గూగుల్ కూడా గుర్తించలేని ఒక మారుమూల తండాలో పుట్టాడు సోమేశ్వర్ వంశీ నాయక్. అయితే ఇప్పుడు గూగుల్‌లో అతని గురించి ఒక్కసారి వెతికి చూడండి.. మీకు కావాల్సినంత సమాచారం దొరుకుతుంది. అసలు వంశీ గురించి మేమెందుకు తెలుసుకోవాలి అంటారా? ఉద్యోగ వేటలో తనకు ఎదురైన అనుభవాలు మరెవరికీ ఎదురుకాకూడదని ఉపాధ్యాయుల కోసం ఒక ప్రత్యేకమైన వెబ్‌సైట్‌ని రూపొందించాడు. దాని గురించే ఈ కథనం. మీరు టీచర్‌గా పనిచేస్తున్నారా? లేదంటే పనిచేయాలన్న ఆలోచన ఉందా? ఇప్పుడున్న పాఠశాలలో కాకుండా మరో మంచిస్కూల్ కోసం వెతుకుతున్నారా? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానం మీకు ఒకే దగ్గర దొరుకుతుంది. అదే ఎడ్యునెస్ట్ (www.edunest.org). కేవలం టీచర్ల కోసమే రూపొందించిన వెబ్ పోర ్టల్ ఇది. దీన్ని డిజైన్ చేసింది పెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీ కాదు, నిన్న మొన్ననే ఎంఏ పూర్తి చేసిన ఒక సాధారణ టీచర్. అసలు అతనికి ఎందుకు ఈ ఆలోచన వచ్చిందో చదవండి. ఓ దసరా పండగ మధ్యాహ్నం.. ట్యాంక్‌బండ్‌పై ఒంటరిగా బెంచీ మీద కూర్చుని ఇలా డైరీ రాసుకుంటున్నాడు వంశీ నాయక్. "అందరూ కొత్తబట్టలు వేసుకుని, పండగ జరుపుకుంటూ సంతోషంగా ఉన్నారు. కానీ నా పరిస్థితేంటి ఇలా ఉంది? ఆక...