నదీ ప్రవాహంలోకి కొత్త నీరు వచ్చినప్పుడు పాతనీరునూ కలుపుకొని పోతుంది. పాతని నెట్టేసి కొత్తది ముందుకు పోలేదు. ఈ రెండింటి మధ్య తరాల అంతరం ఉంది. నిన్నటి తరం ఒంటెద్దు బండిలో వెళ్తున్నది. ఈ తరం కారు వేగంలో వెళ్తున్నది. ఇద్దరి మధ్యన కమ్యూనికేషన్ కట్ అయిపోతోంది. దూరం అంతకంతకూ పెరిగిపోతున్నది. ఆ తరమైనా ఈ తరమైనా కొత్తను పట్టుకోవాలి. పాతను పట్టుకెళ్లాలి అంటారు ప్రముఖ రచయిత, నటుడు ఎల్బీ శ్రీరాం. కడుపు నింపుకోవడానికి ఆయనింకా కమర్షియల్ సినిమాలు చేస్తున్నా.. మనసు నింపుకోవడానికి తనకు తాను ఇంకేదో చేయాలని ఈ మధ్య సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టారు. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ పేరుతో ఎల్బీ శ్రీరామ్ షార్ట్ (హార్ట్) ఫిల్మ్స్ చేస్తున్నారు. ఈ తరం ఆయన బండి ఎక్కలేదు. అందుకే కలిసి వెళ్లొచ్చు.. వేగంగా వెళ్లొచ్చు.. భావాలూ పంచుకోవచ్చు అని ఆయనే మన కారు ఎక్కి కూర్చున్నారు. గమ్యం కాదు.. ఆ ప్రయాణం నాకిష్టం అంటున్నారు. ఏమిటా ప్రయాణం? నమస్తే అండీ! కావడి బద్ద వదిలేసి టీషర్టు వేసుకుని కారెక్కారు.. ఎలా ఉంది ప్రయాణం? నమస్తే! బావుంది. అనుకున్నదానికంటే పదిరెట్ల ఉత్సాహంగా కూడా ఉంది. రచయితగా.. నటుడుగా.. తెలుగు ప్రజల ఆదరా...