కథ ఒకతని పుట్టిన రోజు. ఇంట్లో వారెవరూ శుభాకాంక్షలు చెప్పలేదు. బాధతో ఆఫీసుకు వెళ్లాడు. కొలీగ్స్ కూడా చెప్పలేదు. సెక్రెటరీ మాత్రం హ్యాపీ బర్త్ డే అంటూ విష్ చేసింది. హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఆమె లంచ్ కి బయటికి తీసుకెళ్లింది. తర్వాత తన ఇంటికి వెళ్దామంది. అతను సంతోషంగా వెళ్లాడు. రెండు నిమిషాల్లో వస్తానంది. అతనికి షాక్ ఇద్దామని అతని పేరెంట్స ్ ని, భార్యాపిల్లలను, కొలీగ్స్ ని కేక్ తో సహా తీసుకొచ్చింది. కానీ వారంతా షాక్ తిన్నారు. అతను సోఫాలో నగ్నంగా కూర్చున్నాడు. స్క్రీన్ ప్లే 1 ఈ రోజు నా పుట్టిన రోజు.. నా తల్లిదండ్రులు, భార్యా పిల్లలు నాకు విషెష్ చెప్పలేదు. బాధేసింది. ఆఫీస్ కి వెళ్తే కొలీగ్స్ కూడా చెప్పలేదు. చిరాకేసింది. నా క్యాబిన్లోకి వెళ్లాను. నా సెక్రెటరీ అందంగా ఉంటుంది. హ్యాపీ బర్త్ డే చెప్పింది. సంతోషించాను. లంచ్ కి వెళ్దాం అంది. లంచ్ అయిపోయాక తన ఫ్లాట్ కి వెళ్దామని తీసుకెళ్లింది. బెడ్ రూమ్ లోకి వెళ్లి రెండు నిమిషాల్లో వస్తానంది. కోరుకున్నదేదో కాలికి తగులుతోంది అనుకున్నాను. ఐదు నిమిషాల తర్వాత… కేక్ తో వచ్చింది. మా పేరెంట్స్, భార్యా పిల్లలు, కొలీగ్స్ అందరూ ఉన్నారు. షాక్ తిన్నార...