‘‘ఒక్క ఛాన్స్... ఒకే ఒక్క ఛాన్స్.. నేనేంటో ప్రూవ్ చేసుకుంటా’’ ‘‘కరక్టే కానీ ఇచ్చేవావరు?’’ - మది నిండా ఆశ.. గుండె నిండా తపన ఉంటే.. అంతకుమించి.. సిట్యుయేషన్ డిమాండ్ చేస్తుంటే.. ఆ ఛాన్స్ మనమే తీసుకోవాలి. బాధని సంతోషంగా మలుచుకోవాలి పైవాడి ‘స్క్రిప్ట్’ని సరిచేసుకోవాలి లైట్స్.. కెమెరా.. యాక్షన్... అప్పుడే ఆత్మసంతృప్తి. అంతకుమించిన జోష్. అలాంటి కథే రఫీస్ మూవీ ది వన్ మ్యాన్ షో సెప్టెంబర్ 5, సాయంత్రం ప్రసాద్ ల్యాబ్స్, ‘ఇంకెన్నాళ్లు’ సినిమా ఆడియో ఫంక్షన్ బ్యానర్ మీద టైటిల్స్ ఏమీ లేవు. రఫీస్ మూవీ అని మాత్రమే ఉంది. ఎవరీ రఫీ? పోస్టర్ మీదున్న హీరో జనాల మధ్య తిరుగుతున్నాడు. హడావుడిగా ఉన్నాడు. ఎవరో గెస్ట్ రాలేదని ఆందోళన చెందుతున్నాడు. ఫంక్షన్ స్టార్ట్ అయ్యింది. పెద్దలు ఒక్కొక్కరుగా మాట్లాడారు. హీరో వంతు వచ్చింది. అతనిలో ఏమూలనో బాధ. ఎవరికీ తెలియని ఒక వ్యధ. ఒక్కసారిగా కడుపులోంచి కట్టలు తెంచుకుంది. కన్నీరుగా ఉబికి వచ్చింది. ఆ కన్నీటి వెనుక సొంతగడ్డ మీద పరాయి అయిన ఆనవాళ్లు కనిపించాయి. అతని పేరు రఫీ. అచ్చ తెలంగాణ బిడ్డ. ఆ సినిమాకి కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, పాటలు, దర్శకత్వం, నిర్మాత... అన...