100 % లవ్

By | November 07, 2012 Leave a Comment

 ఒక అమ్మాయి, అబ్బాయి బీచ్‌లో ఆడుకుంటున్నారు. ఆ అబ్బాయి దగ్గర చాలా రంగు రాళ్లు ఉన్నాయి. అమ్మాయి దగ్గర స్వీట్లు ఉన్నాయి.
‘నేను నీకు ఈ రంగురాళ్లు ఇస్తాను. నువ్వు నాకు ఈ స్వీట్లన్నీ ఇచ్చేస్తావా?’ అని అమ్మాయిని అబ్బాయి అడిగాడు. అందుకు అమ్మాయి ఒప్పుకుంది. ఆ అబ్బాయి ఒక రాయి దాచుకుని మిగిలినవి ఇచ్చేశాడు. ఆ అమ్మాయి మాత్రం మొత్తం స్వీట్లు ఇచ్చేసింది.
ఆ రోజు రాత్రి.. అమ్మాయి ప్రశాంతంగా నిద్రపోయింది. కానీ అబ్బాయికి నిద్రపట్టలేదు. తను ఒక రాయి దాచుకున్నట్లే.. ఆ అమ్మాయి కూడా ఒక స్వీటు దాచుకుని ఉంటుందని అతని అనుమానం.
మోరల్ : మీ భాగస్వామికి 100 % ప్రేమని ఇవ్వనప్పుడు.. వారు కూడా మీకు పూర్తిగా ఇవ్వలేదనే అనుమానం ఉంటుంది.  ందుకే ఏ లే మీరు 100 పర్సెంట్ లవ్ ఇవ్వండి. ప్రశాంతంగా నిద్రపోండి.

0 comments: