Skip to main content

'ఛాయ' మిస్టరీ వీడినది

ఈ గుళ్లో ఓ మిస్టరీ దాగి ఉంది. పది శతాబ్దాల పైబడి ఎవరికీ అంతుచిక్కని రహస్యం అది. శివలింగంపై ఒక నీడ పడుతుంది. అది ఎప్పుడూ స్థిరంగానే ఉంటుంది. అది ఎక్కడి నుంచి పడుతుందో కూడా ఎవరికీ తెలియదు. గర్భగుడిలోని ఆ నిగూఢాన్ని ఇప్పుడు చేధించాడో ఫిజిక్స్‌ లెక్చరర్‌. 

నల్గొండ పట్టణానికి ఆనుకుని పానగల్‌ ఉంది. ఆ ఊరి చివరన ఉదయ సముద్రం. దాని ఒడ్డున పచ్చని పొలాల మధ్య ఒక పురాతన దేవాలయం. 11వ శతాబ్దపు కుందూరు చోళుల కాలం నాటిది. దీని పేరే ఛాయా సోమేశ్వరాలయం. ఆ పేరులోనే ఉంది దాని మిస్టరీ. మనం ఉదయించే సూర్యునికి ఎదురుగా నిలబడితే మన నీడ ఎక్కడ పడుతుంది? మన వెనకవైపు పడుతుంది కదా. అదే మధ్యాహ్నం నిలబడితే నీడ ముందుకు పడుతుంది. ఈ గుళ్లోని శివలింగంపై పడే నీడ ఉదయం అయినా, మధ్యాహ్నం అయినా ఎప్పుడూ కదలదు. ఇంకో విషయం... ఆ నీడ ఒక స్తంభం నీడలా కనిపిస్తుంది. ఆ గుళ్లో ఎనిమిది స్తంభాలుంటాయి. కానీ ఆ నీడ ఏ స్తంభానిదో ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే ఒక స్తంభం నీడ అని మనం అనుకున్నామనుకోండి. దాని నీడపడినప్పుడు దాన్ని ముట్టుకుంటే మన చేయి నీడ కూడా పడాలి కదా? అలా పడదు. అయితే ఈ నీడ మరి ఎక్కడి నుంచి పడుతోంది, రోజంతా స్థిరంగా ఎలా ఉంటోంది? ఈ విషయాలనే ప్రయోగాత్మకంగా నిరూపించాడు సూర్యాపేటకు చెందిన మనోహర్‌.

ఎలా కనిపెట్టాడు?
శేషగాని మనోహర్‌ గౌడ్‌ సూర్యాపేటలోని శ్రీ వెంకటేశ్వర పిజీ కాలేజ్‌లో పనిచేస్తున్నారు. ప్రస్తుతం గ్రూప్స్‌కి ప్రిపేర్‌ అవుతున్నారు. ఆరేడేళ్ల క్రితం ఒకరోజు కోడి శ్రీనివాస్‌ అనే స్నేహితుడు ఆయన్ని ఛాయా సోమేశ్వరాలయానికి తీసుకెళ్లాడు. అక్కడి నీడ గురించి చెప్పి 'నీకు ఫిజిక్స్‌ అంటే ఇష్టం కదా. నువ్వు ఎందుకు ఈ నీడ రహస్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించకూడదు' అని ప్రోత్సహించాడు. ఆ రోజు నుంచి ఆ మిస్టరీ మనోహర్‌ని వెంటాడింది. ఎలాగైనా ఆ రహస్యాన్ని చేధించాలని ఒంటరిగా వెళ్లి ఆ గుళ్లో ఎన్నోసార్లు కూర్చునేవాడు. అక్కడి నిర్మాణాన్ని అణువణువు పరిశీలించాడు. కొలతలు తీసుకున్నాడు. ఆ గుడికి దక్షిణం వైపు ప్రధాన ద్వారం ఉంటుంది, తూర్పు, పడమర, ఉత్తరంవైపు మూడు గర్భగుళ్లు ఉంటాయి. పడమర వైపు ఉన్న గర్భగుడిలోని శివలింగంపైనే నీడ పడుతుంది. మిగిలిన రెండు గుళ్లలో అంతా చీకటిగా ఉంటుంది. మధ్యలో నాలుగు స్తంభాలుంటాయి. ప్రధాన ద్వారం వద్ద, మూడు గర్భగుళ్ల ముందు సిమెట్రిక్‌ సిస్టమ్‌లో ఎనిమిది స్తంభాలుంటాయి. మధ్యలో నిలబడి ఏ గర్భగుడివైపు చూసినా వాటి నిర్మాణం ఒకేలా ఉంటుంది. ఇదే నమూనాలో థర్మాకోల్‌తోగుళ్లను, కొవ్వొత్తులను స్తంభాలుగా ఉపయోగించి ఆలయాన్ని రూపొందించాడు మనోహర్‌. చీకటి గదిలో టార్చిలైటుని సూర్యునిగా ఉపయోగిస్తూ ఎన్నో ప్రయోగాలు చేశాడు. అలా ఎన్నో రాత్రులు చీకటిలో గడిపి విజయాన్ని సాధించాడు. వందల ఏళ్లుగా గర్భగుడిలో దాగి ఉన్న ఆ రహస్యాన్ని వెలుగులోకి తెచ్చాడు.

యురేకా
ఛాయా సోమేశ్వరాలయం కాకతీయుల కాలం నాటి నిర్మాణశైలిని కలిగి ఉంటుంది. ఆ కాలంలోనే భౌతిక శాస్త్రం ఆధారంగా కాంతిని దారిమళ్లించి ఒక నీడని గర్భగుడిలో పడేలా చేయడం చూసి ఆశ్చర్యపోయాడు మనోహర్‌. తను కనుగొన్న విషయాన్ని ఇలా చెప్పుకొచ్చాడు. "ఈ గుడిని పరిక్షేపణ కాంతి ఆధారంగా నిర్మించారు. మనం తెలుసుకోవాలనుకున్నది రెండు విషయాలు... ఒకటి.. నీడ ఏ స్తంభానిది?, రెండు.. ఏ దిశ నుంచి వచ్చే కాంతిది? అని. గుడి నిర్మాణం ఆధారంగా నేను చేసిన ప్రయోగాల్లో అది తేలింది. అలాగే ఆ నీడ ఒకే స్తంభానిది కాదు.. నాలుగు స్తంభాలది. కాంతి కూడా రెండు వైపుల నుంచి వస్తుంది. నీడ పడే గర్భగుడికి ఎదురుగా అంటే తూర్పు గుడి పక్కన రెండు వైపుల నుంచి కాంతి లోపలికి వస్తుంది. ఇది నాలుగు స్తంభాలకు తగిలి పరిక్షేపణం చెందుతుంది. ఆ పరివర్తనం అంతా గర్భగుడిలోని శివ లింగంపై ప్రతిఫలించేలా నిర్మాణం చేశారు. ఇక్కడ మళ్లీ రెండు అనుమానాలు. నిర్మాణం అంతా ఒకేలా ఉన్నప్పుడు, మిగిలిన రెండు గర్భగుళ్లలో కూడా నీడ పడాలి కదా? రెండోది.. సూర్యకాంతి ఆధారంగా వచ్చే నీడ అయితే కదలాలి కదా. మరి స్థిరంగా ఎందుకు ఉంటుంది? సూర్యుడు తూర్పున ఉద యించి పడమటికి కదులుతాడు. దీన్ని సన్‌ ట్రాక్‌ అంటారు. అందుకే పడమర వైపు గుళ్లో మాత్రమే నీడ పడేలా కట్టారు. నీడపడే గుడి పక్కన కాంతి వచ్చే ప్రదేశంలో విగ్రహాలు పెట్టి అడ్డువేశారు. అందుకే తూర్పు గర్భగుడిలో నీడ పడదు. అలాగే ఉత్తరం వైపు గుళ్లో పడకుండా దక్షిణం వైపు ఖాళీగా వదిలేశారు. అటువైపు కూడా కట్టి ఉంటే ఉత్తరం గుళ్లో కూడా నీడపడేది.

వాహ్‌! ఆ కాలంలోనే భౌతికశాస్త్రం ఆధారంగా అద్భుతమైన కట్టడాన్ని నిర్మించిన కుందూరు చోళులకు హ్యాట్సాఫ్‌. ఇలాంటి కట్టడం ఇప్పుడు శిథిలావస్థలో ఉండడం బాధాకరం. ఇలాంటి అద్భుత కట్టడాలు మన రాష్ట్రంలో ఇంకా ఎన్నో ఉన్నాయి. వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత పురావస్తు శాఖకు ఉంది.

Comments

Anonymous said…
good post...
Anonymous said…
wowwww
- sarath
మంచి విషయాన్ని చెప్పారు. ధన్యవాదాలు.
Anonymous said…
nice one.
Thn Q

--- koundinya
Anonymous said…
thank you very much
Anonymous said…
gr8 dude,u have done a gr8 job.
అద్భుతం! ఈ రహస్యాన్ని చేదించిన ఆ లెక్చరర్ని ఎంతగానో అభినందించాలి.
సూర్య గమనాన్నీ, కాంతి ప్రసార గుణాలనీ ఉపయోగించి ఇలాంటి ఒక అద్భుతమైన నిర్మాణాన్ని చెయ్యవచ్చునన్న ఊహే అసామాన్యం!
Sirisha said…
wow nice info.. i like this type of places...thanks for sharing
PARAMESWAR said…
Naaku chuudalani undi.....
అద్భుతం.మన దేవాలయాల్లో,ఇతర భవనాల్లో ఇలాటి విశేషాలు ఇంకా వున్నాయి.hanging pillars,వేవింగ్ మినరెట్స్ , గొల్కొండలొ కింద చప్పట్లు కొండ మీద మహల్ లో వినిపించడం వంటివి,నీటిలో తేలే రాళ్ళు ఉన్నాయి. ఘజనీ మహ్మద్ కొల్లగొట్టిన సొమనాథ్ దెవాలయం లో గా లిలో తేలే శివ లింగం ఉండేదట. (magnet)వలన.ఐతే సా మాన్య జనానికి మహిమలు గా అనిపించే శాస్త్రీయ సిద్ధాంతాలు ఆధారం గా నిర్మింపబడినవే అవన్నీ.#hats off to our ancient Silpis.

Popular posts from this blog

ఈ తిట్లు వింటే మీరూ తెగ నవ్వుతారు..

తిట్టడం ఒక యోగం.. తిట్టించడం ఒక భోగం.. తిట్టలేకపోవడం... ఒక రోగం. అదేంటి? జనరల్‌గా ‘నవ్వు’ గురించి కదా ఇలా చెప్తారు. ఇక్కడ నవ్వుకి.. తిట్లకి సంబంధం ఉంది. అందుకే అలా. ఏడుపొస్తే ఆపుకోవడం.. కోపమొస్తే తిట్టకపోవడం.. సెల్‌ఫోన్‌లో బ్యాలెన్స్ ఉండీ అవుట్‌గోయింగ్ చేయలేకపోవడం లాంటిది. అందుకే చీవాట్లెట్టండి. ఫన్నీగా.. తిట్ల గురించి కూడా ముచ్చట్లా? అని తిట్టుకోకండి. గూట్లో దాచిపెట్టి గూగుల్‌లో వెతికే రోజులివి. దేనికోసమో ‘యా’లో సెర్చ్ చేస్తుంటే.. What is the meaning of telugu word ne dumpa tega? (నీ దుంప తెగ అనే తెలుగు పదానికి అర్థమేంటి?) అని ఒక ప్రశ్న కనిపించింది. అడిగింది లండన్‌లో ఉండే మన తెలుగాయనే. ఇండియాకి వచ్చినప్పుడు ఆయన్ని ఎవరు తిట్టారో తెలియదు కానీ.. దానికి ఇద్దరు సమాధానాలిచ్చారు. మొదటిది ఇది తెలుగులో వ్యవహారిక పదం. కాని లిటరల్‌గా అనువదించడానికి సరైన అర్థం లేదు. దీన్ని రకరకాల సందర్భాల్లో వాడతారు. కోపంగా ఉన్నప్పుడు, ఫ్రస్టేషన్‌లో ఇలా తిడతారు. ఆశ్చర్యమేసినప్పుడు కూడా వాడతారు. దీని అర్థం నిజంగా తెలుసుకోవాలంటే.. ఈ మాట అనేవాళ్ల టోన్, ఫేసియల్ ఎక్స్‌వూపెషన్స్ చూడాల్సిం...

సామ్రాజ్ఞి రుద్రమ (మన చరిత్ర - 1) My new column in Batukamma Sunday Magazine

దాదాపు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం.. సమాజంలో బలంగా వేళ్లూనుకుపోయిన పురుషాధిక్యతపై సవాలు విసురుతూ ఓ వీరనారి రాజ్యాధికారం చేపట్టింది. ఆడదానికి రాజ్యమా? ఆడది పరిపాలించడమా? అని అయిన వాళ్లే ఆమె ఆధిపత్యాన్ని జీర్ణించుకోలేకపోయారు. కొందరు సామంతులు, మండలాధీశులూ ఎదురు తిరిగే ప్రయత్నం చేశారు. అయినా ఆమె అదరలేదు. బెదరలేదు. అలాంటి వారి తలలు వంచి, నోళ్లు మూయించి ధీర వనితగా, శత్రు భయంకర రుద్రరూపిణిగా నిలిచిందామె. నేటి స్వేచ్ఛా మహిళకు ప్రతీకగా, స్త్రీ ఆత్మగౌరవానికి సమున్నత పతాకగా.. గెలిచి నిలిచిన.. ఆమే.. రాజగజకేసరి.. రణరంగ ఖడ్గధారిణి.. కాకతీయ మహాసామ్రాజ్యభార ధారణి.. రాణీ రుద్రమ దేవి..  కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడు అత్యంత పరాక్రమవంతుడు, రాజనీతి కోవిదుడు. ఈయనకు ఇద్దరు కూతుళ్లు. మహిళలు రాజ్యాధికారానికి అనర్హులన్న అప్పటి కాలపరిస్థితులకు భిన్నంగా కూతురు రుద్రమదేవిని కుమారునిగా పెంచాడు. అన్ని విద్యలూ నేర్పించాడు. గణపతి దేవుడు రుద్రమను రాజప్రతినిధిగా ప్రకటించినప్పుడు స్త్రీ పరిపాలనను, స్త్రీ అధికారాన్ని సహించలేని సామంతుల నుంచి, దాయాదుల నుంచి తీవ్ర ప్రతిఘటనలు ఎదురైనాయి. ఈ విపత్తులన్నింటినీ రుద్ర...