వారికి ప్రపంచం మ్యూట్‌లో పెట్టిన టీవీలా కనిపిస్తుంటుంది. పసిపాప నవ్వు.. కోకిల పాట.. సెలయేటి హోరు.. రైలు కూత.. ఇలా అన్ని శబ్దాలూ వారికి జీరో డెసిబెల్‌లోనే వినిపిస్తాయి. మరి టీచర్లు చెప్పే పాఠాలు వారికెలా వినిపిస్తాయి? నిన్న బధిరుల దినోత్సవం సందర్భంగా ఎల్‌కేజీ నుంచి పిజీ వరకు కేవలం బధిరుల కోసమే ఉన్న ఒక ఇనిస్టిట్యూట్‌కి వెళ్లాను. అక్కడ అక్కడ ఈ కింది 'మ్యూటీఫుల్' సీన్స్ కనిపించాయి.
సికింద్రాబాద్‌లోని రామకృష్ణాపురం....
నిండా నీళ్లతో నిండు గర్భిణిలా ఉన్న చెరువుని చూస్తూ ఫ్లైఓవర్ దిగగానే రైల్వే బ్రిడ్జీ కనిపించింది.
బ్రిడ్జీకి కుడివైపు 'హెలెన్ కెల్లర్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ రిహాబిలిటేషన్ ఫర్ ది డిసేబుల్డ్ చ్రిల్డన్' అనే బోర్డు ఉంది.
ఆ ఇనిస్టిట్యూట్‌లో చాలా 'ప్రత్యేకమైన' పిల్లలు 600 మంది చదువుతున్నారు. ఒకరిద్దరు పిల్లలుంటేనే ఇల్లు మారుమోగిపోతుంది. అలాంటిది అంత మంది పిల్లలున్న ఆ పాఠశాలలో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. ఆశ్చర్యం లేకపోయినా ఏదో ఖాళీ. శబ్దం లోపించిన ఖాళీ. సైగలతో చదువులు, మౌనంగా ఆటలు.. కనిపించాయి అక్కడ.
(శారీరక, మానసిక లోపాలు ఉన్న పిల్లలందర్నీ ఇప్పుడు స్పెషల్ చ్రిల్డన్ అని గాని, డిఫరెంట్లీ ఏబుల్డ్ అని గాని అంటున్నారు. లేదా ఫిజికల్లీ ఛాలెంజ్డ్, మెంటల్లీ ఛాలెంజ్డ్ అని మాత్రమే అంటున్నారు. మన వారికి ఇంకా ఆ పదాలు అలవాటు కాలేదు)
విశాలమైన ఆ పాఠశాల మైదానంలో ఎవరూ కనిపించలేదు. కుడివైపు చెట్టు కింద ఇద్దరు కుర్రాళ్లు నిల్చున్నారు. షూ వేసుకుని నీట్‌గా ఇన్‌షర్ట్ చేసుకున్నారు. నేను వారి దగ్గరకు వెళ్లగానే 'నమస్తే' అన్నట్లు చేతులు జోడించారు. నేను 'హాయ్' అన్నాను. వారి నుంచి స్పందన లేదు. 'ఖాన్ సార్ ఛాంబర్ ఎక్కడ?' అని అడిగాను. మౌనంగా నా చేయి పట్టుకుని కాస్త ముందుకు తీసుకెళ్లి ఒక గది చూపించాడు అందులో ఒక కుర్రాడు.
---
పరిచయాలు అయిపోయాక తరగతి గదులు చూపించేందుకు నన్ను తీసుకెళ్లారు ఆ సంస్థ డైరెక్టర్ ఉమ్మర్ ఖాన్. చెట్టు కింద నిల్చున్న కుర్రాళ్లు ఆయనకు నమస్తే పెట్టారు.
"ఆ.. ఎప్పుడొచ్చార్రా. ఎలా ఉన్నారు?'' అని వారిని అడిగారు ఖాన్.
"బాగున్నాం సార్'' అన్నట్లు గుండెలపై చేతులు పెట్టుకున్నారు ఆ ఇద్దరు అబ్బాయిలు.
"వీరిద్దరు ఇదే స్కూల్లో ఒకటో తరగతి నుంచి బికామ్ వరకు చదివారు'' వారి గురించి నాకు చెప్పారు ఖాన్.
"ఓ.. నీ పేరేంటి?'' నీలం రంగు చొక్కా వేసుకున్నతన్ని అడిగాను.
జేబులోంచి సెల్‌ఫోన్ తీసి టకటక టైప్ చేసి "అబ్దుల్ అశ్వాక్'' అని చూపించాడు.
"నీ పేరేంటి?'' రెండో అబ్బాయిని సైగ ద్వారా అడిగారు ఖాన్.
ఏనుగు తొండం మాదిరి ఏదో చేశాడు ఆ అబ్బాయి.
"గణేష్ అని దాని అర్థం'' నాకు చెప్పారు ఖాన్.
---
ఖాన్ నన్ను ముందుగా ఆడియాలజీ ల్యాబ్‌కి తీసుకెళ్లారు. ఓ గదిలో చిన్నపాపని గోడకు దగ్గరగా కూర్చోబెట్టారు. పాప ముందు ఒక స్టాండు, కొన్ని రింగులు ఉన్నాయి. ఆమె వెనకాల ఒక టీచర్ డ్రమ్ము పట్టుకుని ఉంది. డ్రమ్ముని స్టిక్‌తో మోగించి పాపవైపు చూసింది. పాపలో చలనం లేదు. మరోసారి కాస్త గట్టిగా మోగించింది టీచర్. పాప ఒక రింగుని తీసుకుని స్టాండుకు తగిలించింది. టీచర్ ఈసారి ఇంకాస్త వెనక్కి జరిగి మరో సారి మోగించింది. ఇలా ఆ పాప అన్ని రింగులూ స్టాండుకు వేసే వరకు టీచర్ డ్రమ్ మోగిస్తూనే ఉంది. ఆ పాప కదలికలను బట్టి టీచర్ రిపోర్ట్ రాసుకుంది.
(ఇది ఆడియాలజీ థెరపీ. పిల్లలకు ఏమేరకు వినికిడి శక్తి ఉందో కనుక్కొనేందుకు ఈ పద్ధతిని ఉపయోగిస్తారు. వారి పరిస్థితిని బట్టి టీచర్లు పాఠాలు చెబుతారన్నమాట)
---
మరో గదిలో పెద్ద అద్దం ముందు తెల్లరంగు కోటు వేసుకుని ఒక అమ్మాయి కూర్చుంది. ఆమె ముందు బుట్టలో రకరకాల పూలు, పండ్లు, జంతువుల బొమ్మలున్నాయి. ఒక చిన్నబ్బాయి ఆమె పక్కన కూర్చున్నాడు. ఆ టీచర్ బుట్టలోంచి అరటిపండు బొమ్మని తీసి బయట పెట్టింది. పిల్లాడి ఒక చేతివేలు పట్టుకుని అతని ముక్కుపై పెట్టింది. తన మరో చేతి వేలుని తన ముక్కుపై పెట్టుకుని...
'బనానా.. బ.. నా.. నా..'' అని ఆ అక్షరాలకు అనుగుణంగా తన పెదవులు, నాలుక కదిలిస్తూ పిల్లాడికి అద్దంలో చూపించింది.
మళ్లీ 'బ.. నా.. నా..'' అని మరోసారి చెప్పి ముక్కుపై చేతి వేళ్లతో దాని సైగను(సైన్) నేర్పింది.
"ఇప్పుడు నువ్వు చెప్పు'' అని పిల్లాడ్ని అడిగితే బనానా అన్నట్లు పెదాల్ని కదిలిస్తూ ముక్కుపై వేలితో సైగ చేస్తూ చూపించాడు ఆ అబ్బాయి.
"వెరీ గుడ్'' అని టీచర్ ఆ పిల్లాడి భుజం తట్టింది. ఆ అబ్బాయి అరనవ్వు నవ్వాడు.
(ఇది ఆ పాఠశాలలో పిల్లలకు లిప్ రీడింగ్, సైన్ లాంగ్వేజ్ నేర్పే ప్రక్రియ. పిల్లలకు ముందుగా ఇవి నేర్పిన తర్వాతే ఒకటో తరగతిలో చేరుస్తారు. ప్రీ స్కూల్ చదువులన్నమాట)
---
ఆ తరగతి బోర్డుపై ఒకటో తరగతి అని రాసి ఉంది. లోపలికి వెళ్లగానే.. నేనెవరో వారికి తెలియకపోయినప్పటికీ చేతులు జోడించి నమస్కరిస్తూ లేచారు పిల్లలు.
"కూర్చోండి.. కూర్చోండి'' అన్నాన్నేను. ఎవరూ కూర్చోలేదు.
"కూర్చోండి'' అని చేతితో సైగ చేశాను.
"థ్యాంక్యూ'' అన్నట్లు గుండెపై చేతిని ఉంచి కూర్చున్నారు. వాళ్ల సంస్కారానికి తలవంచి వారి మధ్యే ఓ బెంచీపై కూర్చుని గమనిస్తున్నాను.
"ఎఫ్..ఐ..వి..ఇ.. ఫైవ్'' అని చదువుతూ టీచర్ అక్షరాలు బోర్డుపై రాసింది.
"ఎస్..ఐ..ఎక్స్.. సిక్స్..'' - ఇలా పది వరకు రాసింది.
తరువాత వాటిని చదువుతూ చేతులతో అంకెలను చూపించింది. పిల్లలు కూడా వాటిని అనుకరించారు.
రెండో బెంచీలో కూర్చున్న ఒక పాపని లేపి 'ఫైవ్'ను చూపించమంది. ఆ పాప ఐదు వేళ్లని చూపించింది. మొదటి చెంచీలో కంగారుగా చూస్తున్న అబ్బాయిని లేపి 'సిక్స్' చూపించమంది. ఆ అబ్బాయి స్పందించలేదు.
టీచర్ గట్టిగా "కమాన్ షో మీ'' అంది. అయినా ఆ పిల్లాడు సమాధానం చెప్పలేదు. పైగా ఏడుపు మొహం పెట్టాడు. ఎడమ చెవి దగ్గర చేతితో రుద్దుకున్నాడు.
"ఏమైందిరా మిషిన్ ఊడిపోయిందా?'' అని టీచర్ దగ్గరికి వచ్చి హియరింగ్ మిషిన్‌ని చేవిలో సరిగ్గా పెట్టింది.
బోర్డు దగ్గరికి వెళ్లి "ఇప్పుడు చూపించు సిక్స్'' అంది.
ఆ పిల్లాడు నవ్వుతూ ఆరు వేళ్లు చూపించాడు.
(పిల్లల్లో వినికిడి ఏమాత్రం ఉందో తెలుసుకున్న తర్వాత టీచర్లు వారికి హియరింగ్ మిషిన్‌ని అమర్చుతారు. దీని ద్వారా వారు టీచర్లు చెప్పేది కొంత వినగలరు. మరికొంత లిప్ రీడింగ్ ద్వారా అర్థం చేసుకోగలరు. అలా పెద్దవుతున్న కొద్దీ వారిలో వినికిడి శక్తి పెరుగుతుంది)
---
ఇంటర్ మొదటి సంవత్సరం తరగతి గదికి వెళ్తున్నప్పుడు కేక్ వాసన నోరూరించింది. లోపలికి అడుగుపెట్టగానే ఎదురుగా టేబుల్‌పై కేక్, చుట్టూ విద్యార్థులు (పదిమంది అమ్మాయిలు.. ఓ ఇరవై మంది అబ్బాయిలు) మధ్యలో బర్త్‌డే బాయ్, క్లాస్ టీచర్.
"ఏరా నీ పుట్టినరోజా ఇవాళ?'' వారి దగ్గరికి వెళ్తూ అడిగారు ఖాన్.
"ఔను సార్. సమయానికి మీరు కూడా రావడం సంతోషం'' సమాధానం ఇచ్చారు బర్త్‌డే బాయ్‌కి బదులు వారి టీచర్.
"వీడి పేరు విజయ్. పదో తరగతిలో స్కూల్ ఫస్ట్. చాలా పేదవాళ్లు. వీళ్ల అమ్మ కూలీపని చేసి చదివిస్తోంది'' భుజం చుట్టూ చేతులు వేసి ఆ అబ్బాయి గురించి చెప్పారు ఖాన్. "సరే ఏంటి? కట్ చేస్తావా కేక్? కత్తి లేదా?''
లేదన్నట్లు తల ఊపారు విద్యార్థులంతా.
"పర్లేదు. స్కేల్ ఉంటే తీసుకురండి..'' అన్నారు ఖాన్.
ఒక అమ్మాయి వెళ్లి చిన్న స్కేల్ తీసుకొచ్చింది. అది విజయ్‌కి ఇస్తుంటే జారి సరిగ్గా ఆ అమ్మాయి కాళ్ల దగ్గర పడిపోయింది. దాన్ని తీసుకునేందుకు విజయ్ వంగాడు. అతన్ని ఆశీర్వదిస్తున్నట్లు తలపై చేయి పెట్టింది ఆ అమ్మాయి చిలిపిగా. అందరూ నవ్వారు. విజయ్ ఉలిక్కిపడి లేచాడు. సీన్ అర్థమయిందనుకుంటా ఆ అమ్మాయి భుజంపై ఒక్కటిచ్చాడు. ఆ అమ్మాయి నవ్వింది. నవ్వుతున్నప్పుడు అచ్చం 'శంభో శివ శంభో' సినిమాలో 'అభినయ'లా కనిపించింది. తర్వాత విజయ్ కేక్ కత్తిరించి అందరికీ పంచిపెట్టాడు. అతనికి శుభాకాంక్షలు చెబుతున్నట్లు విద్యార్థులందరూ చేతులు పైకెత్తి ఊపారు. స్కేల్ ఇచ్చిన అమ్మాయి బర్త్‌డే సాంగ్‌ని డ్యాన్స్ రూపంలో 'ఆడు'తుంటే మిగిలిన వాళ్లందరూ అనుకరించారు.

Comments
సమయం కుదిరినప్పుడు అక్కడికి వెళతాను
ఏమైనా స్పెషల్ పర్మిషన్ తీస్కోవాలా?