రఫీస్ మూవీ... ది వన్ మ్యాన్ షో

By | October 20, 2011 Leave a Comment



‘‘ఒక్క ఛాన్స్... ఒకే ఒక్క ఛాన్స్.. నేనేంటో ప్రూవ్ చేసుకుంటా’’
‘‘కరక్టే కానీ ఇచ్చేవావరు?’’
- మది నిండా ఆశ.. గుండె నిండా తపన ఉంటే..
అంతకుమించి.. సిట్యుయేషన్ డిమాండ్ చేస్తుంటే..
ఆ ఛాన్స్ మనమే తీసుకోవాలి. బాధని సంతోషంగా మలుచుకోవాలి
పైవాడి ‘స్క్రిప్ట్’ని సరిచేసుకోవాలి
లైట్స్.. కెమెరా.. యాక్షన్...
అప్పుడే ఆత్మసంతృప్తి. అంతకుమించిన జోష్.
అలాంటి కథే రఫీస్ మూవీ
ది వన్ మ్యాన్ షో


rapish-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinemaసెప్టెంబర్ 5, సాయంత్రం
ప్రసాద్ ల్యాబ్స్, ‘ఇంకెన్నాళ్లు’ సినిమా ఆడియో ఫంక్షన్
బ్యానర్ మీద టైటిల్స్ ఏమీ లేవు.
రఫీస్ మూవీ అని మాత్రమే ఉంది.
ఎవరీ రఫీ?
పోస్టర్ మీదున్న హీరో జనాల మధ్య తిరుగుతున్నాడు. హడావుడిగా ఉన్నాడు. ఎవరో గెస్ట్ రాలేదని ఆందోళన చెందుతున్నాడు. ఫంక్షన్ స్టార్ట్ అయ్యింది. పెద్దలు ఒక్కొక్కరుగా మాట్లాడారు. హీరో వంతు వచ్చింది. అతనిలో ఏమూలనో బాధ. ఎవరికీ తెలియని ఒక వ్యధ. ఒక్కసారిగా కడుపులోంచి కట్టలు తెంచుకుంది. కన్నీరుగా ఉబికి వచ్చింది. ఆ కన్నీటి వెనుక సొంతగడ్డ మీద పరాయి అయిన ఆనవాళ్లు కనిపించాయి. అతని పేరు రఫీ. అచ్చ తెలంగాణ బిడ్డ. ఆ సినిమాకి కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, పాటలు, దర్శకత్వం, నిర్మాత... అన్నీ తానే. అలా ఐదు సినిమాలు తీశాడంటే నమ్మగలరా? కానీ నిజం. అతని తపన... ఒక సముద్రం. అతని తాపం.. ఒక వర్షం.అతను ఒంటరి. వన్ మ్యాన్ ఆర్మీ.

ఫ్లాష్‌బ్యాక్
హోలీ.. హోలీల రంగ హోలీ.. చెమ్మకేళిల హోలీ..
యేడాదికొక్కసారి హోలీ.. చెమ్మకేళిల హోలీ..
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో...
మల్లెచెట్లు కిందికెంచి మదాన నా వయారి.. పల్లె పాటలన్నీ.. ఆ అబ్బాయి మదిలో నాటుకుపోయాయి.
స్కూల్ పాఠాలన్నీ హాస్టల్‌లో.. ఇంటర్ చదువు ఆంధ్రాలో..
‘‘నేను పెద్ద సింగర్‌ని అవుతాను’’ అన్నాడు స్నేహితులతో..
‘‘ఏటీ... సింగరైపోతావేటీ?’’ ఎగతాళి చేశారు స్నేహితులు.
పాట పాడి కాలేజ్ ఫంక్షన్‌లో ఫ్రైజ్ కొట్టేశాడు.


రఫీది కరీంనగర్ జిల్లా హుస్నాబాద్. షాదాన్ కాలేజీలో బిఎస్సీ మైక్రోబయాలజీ చేసేందుకు హైదరాబాద్ వచ్చాడు. ఆ సమయంలోనే ‘ఆల్బమ్’ చేయాలని అనుకున్నాడు. పాటలు రాసుకున్నాడు. బాణీలు కట్టుకున్నాడు. థియేటర్ల చుట్టూ తిరిగాడు. ఎంత డబ్బు ఖర్చవుతుందో లెక్కలేసుకున్నాడు. సెలవుల్లో ఇంటికి వెళ్లి రైస్‌మిల్‌లో పనిచేశాడు. పైసా పైసా కూడబెట్టుకున్నాడు. వరంగల్‌లో ఎంబిఏ పూర్తిచేశాడు. ఇక ఒక్కటే లక్ష్యం.. ఆల్బమ్.

2003.. 
rapish1-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinemaదర్ద్ కీ ముస్కాన్... హిందీలో ఆడియో ఆల్బమ్. పాటలు రికార్డ్ చేయాలంటే.. అప్పట్లో గంటకు 1200 రూపాయలు. స్కూటర్ మీద వెళితే గేటు దాటి లోపలికి రానీయలేదు. సెక్యూరిటీ. చిన్న మారుతీ వ్యాన్ కొనుక్కున్నాడు. ప్రసాద్ ల్యాబ్స్‌లో రికార్డింగ్.. మొత్తం డబ్బు కట్టాల్సి ఉంది. కానీ.. అంత సొమ్ము లేదు. రిక్వెస్ట్ చేసి.. క్రెడిట్ పెట్టాడు. ఐదు పాటలతో హిందీ ఆల్బమ్ అదిరిపోయింది. ఆ క్యాసెట్ తీసుకుని ముంబాయికి వెళ్లాడు. ‘వీనస్’ మ్యూజిక్ సంస్థ పెద్ద మొత్తంలో సొమ్ము ఇస్తానంది. కానీ రెండు సంవత్సరాలపాటు అగ్రిమెంట్ అడిగింది. అది ఇష్టం లేదు రఫీకి. తిరిగి హైదరాబాద్ వచ్చాడు. ఏం చేయాలో అర్థం కాలేదు.

మధురమైన బాధ
హిందీ ట్రాక్స్‌నే తీసుకుని తెలుగులో ఆల్బమ్ చేశాడు. పేరు ‘మధురం’.
‘‘గుంట భలేగుందిరో..’’ పాట దుమ్ములేపింది. స్నేహ మార్కెటింగ్ వారు ఆడియో రైట్స్ కావాలన్నారు. వాళ్లే.. ఆఫీస్ ఇచ్చారు. ట్రైలర్స్ కూడా రిలీజ్ చేస్తామన్నారు. అందుకు చీరాలలో రెయిన్ ఎఫెక్ట్‌లో వీడియో షూట్ చేశాడు. ఫిలిం ఛాంబర్‌లో పాటల విడుదల. వన్స్‌మోర్‌లు.. కాంప్లిమెంట్‌లు.. తెలంగాణలోనే లక్ష క్యాసెట్లు అమ్ముడుపోయాయి. కొత్త ఉత్తేజం.. కొత్త ఆలోచనలు.. పాటలు ఇంత హిట్ అయ్యాయి కదా.. సినిమా తీస్తే ఎలా ఉంటుంది?
సినిమా అంటే మాటలా? ఆల్బమ్ అంటే.. నాలుగు కీబోర్డులు... ఒక థియేటర్. మరి సినిమా అంటే?

24 క్రాఫ్ట్స్. 
మనసుంటే హైవే దొరక్కపోదు. ప్రయత్నం మొదలైంది.
కథ.. మాటలు.. పాటలు.. కొరియోక్షిగఫీ.. సంగీతం.. దర్శకత్వం.. నిర్మాణం.. ఇలా 14 విభాగాలు రఫీ ఒక్కడే చూసుకున్నాడు. ఇంకొకర్ని పెట్టుకోవాలంటే ఖర్చుతో కూడుకున్న పని. తప్పలేదు. అతనే హీరో. అతనొక్కడే ఆ సినిమాకి హీరో.
12 లక్షల క్రెడిట్‌తో సినిమా పూర్తయింది. పాటలు హిట్ అవ్వడంతో.. బయ్యర్లు కొన్నారు. మంచి టాక్ వచ్చింది. టాలెంట్ ఉంటే అవకాశం వెతుక్కుంటూ వస్తుంది.

అవును నిజమే...
‘ప్రియా సిమెంట్’ రాధాకృష్ణారెడ్డి. మధురం సినిమా చూసి.. కబురు పంపాడు.
కట్ చేస్తే.. 12 లక్షలు.. 30 రోజులు.. తనూరాయ్ హీరోయిన్‌గా సినిమా. అప్పటి వరకు రాజీ పడని రఫీ. కాంప్రమైజ్ అయి సినిమా తీయాల్సి వచ్చింది. తాను అనుకున్న టైటిల్ వేరు. బయటికొచ్చిన సినిమా వేరు.. పేరు ‘అవును.. నిజమే.. లవ్ ఈజ్ గ్రేట్’. అప్పుడే డిసైడ్ చేసుకున్నాడు ఇక ఏ నిర్మాతనీ బతిమాలకూడదని. ఎవరి దగ్గరా తలవంచకూడదని.
అంతో ఇంతో డబ్బు సంపాదించాలి. దానికంటే ముందు ఆఫీస్ ఉండాలి.. కానీ ఎలా? మళ్లీ ఆలోచన. ఆ సమయంలోనే అమ్మ చనిపోయింది.

ఇంట్వల్
ఆఫ్టర్ ద బ్రేక్ 

జూబ్లీహిల్స్‌లో రఫీకి ఒక ఖాళీ స్థలం కనిపించింది. ఆ స్థలాన్ని డెవలప్ చేయాలన్న ఆలోచన స్పాంటేనియస్‌గా వచ్చింది. ఎవరి ప్లాటు? ఎవరు డెవలప్ చేసేది? తనను తానే ప్రశ్నించుకున్నాడు. ఎంక్వయిరీ చేస్తే ఓనర్ సౌదీలో ఉన్నాడు. నమ్మకం కలిగిస్తే ఒప్పుకున్నాడు. నీకెంత? నాకెంత?.. 50.. 50.. జేబులో రెండు వేల రూపాయలే ఉన్నాయి. బిల్డింగ్ ఎలా కట్టాలి? ఫ్యాక్స్‌లు.. అగ్రిమెంట్లకే ఆ డబ్బు ఖర్చయిపోయింది. ఏదో గుడ్డి నమ్మకం. భూమి పూజ జరిగింది. పునాది తవ్వారో లేదో.. మొదటి ఫ్లాట్ బుక్ అయ్యింది. ఆ డబ్బుతో.. ఇటుక మీద ఇటుక లేసింది. ‘టైమ్’ అతనికి తోడుగా నడిచింది.


ఎన్ శంకర్ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా చేసే అవకాశం వచ్చింది. యూత్‌ఫుల్ మూవీ. కానీ ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. అవకాశం జారిపోతేనేం.. అతనికిప్పుడు ఆఫీస్ ఉంది. రెండు సినిమాలు తీసిన అనుభవం ఉంది. అంతకుమించిన ఆలోచనలు మనసులో ఉన్నాయి. ఇంకో సినిమా ప్లాన్ చేశాడు. మిస్టర్ రాహుల్.. పక్కా ఫ్రొఫెషనల్.. సాఫ్ట్‌వేర్ బూమ్ మీద మంచి కామెడీ సినిమా.
చేతిలో ఉన్న డబ్బు.. అలవాటయిన అప్పు.. ఏదైతేఅదయిందన్న తెగింపు.. సినిమా పూర్తయింది.
ముంబాయి నుంచి కొందరు బయ్యర్లు.. సినిమా హిందీలో కావాలన్నారు. దాన్నే ‘హ్యాపీ రిటర్న్స్’గా హిందీలో డబ్ చేశాడు. ఈ రెండూ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
కానీ ఇప్పుడు రిలీజ్ చేయాల్సిన టైమ్ కాదు.
మలిదశ తెలంగాణ ఉద్యమం..
పాటలు.. సాహిత్యం.. సినిమాలు... ధూమ్‌ధామ్ చేస్తున్న రోజులు...
తెలంగాణలో పుట్టినందుకు.. ఉద్యమానికి ఉప్పందియ్యాలనుకున్నాడు.
సినిమా తీయాల్సిన అవకాశం రాలేదు.. అవసరం వచ్చింది.
అదే ‘ఇంకెన్నాళ్లు’ సినిమా..
తెలంగాణ కోసం ఈ పోరాటం ఇంకెన్నాళ్లు.. వాయిస్ ఆఫ్ తెలంగాణ థీమ్ లైన్.
తెలంగాణలో ఒక మారుమూల పల్లెటూరు.. ఒక కుటుంబం.. మూడు తరాల బతుకు దెరువులు.. బలిదానాలు.. పోరాటాలు.. ఇదీ స్టోరీ లైన్.
వాస్తవాల్ని.. నిజాయితీగా నిర్భయంగా చెప్పాలనుకుంటున్నాడు.
చేయాలుకున్నది చేసినప్పుడు.. చేసిన దానికి ఫలితం దొరి నప్పుడు ఎంతో సంతృప్తి.
రఫీ ఇప్పుడు ఫలితం కోసం ఎదురుచూస్తున్నాడు.
అది డిసైడ్ చేయాల్సింది మీరే.

‘ఇంకెన్నాళ్లు’ హైలైట్స్
పాటలు సూపర్. మ్యూజిక్ అదుర్స్. రఫీ మూడు పాటలు రాశాడు. నాలుగు పాటలు పాడాడు. తెల తెల మల్లె తెలంగాణ పాట.. మోడ్రన్ మిక్సింగ్‌తో బాగుంది.
డాక్టర్ సి నారాయణడ్డి రాసిన.. ‘ఏమి వెలుతురు..’ పాటలో ‘రాజు రాణి బిడ్డాట.. వలో.. రంభా దొరసానీ... మల్లే చెట్టు కిందీ కెంచి మదాన నా వయ్యారీ.. బిట్‌లు.. అలా వానాకాలం మధ్యలో ఎండలా వచ్చి పోవడం ఎంత బావుందో.
నర్సిడ్డి జీర గొంతులో ‘గిచ్చన్న గిరి మల్లెలో.. నీ పాలన అచ్చి రాకున్నాదిరో.. ’ పాట ఒదిగిపోయింది.
రఫీ తండ్రి అఫ్సర్ ‘బుడి బుడి అడుగులు తడబడి.’’ పాట రాశాడు. సినిమాలో పాత తరాలకు మాటలు ఈయనే రాశాడు.
రఫీ దగ్గర అసిస్టెంట్‌గా చేరిన కుసుమాంజలిది గుజరాత్. తెలంగాణ గురించి ఆమెకు ఏమీ తెలియదు. సినిమా కోసం రీసెర్చ్ చేసిన తర్వాత ‘మన తెలంగాణ మనకు ఇవ్వడంలో తప్పేముంది?’’ అంది.
తెలంగాణ నుంచి హీరోయిన్ దొరక్కపోతే.. కుసుమాంజలే హీరోయిన్‌గా చేసింది. బుడి బుడి అడుగులు పాట కూడా పాడింది.
సినిమాలో కుసుమాంజలికి తెలంగాణ గాయని రమాదేవి డబ్బింగ్ చెప్పింది.
ఇంకెన్నాళ్లు సినిమా తెలంగాణ అవస్థల మీద కాదు. మన వ్యవస్థ మీద. 
బీరెడ్డి నగేష్‌డ్డి
ఫోటోలు : కంది కపిల్‌వూపసాద్









0 comments: