ఆదిమానవుడు ఆకులు కప్పుకునేవాడు. చెట్ల తొర్రలలో నివసించేవాడు. ఒక రాయిని మరొక రాయితో రాపడించి నిప్పు పుట్టించేవాడు. రాతి పాత్రలతో.. పరికరాలతో పని వెళ్లదీసుకునేవాడు. కానీ ఆదిమానవుడు ఉండేవాడు? ఏ విధమైన జీవనశైలి అవలింబించేవాడు?.. ఈ ప్రశ్నలకు పూర్తిగా సమాధానం తెలియకపోయినా.. అక్కడక్కడా అతని ఆనవాళ్లు బయటపడు తుంటాయి. అలాంటి ప్రాంతాల్లో పజ్జూరు ఒకటి. ఆదిమానవుడి ఆనవాళ్లు ఈ ఊరిలో వెలుగు చూస్తున్నాయి. తొలిచారిత్రక యుగం దొరల పాలనాకాలమైన 20వ శతాబ్ది మధ్య వరకు విశిష్ట రాజ్య పరిణామాలు పజ్జూరులో అవశేషానవాళ్లుగా కనిపిస్తున్నాయి. గ్రామం: పజ్జూరు మండలం: తిప్పర్తి జిల్లా: నల్లగొండ పిన్: 508247 జనాభా: 3320 వృత్తి: వ్యవసాయం తూర్పు: ఎర్రగడ్డల గూడెం పడమర: సందనపల్లి దక్షిణాన: పెద్ద సూరారం ఉత్తరాన: కురువేణిగూడెం అక్షరాస్యత: 67శాతం ఎక్కడ ఉంది?: నల్లగొండ జిల్లా కేంద్రానికి 13 కిలోమీటర్ల దూరంలో. ప్రత్యేకత ఏంటి? : సుమారు రెండు వేల ఏళ్ల చరిత్ర పజ్జ...