Skip to main content

బతికి సాధించాలె.. అంటున్న పెద్దాయన


సోమవారం, ఉదయం 11 గంటలు..
రవీంద్రభారతి, హైదరాబాద్
చరితలో ఒక  పొడిచింది. ఆ పొద్దు రు  తెలంగాణ
ఆ దినపతిక ఆవిష్కరణ సభలో ఎనభై ఏళ్ల ఒకాయన అక్కడికి వచ్చిన పెద్దలకి ఏవో పుస్తకాలు పంచుతున్నాడు. ఆ పుస్తకం తెరిచిచూస్తే...
తప్పుడు లెక్కలు చ్పెవారికి సమాధానాలు దొరుకుతాయి.
తెలంగాణ కోసం బలిదానాలు చేసుకున్న వారి చిరునామాలతోసహా వివరాలు కనిపిస్తాయి. పోలీసు కాల్పులకు ఎదురొడ్డిన వీరుల్ని చూసిన ఆయన కళ్లు తమను తాము నిలువెల్లా కాల్చుకుంటున్న విద్యార్థుల్నీ చూశాయి. తట్టుకోలేక తల్లడిల్లిపోయాయి.
తొలి, మలి తెలంగాణ ఉద్యమానికి ప్రత్యక్ష సాక్షి ఆయన. ఇంతకీ ఎవరా పెద్దాయన? ఏంటా స్తకం?
---
1969లో ఒకరోజు..
కెనరా బ్యాంక్, జంకిటి పెంటయ్య బిల్డింగ్, వరంగల్
బ్యాంక్ ముందు పెద్ద గొడవ అవుతోంది. చూసి గేటేసి రమ్మని అంటెండర్‌ని పంపించాడు బ్యాంక్ మేనేజర్. అటెండర్ సాంబయ్య గేటు దగ్గరికి వచ్చాడు.
ఢాం అని పెద్ద శబ్దం. బ్యాంక్ గేటు ముందు ఒక వ్యక్తి గుండెల్లోకి బుల్లెట్         దూసుకుపోయింది.
జై తెలంగాణ అంటూ నేలకొరిగాడు ఆ వ్యక్తి.
ఇంతలో మరోవ్యక్తి  కాల్చు అంటూ పోలీసులకు ఎదురెళ్లాడు. మళ్లీ ఢాం అని శబ్దం.
ఆయన కూడా జై తెలంగాణ అంటూ నెలకొరిగాడు. అది చూసిన సాంబయ్యకు  భయమేసింది.
నవంబర్ 29, 2009
జనసమ్మర్థంగా ఉండే ఎల్బీనగర్ చౌరస్తా, హైదరాబాద్
వందలాది మంది చూస్తుండగా  తెలంగాణ అంటూ శ్రీకాంత్ చారి పెట్రోల్ పోసుకుని ఒంటికి నిప్పంటించుకున్నాడు.
నిలువెల్లా నిప్పుకణికై భగభగ మండిపోయాడు శ్రీకాంత్.
ఆ దృశ్యాన్ని టీవీలో చూసిన సాంబయ్యకు బాధేసింది. గుండె పగిలిపోయింది. మనసు కకావికలమైంది. ఎనభై ఏళ్ల ఆ వృద్ధు తన కథను ఇలా చెప్పుకొచ్చాడు.
---
మాది వరంగల్ జిల్లా గిర్మాజిట. మా నాన్న హకీమ్ సాబ్. ఇప్పటి డాక్టర్లు మస్తు సంపాదిస్తుండ్రు గానీ అప్పుడు డాక్టర్లకు పెద్దగా సంపాదన ఉండేది కాదు. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఏడాదే మా నాన్న చనిపోయాడు. అప్పుడు నాకు పదిహేడేళ్లు. నాకు ఒక అక్క. ఇద్దరు చెల్లెళ్లు. నాన్న చనిపోయే నాటికే అక్క పెళ్లయింది. ఇద్దరు చెల్లెళ్ల పెండ్లి చెయాల్సి ఉంది. నేనూ ఏదో పని వెతుక్కోవాల్సి వచ్చింది. నేనప్పుడు రెండో తరగతి దాకే చదివిన. మా నాన్న సైకిల్ తీసుకుని పేపర్ ఏజెంట్‌గా చేరిన. అప్పట్లో ఐదు ఉర్దూ పత్రికలు, రెండు మూడు చిన్న చిన్న తెలుగు పత్రికలు వేసేవాడ్ని.
పేపర్ బోయ్‌గా..
అప్పుడు రజాకార్లు తిరిగేటోళ్లు. పేపర్ వేయాలంటే చాలా ధైర్యం ఉండాలి. వెయ్యి స్తంభాల గుడికి తూర్పున ముస్లింలు.. పడమరన హిందువులు ఉండేటోళ్లు. తూర్పున పేపర్ వేయాలంటే జిన్నా టోపీ పెట్టుకోవాల్సిందే. అయినా ఎవరైనా గుర్తుపడితే.. పెద్ద గొడవయ్యేది. తీసుకెళ్లి జైళ్ల పెట్టేటోళ్లు. పడమర పోవాలంటే.. బొట్టు పెట్టుకుని పర్ వేసేవాడ్ని. వరంగల్ నుంచి ఖాజీట వరకు ను ఏజెంట్‌ని. నెలంతా కష్టపడితే 25 రూపాయలు వచ్చేవి. తర్వాత కొన్ని రోజులు కిరాణం కొట్టుల పనిచేశాను. తర్వాత ప్రయివేటు ఇన్స్యూన్స్ కంపెనీల ఆఫీస్ బాయ్‌గా చేసిన.
అప్పుడే తెలంగాణ..
1955లో వరంగల్‌లో కెనరా బ్యాంక్ పడ్డది. అందులో అటెండర్‌గా చేరిన. తర్వాత క్లర్క్‌గా.. క్యాషియర్‌గా ప్రమోషన్ వచ్చింది. 1995లో రిటైర్ అయ్యాను. తొలి తెలంగాణ ఉద్యమం మొదలైనప్పుడు అటెండర్‌గా పనిచేస్తుంటిని. నా కళ్ల ముందు చంద్రమౌళి, సారంగపాణి పోలీసు తుటాలకు బలవ్వడం చూసి తట్టుకోలేకపోయాను. వారి చావు చూసిన తర్వాతే తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటుండేవాడ్ని. అప్పుడు మా బ్యాంక్‌లో ఎక్కువమంది ఆంధ్రవాళ్లే ఉండేవాళ్లు. ఇప్పటికి కూడా అంతే. బ్యాంకుల్లో ఎక్కువమంది వాళ్లే. అందుకే ఇప్పుడు అన్ని ఉద్యోగాల జెఏసీలున్నయి.. కానీ బ్యాంకు ఉద్యోగుల జెఏసీ లేదు గమనించారా? అయితే నేను బ్యాంక్‌లో పనిచేసేటప్పుడు ఉద్యమానికి పోనిచ్చేవారు కాదు. సెలవులు ఇచ్చేవాళ్లు కాదు. అయినా నేను అప్పుడప్పుడు సభలకు వెళ్లేవాడ్ని. పుస్తకాలు చదివేవాడ్ని. ఎక్కడికి పోయినా పాటలు పాడేవాడ్ని. తెలంగాణ ఉద్యమాన్ని ఇప్పటికీ నడిపిస్తున్నవి పాటలే కదా.
చావులు చూసి తట్టుకోలేకపోతున్న..
తొలి ఉద్యమం ఆగిపోయినదాని గురించి అందరికీ తెల్సు. ఇప్పుడు మళ్లీ మొదలైంది. కానీ చాలామంది పిల్లలు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఎల్బీనగర్‌లో శ్రీకాంత్ చారి ఆత్మహత్య చేసుకున్నప్పుడు టీవీలో చూసి తట్టుకోలేకపోయా. పర్‌లో వచ్చిన ఆ పిల్లాడి వార్తలన్నీ కత్తిరించి దాచుకున్న. ఆ తర్వాత రోజుకొకరు.. చనిపోతూ ఉన్నారు. అలా అందరివి కత్తిరించి దాచిపెడుతున్న. ఇప్పటికి 600 మంది చనిపోయారు. నేను అందరివీ సేకరించలేకపోయాను. 434 మందివి సేకరించాను. అందులో కొందరి తల్లిదండుల దగ్గరికి వెళ్లి ఓదార్చుతున్నాను. ఇప్పుడు నేను సేకరించినవన్నీ పుస్తకంగాచేసి అందరికీ పంచుతున్న. ట్యాంక్‌బండ్ మీద విగ్రహాలు కూలగొడితే.. లబోదిబోమన్న కొందరు జనాలు..  ఫైలు చూసి ఏం మాట్లాడతారో చూద్దాం.

Comments

kruthi said…
భళా పెద్దాయన మీ సర్వే బాగుంది. మీలాంటి వారు ఆత్మహత్యలు చేసుకున్న వారి వివరాలతో పాటు ఆంధ్రప్రదేశ్ లో ప్రాంతాల వారిగా అభివృద్ధిని కూడా సేకరించి జతపరిచి ఉంటే (కాకి లెక్కలు కాక స్వేతపత్రంలా) అప్పుడు తెలంగాణా ఆవశ్యకత గురించి ఆలోచించేవారు ఇలాంటి ఆత్మహత్యలు ఇక ఉండవు.

ఇక్కడ నేను మిమ్మల్ని ఒక విషయం అడుగుతున్నా,

తెలంగాణ వాదం ఎంత వరకు సమంజసం? అభివృధి లో వెనకబాటు తనం అంటూ అభివృద్ధి కొరకు పోరాటం అంటున్నారు. సీమంధ్రులు తెలంగాణను దోచుకుంటున్నారు అంటున్నారు. మరి సామాన్య ప్రజలు దోచుకుంటున్నారు అనటంలో ఎంత నిజం వున్నది ప్రతి ప్రసంగం లో సీమంధ్రులు మా నీరు మా మన్ను దోచుకుంటున్నారు అంటున్నారు. ఏనాడు మీరు అభివృద్ధి కొరకే పోరాడలేదు విభజన కొరకు మాత్రమే పోరాడుతున్నారు. అభివృద్ధి కీలక పాత్రగా అందించిన ప్రత్యేక జీవోలు ప్రత్యేక ప్యాకేజీలు సరిగా అమలు కానపుడు వాటికొరకు మీరు చేసిన పోరాటాలు ఎంత ఘాటుగా ఉన్నేయో ఆత్మ విమర్శ చేసుకోండి? ఇప్పుడు చేస్తున్నటువంటి ఉద్యమాలు, ప్రత్యేక జీవోలు ప్రత్యేక ప్యాకేజీల ఫై ప్రభుత్వం అలసత్వం చేసిన సందర్భాలలో చేసివుంటే. ఈరోజు ఇలాంటి దుస్థితి వచ్చేది కాదు కద.
Bhaskar said…
గత 55 ఏళ్ళనుంచీ జరిగేది తెలంగాణా అభివ్రుద్ధి కోసం పోరాటమే. తెలంగాణా ప్రత్యెక రాస్త్ర డిమాండ్ లో ఇమిడిఉంది కూడ అదే. తెలంగాణా అభివ్రుద్ధి, స్వయంపాలన, ఆత్మగౌరవం తోనే జరుగుతుందని తెలంగాణా ప్రజలు నమ్ముతున్నారు. 1956 లో అంధ్రప్రదెష్ రాస్త్ర ఏర్పాటు రూపంలో రాజకీయ ఐక్యతే వచ్చిందిగానీ మానసికంగా తెలుగువాళ్ళంతా ఒక జాతి అనేటటువంటి ఐక్యత రాలెదు. భాషాసంస్క్రుతులపైన జరిగిన దాడి, మితిమీరిన వలసలు, ఉద్యగ, వనరుల విషయంలో జరిగిన అన్యాయాలు దీనికి కారణం. ఇది సీమాంధ్రులు అర్థం చేసుకుని, సహ్రుదయంతో విభజనకు అంగీకరిస్తే అందరికీ మంచిది. లేనట్లైతే అసహజ పరిణామాలు ఏర్పడె అవకాశం ఉంతుంది. తెలుగువాళ్ళకు రెండు రాష్ట్రాలు ఉంటే తప్పేమీ లేదు. మరింత అభివ్రుద్ధ్రికి అవకాశం ఉంటుంది. సమస్యను శాశ్వతంగా కప్పేయాలనుకోడం సరైంది కాదు. విడిపొయినతర్వాత కూడా రెండు రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం, సుహ్రుధ్భవం అవసరమే.
హైదరాబాదు ను అడ్డంకిగా చూపడం కూడా సరికాదు. అదే సమస్య అయినట్లైతే ఇరుప్రాంతాల నాయకులు కూర్చుని చర్చల ద్వారా ఒక అంగీకారానికి రావచ్చు. ఇక్కడ స్థిరపడ్డ సీమాంధ్రులకు ఎటువంటి ఇబ్బందీ ఉండదని తెలంగాణావాళ్ళు మొదటినుంచీ చెప్పుతూనే ఉన్నారు. ఈవిధంగా ప్రతిష్టంభన ఎక్కువ కాలం కొనసాగటం ఇరు ప్రాంతాలవారికీ శ్రేయస్కరం కాదు. విగ్నతతో ఒక నిర్ణయం తీసుకోవల్సిన సమయం వచ్చింది.

Popular posts from this blog

ఈ తిట్లు వింటే మీరూ తెగ నవ్వుతారు..

తిట్టడం ఒక యోగం.. తిట్టించడం ఒక భోగం.. తిట్టలేకపోవడం... ఒక రోగం. అదేంటి? జనరల్‌గా ‘నవ్వు’ గురించి కదా ఇలా చెప్తారు. ఇక్కడ నవ్వుకి.. తిట్లకి సంబంధం ఉంది. అందుకే అలా. ఏడుపొస్తే ఆపుకోవడం.. కోపమొస్తే తిట్టకపోవడం.. సెల్‌ఫోన్‌లో బ్యాలెన్స్ ఉండీ అవుట్‌గోయింగ్ చేయలేకపోవడం లాంటిది. అందుకే చీవాట్లెట్టండి. ఫన్నీగా.. తిట్ల గురించి కూడా ముచ్చట్లా? అని తిట్టుకోకండి. గూట్లో దాచిపెట్టి గూగుల్‌లో వెతికే రోజులివి. దేనికోసమో ‘యా’లో సెర్చ్ చేస్తుంటే.. What is the meaning of telugu word ne dumpa tega? (నీ దుంప తెగ అనే తెలుగు పదానికి అర్థమేంటి?) అని ఒక ప్రశ్న కనిపించింది. అడిగింది లండన్‌లో ఉండే మన తెలుగాయనే. ఇండియాకి వచ్చినప్పుడు ఆయన్ని ఎవరు తిట్టారో తెలియదు కానీ.. దానికి ఇద్దరు సమాధానాలిచ్చారు. మొదటిది ఇది తెలుగులో వ్యవహారిక పదం. కాని లిటరల్‌గా అనువదించడానికి సరైన అర్థం లేదు. దీన్ని రకరకాల సందర్భాల్లో వాడతారు. కోపంగా ఉన్నప్పుడు, ఫ్రస్టేషన్‌లో ఇలా తిడతారు. ఆశ్చర్యమేసినప్పుడు కూడా వాడతారు. దీని అర్థం నిజంగా తెలుసుకోవాలంటే.. ఈ మాట అనేవాళ్ల టోన్, ఫేసియల్ ఎక్స్‌వూపెషన్స్ చూడాల్సిం...

'ఛాయ' మిస్టరీ వీడినది

ఈ గుళ్లో ఓ మిస్టరీ దాగి ఉంది. పది శతాబ్దాల పైబడి ఎవరికీ అంతుచిక్కని రహస్యం అది. శివలింగంపై ఒక నీడ పడుతుంది. అది ఎప్పుడూ స్థిరంగానే ఉంటుంది. అది ఎక్కడి నుంచి పడుతుందో కూడా ఎవరికీ తెలియదు. గర్భగుడిలోని ఆ నిగూఢాన్ని ఇప్పుడు చేధించాడో ఫిజిక్స్‌ లెక్చరర్‌.  నల్గొండ పట్టణానికి ఆనుకుని పానగల్‌ ఉంది. ఆ ఊరి చివరన ఉదయ సముద్రం. దాని ఒడ్డున పచ్చని పొలాల మధ్య ఒక పురాతన దేవాలయం. 11వ శతాబ్దపు కుందూరు చోళుల కాలం నాటిది. దీని పేరే ఛాయా సోమేశ్వరాలయం. ఆ పేరులోనే ఉంది దాని మిస్టరీ. మనం ఉదయించే సూర్యునికి ఎదురుగా నిలబడితే మన నీడ ఎక్కడ పడుతుంది? మన వెనకవైపు పడుతుంది కదా. అదే మధ్యాహ్నం నిలబడితే నీడ ముందుకు పడుతుంది. ఈ గుళ్లోని శివలింగంపై పడే నీడ ఉదయం అయినా, మధ్యాహ్నం అయినా ఎప్పుడూ కదలదు. ఇంకో విషయం... ఆ నీడ ఒక స్తంభం నీడలా కనిపిస్తుంది. ఆ గుళ్లో ఎనిమిది స్తంభాలుంటాయి. కానీ ఆ నీడ ఏ స్తంభానిదో ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే ఒక స్తంభం నీడ అని మనం అనుకున్నామనుకోండి. దాని నీడపడినప్పుడు దాన్ని ముట్టుకుంటే మన చేయి నీడ కూడా పడాలి కదా? అలా పడదు. అయితే ఈ నీడ మరి ఎక్కడి నుంచి పడుతోంది, రోజంతా స్థిరంగా ఎలా ఉంటోంది? ఈ వి...

సామ్రాజ్ఞి రుద్రమ (మన చరిత్ర - 1) My new column in Batukamma Sunday Magazine

దాదాపు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం.. సమాజంలో బలంగా వేళ్లూనుకుపోయిన పురుషాధిక్యతపై సవాలు విసురుతూ ఓ వీరనారి రాజ్యాధికారం చేపట్టింది. ఆడదానికి రాజ్యమా? ఆడది పరిపాలించడమా? అని అయిన వాళ్లే ఆమె ఆధిపత్యాన్ని జీర్ణించుకోలేకపోయారు. కొందరు సామంతులు, మండలాధీశులూ ఎదురు తిరిగే ప్రయత్నం చేశారు. అయినా ఆమె అదరలేదు. బెదరలేదు. అలాంటి వారి తలలు వంచి, నోళ్లు మూయించి ధీర వనితగా, శత్రు భయంకర రుద్రరూపిణిగా నిలిచిందామె. నేటి స్వేచ్ఛా మహిళకు ప్రతీకగా, స్త్రీ ఆత్మగౌరవానికి సమున్నత పతాకగా.. గెలిచి నిలిచిన.. ఆమే.. రాజగజకేసరి.. రణరంగ ఖడ్గధారిణి.. కాకతీయ మహాసామ్రాజ్యభార ధారణి.. రాణీ రుద్రమ దేవి..  కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడు అత్యంత పరాక్రమవంతుడు, రాజనీతి కోవిదుడు. ఈయనకు ఇద్దరు కూతుళ్లు. మహిళలు రాజ్యాధికారానికి అనర్హులన్న అప్పటి కాలపరిస్థితులకు భిన్నంగా కూతురు రుద్రమదేవిని కుమారునిగా పెంచాడు. అన్ని విద్యలూ నేర్పించాడు. గణపతి దేవుడు రుద్రమను రాజప్రతినిధిగా ప్రకటించినప్పుడు స్త్రీ పరిపాలనను, స్త్రీ అధికారాన్ని సహించలేని సామంతుల నుంచి, దాయాదుల నుంచి తీవ్ర ప్రతిఘటనలు ఎదురైనాయి. ఈ విపత్తులన్నింటినీ రుద్ర...