నేను బ్లాగర్‌గా కొత్త. కానీ కొంత కాలంగా బ్లాగులను గమనిస్తూనే ఉన్నాను. కామెంట్స్ విషయంలో ప్రత్యేక నిబంధనలు ఏమీ లేవని నేను గమనించాను. అభిప్రాయాలను నేరుగా తెలపడం పట్ల ఆశ్చర్యపడ్డాను. విమర్శలను సున్నితంగా తెలపడం పట్ల ఆనందపడ్డాను. కానీ వారం రోజులుగా కొన్ని బ్లాగుల(అరుణమ్, గోన్విత్ఇన్, చెరుకురసమ్) మధ్య ఘాటైన వాదన జరుగుతోంది. ప్రశంసలు వచ్చినప్పుడు పొంగి పోవడం.. విమర్శలు వచ్చినప్పుడు కుంగిపోవడం సరికాదు అని నేను అనుకుంటున్నాను. బ్లాగర్ల మధ్య వివాదం రావడం ఇది కొత్తేమి కాదు.
బాలీవుడ్లో మొదట బ్లాగ్ మొదలు పెట్టింది అమీర్‌ఖాన్, షారూఖ్ ఖాన్లు. అయితే అమీర్‌ఖాన్ "తాను కొత్తగా కొన్న బంగ్లా వాచ్మెన్ కుక్కపేరు షారూఖ్'' అని తన బ్లాగులో పోస్ట్ చేశారు. ఇది షారూఖ్, అమీర్ ఖాన్ల మధ్య వివాదానికి దారితీసింది. ఆ తర్వాత ఆ ఇద్దరు ఖాన్లు ఓ అండర్‌స్టాండింగ్‌కు వచ్చారు. బ్లాగింగ్ అనేది మనోభావాల్ని నేరుగా తెలిపేందుకు అనువైనదని, దీన్ని వివాదంగా కాకుండా సానుకూలంగా స్పందించాలని వారు అటు తర్వాత బ్లాగారు. ఆ తర్వాత బిగ్‌బీ అమితాబ్ ఈ బ్లాగర్ల జాబితాలోకి చేరిపోయారు. బ్లాగ్ మొదలెట్టిన కొద్ది కాలంలోనే అమితాబ్ నెంబర్ వన్ బ్లాగర్ స్థాయికి చేరుకున్నారు. సినిమావాళ్లని విమర్శించిన రాజకీయ నాయకుల గురించి "వారు ఐదేళ్ల కొక సారి నటించేవారు''అని అమితాబ్ తన బ్లాగులో చాలా ఘాటుగానే బ్లాగారు. ఇది అప్పట్లో వివాదానికి దారితీసింది.
కొందరు తెలుగు బ్లాగర్ల మధ్య చెలరేగుతున్న వివాదాలు బ్లాగ్ సంస్కృతిని దెబ్బతీస్తున్నాయి అనుకుంటున్నాను. అమీర్‌ఖాన్, షారూఖ్‌లాంటి వారే సానుకూలంగా స్పందించాలని సూచించారు. అందుకే మనం కూడా...
విమర్శిద్దాం... విమర్శించినా వీజీగా తీసుకుందాం... ఏమంటారు.
Popular Posts
-
తిట్టడం ఒక యోగం.. తిట్టించడం ఒక భోగం.. తిట్టలేకపోవడం... ఒక రోగం. అదేంటి? జనరల్‌గా ‘నవ్వు’ గురించి కదా ఇలా చెప్తారు. ఇక్కడ నవ్వుకి.. తిట...
-
దాదాపు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం.. సమాజంలో బలంగా వేళ్లూనుకుపోయిన పురుషాధిక్యతపై సవాలు విసురుతూ ఓ వీరనారి రాజ్యాధికారం చేపట్టింది. ...
-
మా ఫ్రెండ్స్ కొందరు యంగ్ ఇండియా యూత్ అసోసియేషన్‌గా ఏర్పడి కొత్తపేటలోని హుడా కాంప్లెక్స్ రామాలయంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఆ ఈవెంట...
-
వారికి ప్రపంచం మ్యూట్‌లో పెట్టిన టీవీలా కనిపిస్తుంటుంది. పసిపాప నవ్వు.. కోకిల పాట.. సెలయేటి హోరు.. రైలు కూత.. ఇలా అన్ని శబ్దాలూ వారికి జీరో...
-
పూర్వవిద్యార్థుల సమావేశం ఇప్పుడు చాలామంది జరుపుకుంటూనే ఉన్నారు. కాకపోతే ఈ కాలేజీకి కాస్త ప్రత్యేకత ఉంది. స్వాతంత్య్ర దినోత్సవ రజతోత్సవాల సంద...
-
ఈ గుళ్లో ఓ మిస్టరీ దాగి ఉంది. పది శతాబ్దాల పైబడి ఎవరికీ అంతుచిక్కని రహస్యం అది. శివలింగంపై ఒక నీడ పడుతుంది. అది ఎప్పుడూ స్థిరంగానే ఉంటుంది. ...
-
'అతడు' సినిమా చూసినప్పటి నుంచి నన్నో మాట వెంటాడుతూనే ఉంది. ఆ సినిమా చివర్లో నాజర్ మహేష్ బాబుతో ఇలా అంటాడు- 'నాకు ఈ వయసులో కావ...
-
చిర్క బద్ద : గౌడు కల్లు గీసేందుకు వాడే కత్తిని గీస కత్తి అంటరు. దీన్ని నూరడం భలే ఉంటుంది. ఒక పెద్ద రాయి పక్కన ఒక కర్ర ను పెట్టి చిన్న ర...
-
నేను చాలా తక్కువగా మాట్లాడతానని చాలామంది అంటుంటారు. గొప్ప వాళ్లు ఇలాగే ఉంటారని నాకు నేను సర్తి చెప్పుకునేవాన్ని. అసలు నిజం చెప్పాలంటే నాకు న...
3 comments:
విమర్శించినా వీజీగా తీసుకుందాం... ఏమంటారు.....GOOD DECISION.
అదే కద మరి గొడవ .. బ్లాగులో కొరివి. బ్లాగు మొదలెట్టడం అంటే కొరివితో తలగోక్కోడమే!
సరేనండి
Post a Comment