Skip to main content

కథ... స్క్రీన్‌ప్లే.. దర్శకత్శం భాస్కర్ రావు.. ది లెజెండ్ ఫిల్మ్ మేకర్‌

లైట్స్ ఆన్... స్టార్ట్ కెమెరా.. యాక్షన్...

24 ఫ్రేములు.. 20 సినిమాలు..

30 ఏళ్ల కెరీర్..

73 ఏళ్ల అనుభవం.. 23 ఏళ్ల విశ్రాంతి..

మాటల తూటాలు..

మానవసంబంధాల కథాంశాలు..

దటీజ్ బి. భాస్కర్ రావు!

ఆయన ఈ తరానికి తెలియక పోవచ్చు.. కానీ... ఆయన సినిమాలు

నేటికీ పాఠాలు..

అలాంటి ఫిల్మ్ మేకర్‌తో

ములాఖాత్ స్క్రిప్ట్ ఇది.



ఆయన మాటల్లో క్లారిటీ ఉంటుంది.
baskarraofamilyఫ్రేమ్ బై ఫ్రేమ్ సీన్లు ఉంటాయి.
‘ఉమెన్స్ కాలేజీ నుంచి కింగ్ కోఠీ వెళ్తుంటే.. సుల్తాన్ బజార్ హనుమాన్ వ్యాయామశాలకు వెళ్లే దారి.. ఆ మూల మీద అప్పట్లో దిల్షాద్ థియేటర్ ఉండేది.. ఇప్పుడు రాయల్ అపార్ట్‌మెంట్ ఉంది. అక్కడి నుంచి ముందుకు వస్తే కుడివైపు వ్యాయామశాల.. అది దాటాక.. హనుమాన్ టెంపుల్ ఆర్చ్ వస్తుంది.. దానికి ఎదురుగా నిలబడు.. చిన్న గుడి కనిపిస్తుంది.. అక్కడే ఇల్లు’ భాస్కర్ రావు(బీఆర్) ఫోన్లో చెప్పిన తన ఇంటి చిరునామా ఇది.
ఏ విషయమైనా అంత క్లియర్‌గా చెబుతారాయన. ఆ క్లారిటీ వెనక కాంటెంపరరీ అంశాలుంటాయి.. కాలగర్భంలో కలిసిపోయిన రీళ్లుంటాయి..

ఆ గల్లీలో భాస్కర్ రావు గురించి అడిగితే.. ‘కిరాయి ఉన్న ఇంటినే కొనేశాడు. సినిమా డైరెక్టరట. ఏం సినిమాలు తీశాడో మాత్రం నాకు తెలియద’న్నాడు ఒక కుర్రాడు.
కోరుకున్నది పొందడంలో.. అనుకున్నది సాధించడంలో బీఆర్‌కు కిరాయి ఇంటినే కొనేంత కాన్ఫిడెన్స్! అన్ని సినిమాలు తీసినా.. ఈతరానికి తెలియని లోప్రొఫైల్ ఆయనది! ఎందుకో అర్థం కావాలంటే ఆ కుర్రాడికి ఉండాలి.. కామన్‌సెన్స్...

62 సంవత్సరాల క్రితం...


ఏడో తరగతి, ఆరో తరగతి చదువుతున్న అన్నదమ్ములిద్దరు సినిమా కెళ్లారు. రోజూ స్కూలుకెళ్లే దారిలో ఉన్న చిన్న థియేటర్ అది. అందులో ఎక్కువగా హిందీ సినిమాలు ఆడేవి. అప్పుడప్పుడు ఇంగ్లీషు సినిమాలు. ఆ రోజు వారు చూసిన సినిమా - ‘త్రీ మస్కటీర్స్’.
‘అన్నయ్యా సినిమా భలే ఉందన్నయ్య. ఆ ముగ్గురు మస్కటీర్స్ అద్భుతంగా చేశారు’
‘ఆ ముగ్గురిది ఏముందిరా తమ్ముడు? వారితో అలా చేయించేది డైరెక్టర్. ఆ గొప్పతనం అంతా ఆయనదే’
ఆ తమ్ముడి మనసులో లైట్స్ ఆన్ అయ్యాయి. ఆలోచనలు ఆటోమెటిగ్గా క్లాప్‌కొట్టుకున్నాయి.
‘అన్నయ్య నేనూ డైరెక్టర్ అవుతాను?’
‘అదేంట్రా! నిన్నటి వరకు నువ్వు లాయర్ అవుతానన్నావుగా?’
- మాను వంగడం కష్టం. మొక్క వంగితే నష్టం ఏం లేదు.
తన లక్ష్యాన్ని వంచుకుంది.. తనను వంచాలని కోరుకుంది ఎవరో కాదు.. భాస్కర్ రావు.

బై బర్త్...

భాస్కర్ రావు 1939 ఆగస్టు 29న పుట్టాడు. అమ్మ కమలమ్మ, నాన్న కృష్ణయ్య. నాన్నది ఎలక్షిక్టిసిటీ డిపార్ట్‌మెంట్‌లో చిన్న ఉద్యోగం. వండర్‌ఫుల్ మెమరీ పవర్ భాస్కర్ రావుకు బై బర్త్ వచ్చింది. చదివింది గుర్తుంచుకోవడం.. చూసింది రాసుకోవడం.. బీఆర్‌కు అలవాటు. అందుకే క్లాసులో ఫస్ట్ వచ్చేవాడు. చూసిన ప్రతి సినిమా కథంతా ఇంటికి వచ్చాక నోటు పుస్తకంలో రాసుకునేవాడు. సీన్ బై సీన్ డైలాగ్‌తో సహా అతనికి గుర్తుండేవి. ఆ సినిమాని విశ్లేషిస్తూ తన అభివూపాయాన్ని కూడా చివర్లో రాసుకునేవాడు. అది అతనికెంతో ఉపయోగపడింది. కథలు పక్కాగా ఎలా రాసుకోవాలో అర్థమైంది.

అరుణోదయం

సినిమాలు చూస్తూ.. కథల్ని రాసుకుంటూ.. హెచ్‌ఎస్‌సీ పూర్తిచేశాడు. అప్పట్లో అదే పెద్ద చదువు. ఇక చాలనిపించింది. 1955లో గురుమూర్తిగారి సహకారంతో అరుణోదయ నాట్యమండలిలో చేరాడు. దర్శకుడు నటింపజేయాలంటే అతనికీ నటన తెలిసి ఉండాలనుకున్నాడు. అందుకే ‘అరుణోదయ’లో చేరి చిన్న చిన్న వేషాలు వేశాడు. సినిమాలవైపు బీఆర్‌ని ఇన్‌స్పైర్ చేసింది అక్కినేని నాగేశ్వరరావు. అప్పట్లో ఆయన నటించిన సినిమాల్ని విపరీతంగా చూసేవాడు. అలాంటి సినిమాలు తానూ తీయాలని కలగనేవాడు.

మూడేళ్ల తర్వాత...

అప్పట్లో చిత్ర పరిక్షిశమ అంతా చెన్నైలో ఉండేది కదా. అప్పుడప్పుడూ కొన్ని సినిమాల షూటింగ్‌లు హైదరాబాద్ సారథి స్టూడియోలో జరిగేవి. చెన్నై నుంచి డైరెక్టర్లు తమ అసిస్టెంట్లని కూడా తమతో తీసుకొస్తే ఖర్చు ఎక్కువవుతుందనుకునేవారు. అందుకే ఇక్కడి వారిని ఉపయోగించుకునేవారు. అలా బీఆర్‌లాంటివారు కొందరు వచ్చిన సినిమాకల్లా అంప్రెంటీస్‌లుగా చేసేవారు. లోకల్ పర్మిషన్లు.. ఇక్కడ ఏర్పాట్లు చూసుకునేవారు. అలా బీఆర్ 1958లో కులదైవం సినిమాకి అంప్రెంటీస్‌గా కుదిరాడు. క్లాప్ కొట్టడం, షాట్ మేకింగ్ నేర్చుకున్నాడు. కబీర్‌దాస్, చాణక్యలాంటి దర్శకులతో పనిచేశాడు. అలా మధుసూదన్ రావుగారితో పనిచేసే అవకాశం దొరికింది. ‘పదండి ముందుకు, లక్షాధికారి’ లాంటి సినిమాలకు పనిచేశాడు. ఆ తర్వాత ఆయనతో కలిసి చాలా సినిమాలకు అసిస్టెంట్‌గా పనిచేశాడు. ఆయన నుంచి ముఖ్యంగా సెంటిమెంట్ సీన్లను పండించడం ఎలాగో నేర్చుకున్నానంటారు భాస్కర్ రావు.

ఇల్లు.. ఇల్లాలు.. సినిమా

1968లో పెళ్లి చేసుకున్నాడు భాస్కర్ రావు... అప్పట్లో అసిస్టెంట్ డైరెక్టర్లకు నెలకు 100 రూపాయలిచ్చేవారు. అవి కుటుంబ పోషణకు సరిపోయేవి కావు. అందుకే భాస్కర్ ఉద్యోగస్తురాలైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఒక అమ్మాయి, అబ్బాయి పుట్టారు. అలా నాలుగైదు ఏళ్లు.. వాట్ ఎబౌట్ సినిమా? దర్శకుడు చంద్రశేఖర్‌డ్డి (పీసీ రెడ్డి) బీఆర్‌కు చాలా సన్నిహితుడు. రామారావుతో ఆయన బడిపంతులు సినిమా చేస్తున్న రోజులవి. భాస్కర్ రావు తన కథ గురించి చెప్పాడు. పాండుగౌడ్, ప్యారడైజ్ టాకీస్ యజమాని టి. కృష్ణల్ని పరిచయం చేశాడు పీసీఆర్. వారే బీఆర్ మొదటి సినిమా ‘మనుషులు మట్టి బొమ్మలు’ సినిమాకు నిర్మాతలు. కృష్ణ, జమున నటించిన సినిమా 74లో విడుదలైంది. అద్భుతంగా ఆడింది. ఆ సినిమాకు ఉత్తమ కథకుడిగా రాష్ట్ర ప్రభుత్వ నందీ అవార్డు వచ్చింది.

baskarraocam సెకండాఫ్..

రెండో సినిమా.. సగం తీశాక ఆగిపోయింది. ఏం చేయాలి? అప్పట్లో హెల్త్ మినిస్టర్ కోదాటి రాజమల్లు. ఆయన బీఆర్‌కు బాగా తెలిసిన వారు. మెడికల్ డిపార్ట్‌మెంట్‌కి సంబంధించి కల్తీ మీద డాక్యుమెంటరీ తీయమని అడిగారు. బాగానే డబ్బిచ్చారు. ఆ సొమ్ము, సహనిర్మాతతో కలిసి ‘చల్ మోహనరంగ’ సినిమా తీశాడు. తర్వాత ‘అమ్మ మనసు’ టెలీఫిల్మ్ తీశాడు. దానికీ అవార్డు వచ్చింది. తర్వాత చిరంజీవితో ‘రాధ మై డార్లింగ్’.. ఇక మెగాఫోన్ వదల్లేదు. వరుసగా సినిమాలు.. హిట్టులు.. ఫట్టులు.. ఎత్తులు పల్లాలు.. రాజీ పడి కొన్ని.. నమ్మకంతో ఇంకొన్ని.. గృహ ప్రవేశం.. గృహలక్ష్మి.. భారతంలో శంఖావారం.. ఎక్సెట్రా...

క్లైమాక్స్

భాస్కర్‌కు 50 ఏళ్ల వయసు వచ్చింది. కెమెరాకి 30 ఏళ్ల అనుభవం నిండింది. 1989లో శ్రీ రామచంవూదుడు సినిమా తీశాడు. అదే చివరిది. ఇంకో పెద్ద ప్రాజెక్టు ఆగిపోయింది. ఇండస్ట్రీ దాదాపు హైదరాబాద్‌కు మారిపోయింది. హైదరాబాద్.. చెన్నై.. సినిమాలు షికార్లు.. టూర్లు.. హీరోలు... హీరోయిన్లు.. మంచి మనుషులతో స్నేహం... చెడ్డవారికి దూరం.. ప్రభాకర్ రెడ్డిలాంటి మిత్రులు.. సూపర్ స్టార్ కృష్ణ, కృష్ణం రాజులాంటి ఆత్మీయులు.. సుల్తాన్ బజార్‌లో ఒక ఇల్లు.. ఇవీ భాస్కర్ రావు సంపాదించిన ఆస్తిపాస్తులు.. ఇక చాలు.. తన సినిమా జీవితానికి తానే పేకప్ చెప్పుకున్నాడు. 65 ఏళ్ల క్రితం మొదలైన.. వచ్చిన సినిమాని వదలకుండా చూడడం.. ఇంకా ఆగిపోలేదు. టీవీలో సినిమాలు చూస్తూ హ్యాపీగా గడిపేస్తున్నాడు.

నో కామెంట్ ప్లీజ్

ఇప్పటి సినిమాల మీద కామెంట్ చేయాల్సిన అర్హత భాస్కర్ రావుకి ఉంది. కానీ ఆయన ‘నో కామెంట్ ప్లీజ్’ అంటారు. ఆఫ్ ది రికార్డ్ అద్భుతంగా విశ్లేషిస్తారు. రాయడానికి మాత్రం ఒప్పుకోరు. ఎందుకంటే ఎవ్వరినీ నొప్పించే మనస్తత్వం కాదాయనది. మనుషుల మధ్య వెలితి ఉందంటారు. మానవ సంబంధాలు ప్లెయిన్‌గా ఉండడం లేదట. మనసులు సంకుచితత్వం అయిపోయాయి. మానవీయ పద్ధతులు మారిపోయాయి. మహిళలు సెక్యూరిటీ కోరుకుంటున్నారు. నేటి సినిమా కమర్షియలైజ్ అయిపోయింది. బడ్జెట్ పెరిగిపోయింది. కాకపోతే అప్పటికీ ఇప్పటికీ సినిమాకి లీడర్‌గా ఉంది కథే. కథలో బలం ఉంటేనే సినిమా నడిచేది.

హైలైట్ ఫ్రేమ్స్

- నాగేశ్వరరావు ఇన్‌స్పిరేషన్‌తో సినిమాల్లోకి వచ్చిన భాస్కర్ రావు 30 ఏళ్ల కెరీర్‌లో ఆయనతో సినిమా తీసే అవకాశం రాలేదు.
- భాస్కర్ రావు రెండో సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఆ తర్వాత ఆ టైటిల్ ముట్టుకున్నవాళ్ల సినిమాలూ ఆగిపోయీయి. ఇప్పటికీ ఆ టైటిల్‌తో సినిమా రాలేదు.
- ఏ సినిమాని కూడా రెండు సార్లు సెన్సార్ చేయరు. కానీ అప్పట్లో చల్‌మోహన రంగ సినిమాని రెండుసార్లు సెన్సార్ చేశారు.
- భాస్కర్ రావు క్రియేట్ చేసిన పాత్రల వల్ల జయసుధకి రెండు సార్లు ఉత్తమ నటిగా నంది అవార్డు లభించింది.
- చదరంగం సినిమా ద్వారా భానువూపియని తెలుగు చిత్ర పరిక్షిశమకి పరిచయం చేశారు భాస్కర్ రావు.
- సర్దార్ ధర్మన్న సినిమాలో భాస్కర్ రావు మొదటి సారిగా ఎర్రజెండాని చూపించారు.
- కొరియోక్షిగాఫర్ లేకుండానే ఒక సినిమాలో నాలుగు పాటల్ని షూట్ చేసేవారు భాస్కర్ రావు.
- బీఆర్ చాలా సినిమాల్లో జయసుధ హీరోయిన్‌గా నటించింది. బి. శంకర్ కూడా చాలా సినిమాలకు సంగీతం అందించాడు.
- ఇప్పటి దర్శకుల్లో ఎన్.శంకర్.. భాస్కర్ రావు రుణానుబంధం, కళ్యాణ తిలకం, భారతంలో శంఖారావం లాంటి సినిమాలకు పనిచేశారు.
- సుల్తాన్ బజార్ పహిల్వాన్ నర్సింగ్ యాదవ్‌ని నటుడ్ని చేసింది భాస్కర్ రావు. 

బీఆర్ బ్లాక్‌బస్టర్స్

1. మనుషులు మట్టి బొమ్మలు - కృష్ణ, జమున - 1974
2. చల్ మోహనరంగ- కృష్ణ, దీప - 1978
3. రాధ మై డార్లింగ్ - చిరంజీవి, విజయ - 1982
4. గృహ ప్రవేశం - మోహన్‌బాబు, జయసుధ - 1982
5. ధర్మాత్ముడు - కృష్ణంరాజు, జయసుధ - 1983
6. కుంకుమ తిలకం - సురేష్, జయసుధ - 1983
7. భారతంలో శంఖారావం - కృష్ణంరాజు, జయసుధ - 1984
8. చదరంగం - నరేష్, భానువూపియ - 1984
9. గృహలక్ష్మి- మోహన్‌బాబు, రాధిక, భానువూపియ - 1984
10. అగ్గిరాజు - కృష్ణంరాజు, జయసుధ - 1985
11. శ్రీవారు - శోభన్‌బాబు, విజయశాంతి - 1985
12. మామా కోడలు సవాల్ - కళ్యాణ చక్రవర్తి, కల్పన - 1986
13. సక్కనోడు - శోభన్‌బాబు, విజయశాంతి - 1986
14. కళ్యాణ తికలం- మోహన్‌బాబు, జయసుధ - 1987
15. సర్దార్ ధర్మన్న - కృష్ణం రాజు, జయసుధ- 1987
16. ఉమ్మడి మొగుడు - శోభన్‌బాబు, రాధిక - 1987
17. ఆస్తులు-అంతస్తులు - రాజేంవూదవూపసాద్, రమ్యకృష్ణ - 1988
18. శ్రీ రామచంవూదుడు - కృష్ణంరాజు, జయసుధ, విజయశాంతి -1989

Comments

extremely good post.congrats.

Popular posts from this blog

ఈ తిట్లు వింటే మీరూ తెగ నవ్వుతారు..

తిట్టడం ఒక యోగం.. తిట్టించడం ఒక భోగం.. తిట్టలేకపోవడం... ఒక రోగం. అదేంటి? జనరల్‌గా ‘నవ్వు’ గురించి కదా ఇలా చెప్తారు. ఇక్కడ నవ్వుకి.. తిట్లకి సంబంధం ఉంది. అందుకే అలా. ఏడుపొస్తే ఆపుకోవడం.. కోపమొస్తే తిట్టకపోవడం.. సెల్‌ఫోన్‌లో బ్యాలెన్స్ ఉండీ అవుట్‌గోయింగ్ చేయలేకపోవడం లాంటిది. అందుకే చీవాట్లెట్టండి. ఫన్నీగా.. తిట్ల గురించి కూడా ముచ్చట్లా? అని తిట్టుకోకండి. గూట్లో దాచిపెట్టి గూగుల్‌లో వెతికే రోజులివి. దేనికోసమో ‘యా’లో సెర్చ్ చేస్తుంటే.. What is the meaning of telugu word ne dumpa tega? (నీ దుంప తెగ అనే తెలుగు పదానికి అర్థమేంటి?) అని ఒక ప్రశ్న కనిపించింది. అడిగింది లండన్‌లో ఉండే మన తెలుగాయనే. ఇండియాకి వచ్చినప్పుడు ఆయన్ని ఎవరు తిట్టారో తెలియదు కానీ.. దానికి ఇద్దరు సమాధానాలిచ్చారు. మొదటిది ఇది తెలుగులో వ్యవహారిక పదం. కాని లిటరల్‌గా అనువదించడానికి సరైన అర్థం లేదు. దీన్ని రకరకాల సందర్భాల్లో వాడతారు. కోపంగా ఉన్నప్పుడు, ఫ్రస్టేషన్‌లో ఇలా తిడతారు. ఆశ్చర్యమేసినప్పుడు కూడా వాడతారు. దీని అర్థం నిజంగా తెలుసుకోవాలంటే.. ఈ మాట అనేవాళ్ల టోన్, ఫేసియల్ ఎక్స్‌వూపెషన్స్ చూడాల్సిం...

'ఛాయ' మిస్టరీ వీడినది

ఈ గుళ్లో ఓ మిస్టరీ దాగి ఉంది. పది శతాబ్దాల పైబడి ఎవరికీ అంతుచిక్కని రహస్యం అది. శివలింగంపై ఒక నీడ పడుతుంది. అది ఎప్పుడూ స్థిరంగానే ఉంటుంది. అది ఎక్కడి నుంచి పడుతుందో కూడా ఎవరికీ తెలియదు. గర్భగుడిలోని ఆ నిగూఢాన్ని ఇప్పుడు చేధించాడో ఫిజిక్స్‌ లెక్చరర్‌.  నల్గొండ పట్టణానికి ఆనుకుని పానగల్‌ ఉంది. ఆ ఊరి చివరన ఉదయ సముద్రం. దాని ఒడ్డున పచ్చని పొలాల మధ్య ఒక పురాతన దేవాలయం. 11వ శతాబ్దపు కుందూరు చోళుల కాలం నాటిది. దీని పేరే ఛాయా సోమేశ్వరాలయం. ఆ పేరులోనే ఉంది దాని మిస్టరీ. మనం ఉదయించే సూర్యునికి ఎదురుగా నిలబడితే మన నీడ ఎక్కడ పడుతుంది? మన వెనకవైపు పడుతుంది కదా. అదే మధ్యాహ్నం నిలబడితే నీడ ముందుకు పడుతుంది. ఈ గుళ్లోని శివలింగంపై పడే నీడ ఉదయం అయినా, మధ్యాహ్నం అయినా ఎప్పుడూ కదలదు. ఇంకో విషయం... ఆ నీడ ఒక స్తంభం నీడలా కనిపిస్తుంది. ఆ గుళ్లో ఎనిమిది స్తంభాలుంటాయి. కానీ ఆ నీడ ఏ స్తంభానిదో ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే ఒక స్తంభం నీడ అని మనం అనుకున్నామనుకోండి. దాని నీడపడినప్పుడు దాన్ని ముట్టుకుంటే మన చేయి నీడ కూడా పడాలి కదా? అలా పడదు. అయితే ఈ నీడ మరి ఎక్కడి నుంచి పడుతోంది, రోజంతా స్థిరంగా ఎలా ఉంటోంది? ఈ వి...

సామ్రాజ్ఞి రుద్రమ (మన చరిత్ర - 1) My new column in Batukamma Sunday Magazine

దాదాపు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం.. సమాజంలో బలంగా వేళ్లూనుకుపోయిన పురుషాధిక్యతపై సవాలు విసురుతూ ఓ వీరనారి రాజ్యాధికారం చేపట్టింది. ఆడదానికి రాజ్యమా? ఆడది పరిపాలించడమా? అని అయిన వాళ్లే ఆమె ఆధిపత్యాన్ని జీర్ణించుకోలేకపోయారు. కొందరు సామంతులు, మండలాధీశులూ ఎదురు తిరిగే ప్రయత్నం చేశారు. అయినా ఆమె అదరలేదు. బెదరలేదు. అలాంటి వారి తలలు వంచి, నోళ్లు మూయించి ధీర వనితగా, శత్రు భయంకర రుద్రరూపిణిగా నిలిచిందామె. నేటి స్వేచ్ఛా మహిళకు ప్రతీకగా, స్త్రీ ఆత్మగౌరవానికి సమున్నత పతాకగా.. గెలిచి నిలిచిన.. ఆమే.. రాజగజకేసరి.. రణరంగ ఖడ్గధారిణి.. కాకతీయ మహాసామ్రాజ్యభార ధారణి.. రాణీ రుద్రమ దేవి..  కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడు అత్యంత పరాక్రమవంతుడు, రాజనీతి కోవిదుడు. ఈయనకు ఇద్దరు కూతుళ్లు. మహిళలు రాజ్యాధికారానికి అనర్హులన్న అప్పటి కాలపరిస్థితులకు భిన్నంగా కూతురు రుద్రమదేవిని కుమారునిగా పెంచాడు. అన్ని విద్యలూ నేర్పించాడు. గణపతి దేవుడు రుద్రమను రాజప్రతినిధిగా ప్రకటించినప్పుడు స్త్రీ పరిపాలనను, స్త్రీ అధికారాన్ని సహించలేని సామంతుల నుంచి, దాయాదుల నుంచి తీవ్ర ప్రతిఘటనలు ఎదురైనాయి. ఈ విపత్తులన్నింటినీ రుద్ర...