*Shall we meet today for lunch* ఒక మెసేజ్ ఎప్పుడో వచ్చి సెల్ ఫోన్ Inboxలో కూర్చుంది. ఎవరు పంపిండ్రో. ఊరు లేదు. పేరు లేదు. ఆలోచిస్తూ ‘but who r u ?’ రిప్లయి ఇచ్చా ‘ananya’ రిప్లె వచ్చింది. అనన్య? ఎవరీ అనన్య?? ఆరు సెకన్ల కంటే ఎక్కువ పట్టలేదు గుర్తు చేసుకోవడానికి. టక్కున తట్టింది. యస్.. అనన్య. షార్ట్ ఫిల్మ్ మేకర్. ముంబై. మంచి సందేశంతో షార్ట్ ఫిల్మ్ తీసింది. నిర్భయ గురించి. రెండు వారాల క్రితం.. యూట్యూబ్లో చూశాను. ‘జిందగీ’కి స్టోరీ చేయాలనిపించింది. ఫేస్బుక్లో వెతికి పట్టుకుని, ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించాను. కానీ యాక్సెప్ట్ చేయలేదు. తర్వాతి రోజు మెసేజ్ పెట్టాను. ఇంటర్వూ కావాలని.. ఇన్ బాక్స్ లో తెలియని అమ్మాయిలు వెంటనే రిప్లె ఇవ్వరు. అనుకున్నాను.. కానీ అనన్య ఇచ్చింది. ‘థ్యాంక్యూ బాస్! మీ మెసేజ్ చూసి షాక్ అయ్యాను. అదేంటి నేను వెతుకుతున్న వ్యక్తి నాకే మెసేజ్ పెట్టారని. ఇట్స్ ఏ మిరాకిల్!’ అంది మెసేజ్లో. ‘వాట్ నన్ను వెతుకుతున్నారా? ఆశ్చర్యంగా ఉందే! ఎందుకు?’ టెక్ట్స్ చేశా. ‘చెప్తా. బట్ ఇప్పుడు కాదు (స్మైలీ)’ ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట...