మరకా మంచిదే అని వాళ్లు ఎప్పుడైతే గ్రహించారో.. అప్పుడూ...

By | December 08, 2011 1 comment
మరకా మంచిదే... happy-holi-wallpaper talangana patrika telangana culture telangana politics telangana cinemaసర్ఫ్ ఎక్సెల్ ఉన్నప్పుడు!
ఇదేదో సర్ఫ్ ఎక్సెల్ ప్రమోషన్ అనుకునేరు...
కాదు.. మరకలాంటి విమర్శను వాషవుట్ చేసే ప్రయత్నం.
అయితే ఇక్కడ ఈ మరకను పోగొట్టడానికి ఏ కంపెనీ వాషింగ్ టానిక్ లేదు.
సెల్ఫ్‌చెక్కే దాన్ని సెట్‌రైట్ చేసే డిటర్జంట్. అందుకే విమర్శా మంచిదే. సెల్ఫ్‌చెక్ యాటిట్యూడ్ ఉన్నప్పుడు.
‘ఏరా షర్ట్ మీద ఈ మరకలేంటి?’ అని అమ్మ చిన్నప్పుడు తిట్టేది.
‘చిన్నపిల్లాడిలా షర్ట్ మీద ఈ మరకలేంటి?’ అని భార్యామణి గొణుగుతోంది.
అప్పుడూ ఇప్పుడూ షర్ట్ ఎంత కామనో.. మరక కూడా అంతే కామన్. తిట్టేవారు మాత్రం మారారు. అప్పుడు అమ్మ.. ఇప్పుడు ఆవిడ! మరి మనం ఎందుకు మారలేదు? ఎందుకంటే మనకు మరకంటే పరమ చిరాకు. చిన్నప్పటి నుంచి మరక మంచిది కాదు అనే మాటలకు మనం ఎడిక్ట్ అయిపోయి ఇంకా సామాన్యులుగా బతికేస్తున్నాం. మనలాగే సర్ఫ్‌ఎక్సెల్ వాళ్లు కూడా భయపడితే మార్కెట్‌లో నిలిచేవారా? మరకా మంచిదే అని వాళ్లు ఎప్పుడైతే గ్రహించారో.. అదే నినాదంతో ప్రత్యర్థులను గెలిచారు? కానీ.. మనం ఇంకా మరకకు భయపడే బతుకుతున్నాం.

పాజిటివ్ టర్న్
‘పనికి రాని వెధవ.. పనికి రాని వెధవ’ అంటూ పదింటి వరకు పడుకున్న కొడుకుపై నాన్న చిరాకు పడతాడు. ‘పదే పదే వాడ్ని అలా అంటే నిజంగానే పనికిరాకుండా పోతాడండీ’ అని కిచెన్‌లోంచి అమ్మ కౌంటర్ ఇస్తుంది. ఇలాంటి సీన్లు ప్రతి ఇంట్లో మనం చూస్తూనే ఉంటాం. ‘తినగ తినగ వేము తియ్యనుండు.. ’ అన్నాడో కవి. కానీ ‘అనగ అనగ అలాగే మారు’ అంటున్నారు మానసిక నిపుణులు. అలాంటి సమయంలోనే మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి. ‘నువ్వు భలే నవ్విస్తావని మీపై ఎవరైనా ముద్రవేశారా? బైక్ బాగా నడుపుతావని కాంప్లిమెంట్ ఇచ్చారా?’ అయితే ఫర్వాలేదు. దాన్ని మీరు పాజిటివ్‌గా తీసుకుని ఉంటారు. ‘దీనికసలు మాట్లాడడమే రాదు, వీడు రెండు పెగ్గులకే అవుటవుతాడు- అని మీ మీద బ్రాండ్ వేశారా? అయితే దీన్ని మీరు నెగెటివ్‌గా తీసుకుని ఉంటారు. పాజిటివ్‌గా తీసుకున్నప్పుడే కదా.. మీ పవరేంటో నిరూపించుకునేది!

ముద్రను కడిగేయండి...
‘దీనికి ఫంక్షన్లకు రావడమంటే అస్సలు ఇష్టం ఉండదు. నలుగురిలో కలవదు. నవ్వుతూ మాట్లాడదు’అని రేణుకపై చిన్నప్పటి నుంచీ ముద్రవేశారు ఇంట్లో వాళ్లు. ఇప్పుడు రేణుక ఫంక్షన్లకే కాదు, నలుగురి మధ్యకు వెళ్లాలం భయపడుతూ, బిడియపడుతోంది. మరి రాకేష్ అలా కాదు. నిన్నెవరూ ప్రేమించకపోతే అది కచ్చితంగా నీతప్పే అని అంటారు. రాకేష్‌కు కూడా అలాంటి అనుభవమే ఎదురైంది. రాకేష్‌కు గర్ల్‌వూఫెండ్స్ ఎవరూ లేరని ఫ్రెండ్స్ ఎప్పుడూ ఎగతాళి చేసేవారు. కానీ తాను ట్రై చేస్తే వెనకాల క్యూ కడతారని రాకేష్‌కు తెలుసు. అందుకే ఆన్‌లైన్‌లో లవ్‌టెస్ట్ చేసుకుని తాను ఎంత మంచి లవర్ కాగలడో నిరూపించుకున్నాడు. ఇలా తన మరకను కడిగేసుకున్నాడు మరి. కాలికి మరక అంటితే.. కడుక్కుంటాం.. గానీ కట్ చేసుకుంటామా?

సెల్ఫ్ చెక్
మీపై బ్రాండ్ వేస్తే మీలో ఉన్న అసలు లక్షణాలు కనుమరుగై పోతాయని భయపడాల్సిన పనిలేదు. మిమ్మల్ని మీరు ఫ్రూవ్ చేసుకోవడానికి అదే మంచి అవకాశం అనుకోండి. అందుకు ఆన్‌లైన్‌లో ఎన్నో వెబ్‌సైట్లు మీకోసం విండోస్ తెరుచుకుని ఉంటాయి. అందుకే మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి ఆన్‌లైన్‌ను ఆధారం చేసుకోండి. మీరు దేంట్లో వీక్ అని మీ ఫ్రెండ్స్ ఎగతాళి చేశారో? ఆ అంశాల్ని ఎన్నుకోండి. దానిపై ఆ వెబ్‌సైట్‌లో కొన్ని ప్రశ్నలు ఉంటాయి. వాటికి మీరిచ్చిన సమాధానాలను బట్టి మీ పర్సనాలిటీని లెక్కించి మీరేంటో చెబుతుంది. అంటే సెల్ఫ్‌చెక్ అన్నమాట. హెయ్.. ఇది నిజమా అనకండి. ఫేస్ ఇజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అని నమ్ముతారు కదా. మీరు ఇష్టపడే రంగును బట్టి మీ పర్సనాలిటీని చెప్పొచ్చాలేదా? ప్రశ్నకు సమాధానం ఉన్నట్లే.. టెస్ట్‌కి రిజల్ట్ ఉంటుంది. మీ సెల్ఫ్ చెక్ మీ ఐక్యూని కచ్చితంగా అంచనా వేస్తుంది.

ఇంటర్‌నెట్‌లో సెల్ఫ్‌చెక్ చేసుకోవాలంటే ఈ వెబ్‌సైట్లని క్లిక్ చేయండి. మీ మీద మరక వేసిన వారికి ప్రింట్ తీసి మరీ చూపించి మరకని కడిగిపారేయండి.
www.personalitiquiz.net
www.helpself.com
www.yourpersonality.net
www.personalitylab.org
www.brainbench.com
www.personalitytest.net
www.testcafe.com
www.2h.com
www.tickle.com
www.allthetests.com

1 comments:

Anonymous said...

[url=http://mypaydayloans1h.com/#bb4beereddy.blogspot.com]payday loans[/url] - payday loans , http://mypaydayloans1h.com/#sb4beereddy.blogspot.com payday loans