వీచేగాలి వినసొంపుగా ఉంటుంది. అదే గాలి వేణువు నుంచి వస్తే మరింత మధురంగా వినిపిస్తుంది. ఇక్కడ గాలి తెలంగాణ భాష.. వేణువు ఆర్‌జే ప్రతీక. కమ్మని తెలంగాణ మాటలకు ఆమె షో... ఒక ప్రతీక. ఫస్ట్ అండ్ బెస్ట్ తెలంగాణ ఆర్‌జే ఆమె. ప్రతీక.. కేవలం మూడక్షరాల పేరు కాదు. ముప్ఫయి వేల మంది నినాదం. మూడు లక్షల మంది అభిమానం. ఆమెదో లోకం. ఆమే ఒక లోకం. దాని పేరు ‘ఫుల్ టు బిందాస్’. మంత్రాలకు మామిడికాయలు రాలతాయో లేదోగానీ.. ఆమె మాటలకు అభిమానులు పుడుతున్నారు. పడుతున్నారు. కీ ఇచ్చి వదిలిన రోబోలా.. పుల్‌స్టాప్, కామాల్లేకుండా మాట్లాడగలదు ప్రతీక. ఆమె మాటలు.. పిజ్జామీద ఆవకాయ రాసుకుని తింటున్నట్టు.. పానీపూరిలో పళ్లరసం పోసుకుని తాగుతున్నట్టు.. బాల్యమివూతుడు బార్‌లో కలిసినట్టు.. పక్కింటి అమ్మాయి ఫారిన్‌లో పలకరించినట్టు ఉంటాయి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ కలిపి కొట్టే.. ప్రతీకది ఒక డిఫంట్ లాంగ్వేజ్. దానికి ఆమె పెట్టుకున్న పేరు ‘ప్రతీక లాంగ్వేజ్’. ఇప్పుడు చాలామంది యూత్ ఫాలో అవుతున్న ట్రెండీ లాంగ్వేజ్. మాంచి కిక్ ఎక్కించే కొకైన్. ఎంతటి వారైనా ఆ మాటలకు బానిసలు కావాల్సిందే. ఆ వ్యసనానికి దూరంగా ఉండాలంటే సా...