ఆమె దేహం ఒక సారి చూడాలని..

By | July 23, 2012 Leave a Comment

యూట్యూబ్ సెర్చ్‌లో ‘జిస్మ్ 2’ అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. పేజీకి 23 వీడియోలు కనిపిస్తాయి. అలా 50 పేజీలు. అంటే 1,150 వీడియోలు. ఒక్కో వీడియోని సుమారు 500 మందికి పైగా చూశారు. కొన్నింటిని లక్ష మందికి పైనే చూశారు. అంటే మొత్తంగా కోట్లాది మంది ఆ వీడియోల్ని చూశారు.. చూస్తున్నారన్నమాట. ‘జిస్మ్’ అంటే దేహం. ఒక దేహం గురించి కోట్ల మంది వెతుకుతున్నారంటే, ఆరాధిస్తున్నారంటే ఆమె ఒక దేవత అయి ఉండాలి. అవును..ఆమె ఒక దేవత. లక్షల కోట్ల మంది మౌనంగా, రహస్యంగా, మనసులో, చీకట్లో ఆమె (దేహాన్ని)ని ఆరాధిస్తున్నారు. ఆమె పేరు సన్నీ లియోన్. ఆమె వెబ్‌సైట్‌లోని వీడియోల్లో ‘సన్నీ లియోన్.. ది గాడెస్’ అనే టైటిల్ కార్డే ఇందుకు ‘బ్లూ’ విట్‌నెస్.

2003లో ‘జిస్మ్’ సినిమా విడుదలైంది. దర్శకుడు, నిర్మాత మహేష్ భట్ ఈ సినిమాకి కథ, స్క్రీన్‌ప్లే అందించి, నిర్మించారు. అమిత్ సక్సెనా దర్శకత్వం వహించారు. 1944లో ‘బిల్లీ విల్డర్స్’ తీసిన హాలీవుడ్ మూవీ ‘డబుల్ ఇన్‌డెమ్నిటీ’ని జిస్మ్ పేరుతో రీమేక్ చేశారు. ఈ సినిమాలో అప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ మీద కనిపించని ‘హాట్’ సీన్లని అమిత్ చూపించాడు. జాన్ అబ్రహాం, బిపాసా బసు అద్భుతంగా నటించారు. అప్పట్లో వాళ్లిద్దరు రియల్ లైఫ్‌లోనూ లవర్స్ కావడంతో రెండు దేహాల మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది... రొమాంటిక్ సీన్లు కెవ్వు కేక పుట్టించాయని టాక్ ఉంది. అందుకే ఛానెల్ 4 ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన టాప్ 100 సెక్సీయెస్ట్ మూవీ సీన్స్ పోల్‌లో ‘జిస్మ్’ సినిమాకి 92వ స్థానం దక్కింది.

ఇది జిస్మ్ గురించి. దానికి సీక్వెల్‌గా ‘దేహం 2’ అదే ‘జిస్మ్ 2’ వస్తోంది.
‘జిస్మ్’ సినిమా వచ్చి ఎనిమిదేళ్లు. మహేష్ భట్ ఆ ‘దేహం’ గురించి ఇంకా మర్చిపోలేదు. సీక్వెల్ తీయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. 2011లో బిగ్‌బాస్ రియాలిటీ షో మొదలైంది. అందులో సన్నీ లియోన్ కూడా పాల్గొంది. సన్నీ లియోన్ అంటే సాధారణ వ్యక్తి కాదు. ఇండియాలో పుట్టి అమెరికన్ ఎడల్ట్స్ మూవీస్‌తో టాప్ ‘బ్లూ’ స్టార్‌గా ఎదిగింది.
‘‘నేను ‘బిగ్‌బాస్’లో కనిపించిన పుణ్యాన లైంగికత గురించి బహిరంగంగా మాట్లాడే ధైర్యాన్ని చాలామంది భారతీయులు పుణికి పుచ్చుకున్నారు’’ అని బోల్డ్ స్టేట్‌మెంట్ ఇచ్చి సన్నీ ‘హాట్’ టాపిక్ అయింది.
అందుకే ఇండియన్స్‌కి సన్నీ మీద ఇంట్రెస్ట్ పెరిగింది. ఇంటర్‌నెట్‌లో వెతకడం మొదపూట్టారు. లక్షల మంది వీడియోలు డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఆమె దేహాన్ని ఆరాధించారు. అలాంటి దేహం కోసమే మహేష్ భట్ వెతుకున్నారు. వెంటనే బిగ్‌బాస్ షోలో ప్రత్యక్షమయ్యారు. ఒక్క సిట్టింగ్‌లో ‘జిస్మ్ 2’ సినిమా కోసం సన్నీ సైన్ చేసింది.

మహేష్ భట్ కూతురు పూజా భట్ దర్శకత్వం వహిస్తుండడం వల్ల ఈ సినిమా పట్ల మరింత క్రేజ్ పెరిగింది.
సన్నీ నగ్న దేహంపై పలుచని తెల్ల చీర కప్పి ‘జిస్మ్ 2’ ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. ఆ తర్వాత లీక్ అయిన ఫోటోలు, పాటలు, వీడియోలు.. యూట్యూబ్‌లో హల్ చల్ చేస్తున్నాయి.
‘జిస్మ్ 2’ కోసం ఇప్పుడు చాలామంది ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. జూలై 27న విడుదల కావాల్సింది.. వారం రోజులు పోస్ట్‌పోన్ అయింది. ఆగస్టు 3న ‘జిస్మ్2’ విడుదల కానుంది. సో.. బీ రెడీ టు వాచ్ ఏ హాట్ బాడీ.

sexology సన్నీ లియోన్
అసలు పేరు : కరెన్ మల్హోత్రా
ముద్దు పేరు : సన్నీ
పుట్టింది : పంజాబ్‌లో
వయస్సు : 31 సంవత్సరాలు
ఎత్తు : 5 అడుగుల 4 అంగుళాలు
బరువు : 50 కేజీలు
భర్త : డేనియల్ వెబెర్
తొలి చిత్రం : పెంట్‌హౌస్ పెట్స్ ఇన్
ప్యారడైజ్ (2001)
- ఇప్పటి వరకు 38 ఎడల్ట్స్ చిత్రాల్లో నటించింది.
- 39 నీలి చిత్రాలకు దర్శకత్వం వహించింది.

0 comments: