అమ్మ జాగ్రత్త. కోపం తగ్గించుకో. అన్నింటికీ కోపమొకటే పరిష్కారం కాదు నాన్న. ప్రేమగా ఉంటే నీకు అర్థమైతది ఇన్ని రోజులు నువ్వు ఏం కోల్పోయావో. పాపం నాన్న అమ్మ నిన్ను పెళ్లి చేసుకున్నప్పట్నించి కష్టాలు తప్ప సుఖం ఎప్పుడూ పొందలే. తన మనసు అర్థం చేసుకో. నీ కోసం వల్ల మేము మా చిన్న చిన్న ఆనందాలు కూడా కోల్పోయాం నాన్న. అర్థం చేసుకోవడానికి ట్రై చెయ్యి నాన్న. భై.. ఫరెవర్...
నా చివరి కోరిక తీర్చేసుకున్న నాన్న. అదే నాకు ఆనందంగా ఉంది. నీ కూతురు ఎప్పుడూ తప్పు చేయదు. నన్ను క్షమించండి. ఐ లవ్ యు డాడ్ అండ్ మామ్. నా వల్ల అన్నయ్య టూర్ క్యాన్సిల్ చెయ్యొద్దు. ప్లీజ్. ఇది నా చివరి కోరిక.
మీ
హారిక
(నవంబర్ 22, 2008న ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్న అమ్మాయి రాసిన సూసైడ్ నోట్.)



7 comments:

Praveen Mandangi said...

ఇక్కడ అడ్వర్టైజ్ చేస్తున్నందుకు క్షమించాలి. తెలుగు బ్లాగర్లకి గమనిక. మా అగ్రెగేటర్ తెలుగు వెబ్ మీడియా - కెలుకుడు బ్లాగులు గానీ బూతు బ్లాగులు గానీ లేని ఏకైక సకుటుంబ సపరివార సమేత అగ్రెగేటర్ http://telugumedia.asia యొక్క సర్వర్ ఇండియన్ డేటా సెంటర్‌లోకి మార్చబడినది. ఈ సైట్ ఇతర దేశాల కంటే ఇండియాలో మూడు రెట్లు వేగంగా ఓపెన్ అవుతుంది. భారతీయుల కోసమే ఈ సౌలభ్యం. మీ సైట్‌ని మా అగ్గ్రెగేటర్‌లో కలపడానికి administrator@telugumedia.asia అనే చిరునామాకి మెయిల్ చెయ్యండి.
ఇట్లు నిర్వాహకులు

Anonymous said...

what a crap suicide note...! it shows how immature the society and the family she grew up...!! the whole world praises the moral values this country produced and yet couldn't realize what these lives miss out...!!! Too bad - too stupid - too crap

Anonymous said...

మీరు మళ్ళీ మళ్ళీ అదే పోస్ట్ చేస్తుంటే 1000 మంది కన్నా ఎక్కువమందే చదువుతారు. ఆ అమ్మాయి బాధని ఒకసారి, రెండుసార్లు, మూడుసార్లు....తెలియజేసారు. పదే పదే రీపోస్ట్ చేస్తుంటే మీరు సానుభూతి వ్యక్తం చేస్తున్నారో, మీ బ్లాగు హిట్లని పెంచుకోవాలనుకుంటున్నారో అర్థం కావడం లేదు.

y.v.ramana said...

this girl suffered from depressive disorder . very ordinary thinking girl . so , what is the big deal ?

ఆ.సౌమ్య said...

pch...how sad!

Kschennakeshavulu said...

సానుభూతి వ్యక్తం చేస్తున్న

Unknown said...

vaadu thandrena