కొమరం భీము గురించి తెలియని కొన్ని నిజాలు

By | October 08, 2014 Leave a Comment
komaram
గూగుల్‌లో komaram అని టైప్ చేయగానే.. komaram puli అని వస్తుంది. టైప్ చేయగానే ప్రారంభ అక్షరాల నుంచి పాపులర్ నేమ్ (సెర్చ్ కీ)ని చూపించడం గూగుల్ ైస్టెల్. మన కుంరం భీము నిజంగా పులి. కానీ గూగుల్‌లో అదొక సినిమా పేరు.. ఒక సినిమాకున్న పాపులారిటీ మన వీరునికి లేదు. (ఇందులో గూగుల్ తప్పు ఏమీలేదు)
తప్పంతా మనదే. 

మన గొప్పతనం గురించి, మన వారి వీరగాథల గురించి మనం ఎంతగా రాసుకుంటే అంతగా గుర్తిస్తుంది గూగుల్. గూగుల్ అంటే ప్రపంచం. గూగ్లింగ్ ప్రపంచంలో చాలామంది చేసే పనే.గోండుల హక్కుల సాధన కోసం జంగ్ సైరన్ మోగించిన మన పోరాట యోధుని గురించి ఈ ప్రపంచానికి తెలియాలి. ఆ మహావీరుని పోరాట పటిమ, అరాచక శక్తులపై పూరించిన సమరశంఖం గురించి ఈ-తరం తెలుసుకోవాలి. 

ఈ-తరం అంటే? యువతరం. పైగా యంగ్ తరంగ్‌లం అని చెప్పుకుంటాం కదా. మనకు పుస్తకాలు (పాఠ్య పుస్తకాలు కాదు) చదివే అలవాటు ఎక్కడుంది చెప్పండి? వీరుల గురించి తెలుసుకునే తీరిక ఏడుంది? ఒక మగధీర, ఒక బాహుబలి మీద ఉన్న ఆసక్తి తప్ప.సినిమాగా వస్తేనే ఆసక్తా? కుంరం భీము జీవితం సినిమాకి ఏమాత్రం తగ్గని వీరగాథ.

అవును బాస్.. అల్లాణి శ్రీధర్ కూడా తీశాడుగా సినిమా. కొమరం భీమ్.. ఇప్పుడు బాలీవుడ్‌లో కూడా తీస్తున్నాడు. అది గూగుల్‌లో మొదటగా ఎందుకురాదు? ఎందుకంటే అందులో పీకే, ఏఏ లాంటివారు లేరు కదా!

ఇంతకీ ఏవరీ కుంరం భీము? ఆయన చేసిన త్యాగమేంటి? ఆయన గురించి మనకు తెలిసిందెంత? తెలియాల్సింది ఇంకా ఉందా? పోనీ.. గూగుల్‌లో వెతికి చూద్దామా? ఏమొస్తుంది...మొదటగా ఇంగ్లీష్ వికీపీడియా.. 
కొమరం భీమ్ బార్న్: 22 అక్టోబర్ 1901
డెత్ : 19 అక్టోబర్ 1940 
అదే తెలుగు వికీపీడియాలో..
జననం: సెప్టెంబరు 27, 1900 
మరణం: సెప్టెంబరు 1, 1940 
ఇంగ్లీషు.. ెలుగు.. రెంటినీ పోల్చి చూడండి..!! ఇందులో దేన్ని నమ్మాలి? అసలు వికీపీడియానే పూర్తిగా నమ్మొద్దు. ఎందుకంటే దీన్ని ఎవరైనా ఎడిట్ చేయొచ్చు. ఇంతకీ వాస్తవమేంటి? 
ఆ వాస్తవమేంటో ఇక్కడ క్లిక్ చేసి చదవండి. 

ఆర్టికల్ నచ్చితే మా ఫేస్ బుక్ పేజీలో ఓ లైక్ కొట్టేయండి. 


0 comments: