Skip to main content

ఒక స్టోరీ.. మూడు స్క్రీన్ ప్లేలు.. !! 1 !!


కథ
ఒకతని పుట్టిన రోజు. ఇంట్లో వారెవరూ శుభాకాంక్షలు చెప్పలేదు. బాధతో ఆఫీసుకు వెళ్లాడు. కొలీగ్స్ కూడా చెప్పలేదు. సెక్రెటరీ మాత్రం హ్యాపీ బర్త్ డే అంటూ విష్ చేసింది. హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఆమె లంచ్ కి బయటికి తీసుకెళ్లింది. తర్వాత తన ఇంటికి వెళ్దామంది. అతను సంతోషంగా వెళ్లాడు. రెండు నిమిషాల్లో వస్తానంది. 
అతనికి షాక్ ఇద్దామని అతని పేరెంట్స్ ని, భార్యాపిల్లలను, కొలీగ్స్ ని కేక్ తో సహా తీసుకొచ్చింది.
కానీ వారంతా షాక్ తిన్నారు.
అతను సోఫాలో నగ్నంగా కూర్చున్నాడు.


స్క్రీన్ ప్లే 1
ఈ రోజు నా పుట్టిన రోజు.. నా తల్లిదండ్రులు, భార్యా పిల్లలు నాకు విషెష్ చెప్పలేదు. బాధేసింది. ఆఫీస్ కి వెళ్తే కొలీగ్స్ కూడా చెప్పలేదు. చిరాకేసింది. నా క్యాబిన్లోకి వెళ్లాను. నా సెక్రెటరీ అందంగా ఉంటుంది. హ్యాపీ బర్త్ డే చెప్పింది. సంతోషించాను. లంచ్ కి వెళ్దాం అంది.
లంచ్ అయిపోయాక తన ఫ్లాట్ కి వెళ్దామని తీసుకెళ్లింది. బెడ్ రూమ్ లోకి వెళ్లి రెండు నిమిషాల్లో వస్తానంది. కోరుకున్నదేదో కాలికి తగులుతోంది అనుకున్నాను.
ఐదు నిమిషాల తర్వాత…
కేక్ తో వచ్చింది. మా పేరెంట్స్, భార్యా పిల్లలు, కొలీగ్స్ అందరూ ఉన్నారు. షాక్ తిన్నారు.
నేను సోఫాలో…??


స్క్రీన్ ప్లే 2
ఈ రోజు మా ఆయన పుట్టిన రోజు. అత్త మామలు, పిల్లలు ఎవరం శుభాకాంక్షలు చెప్పలేదు. ఆయన బాధతో ఆఫీసుకు వెళ్లారు.
మేమంతా రెడీ అయి ఆయన సెక్రెటరీ ఇంటికి వెళ్లాం. తనేదో సర్ ప్రైజ్ ప్లాన్ చేసింది. లంచ్ అయిపోయాక కేక్ కటింగ్.. అప్పటి వరకు బెడ్ రూమ్ లో రెస్ట్ తీసుకొమ్మంది. తను వచ్చింది. ఆయన హాల్ లో వెయిట్ చేస్తున్నారని చెప్పింది. మేం కేక్ తీసుకుని బయటికి వచ్చాం.
కానీ ఆయన…!!


స్క్రీన్ ప్లే ౩
ఈ రోజు మా బాస్ పుట్టిన రోజు.. ఎప్పటిలా కాకుండా సర్ ప్రైజ్ ప్లాన్ చేశాను. మేడమ్ తో మాట్లాడి విషెష్ చెప్పొద్దన్నాను. బాస్ ఆఫీసుకు రాగానే అర్థమయింది. ఇంట్లో వాళ్లు చెప్పలేదని. థ్రిల్ ఫీలవుతారనుకున్నాను. లంచ్ కి తీసుకెళ్లాను. మేడమ్ వాళ్లు ఇంటికి వచ్చారో లేదో కనుక్కున్నాను. వాచ్ మెన్ కి చెప్పి బెడ్ రూమ్ లో కూర్చోబెట్టాను.
లంచ్ అయ్యాక బాస్ ని ఇంటికి తీసుకెళ్లాను. కేక్ తీసుకుని మేడమ్ వాళ్లని తీసుకొద్దామని బెడ్ రూమ్ లోకి వెళ్లాను.
ఐదు నిమిషాల తర్వాత మేం వచ్చేసరికి…
బాస్… !!
(కథ ఒక్కటే.. ఎవ్వడి వర్షన్ వాడికి ఉంటుంది. నువ్వోలా చెబుతావ్. నేనోలా చెబుతా. కాపీ, ప్లజరిజమ్ అనేవి సోది మాటలు)

Comments

Popular posts from this blog

ఈ తిట్లు వింటే మీరూ తెగ నవ్వుతారు..

తిట్టడం ఒక యోగం.. తిట్టించడం ఒక భోగం.. తిట్టలేకపోవడం... ఒక రోగం. అదేంటి? జనరల్‌గా ‘నవ్వు’ గురించి కదా ఇలా చెప్తారు. ఇక్కడ నవ్వుకి.. తిట్లకి సంబంధం ఉంది. అందుకే అలా. ఏడుపొస్తే ఆపుకోవడం.. కోపమొస్తే తిట్టకపోవడం.. సెల్‌ఫోన్‌లో బ్యాలెన్స్ ఉండీ అవుట్‌గోయింగ్ చేయలేకపోవడం లాంటిది. అందుకే చీవాట్లెట్టండి. ఫన్నీగా.. తిట్ల గురించి కూడా ముచ్చట్లా? అని తిట్టుకోకండి. గూట్లో దాచిపెట్టి గూగుల్‌లో వెతికే రోజులివి. దేనికోసమో ‘యా’లో సెర్చ్ చేస్తుంటే.. What is the meaning of telugu word ne dumpa tega? (నీ దుంప తెగ అనే తెలుగు పదానికి అర్థమేంటి?) అని ఒక ప్రశ్న కనిపించింది. అడిగింది లండన్‌లో ఉండే మన తెలుగాయనే. ఇండియాకి వచ్చినప్పుడు ఆయన్ని ఎవరు తిట్టారో తెలియదు కానీ.. దానికి ఇద్దరు సమాధానాలిచ్చారు. మొదటిది ఇది తెలుగులో వ్యవహారిక పదం. కాని లిటరల్‌గా అనువదించడానికి సరైన అర్థం లేదు. దీన్ని రకరకాల సందర్భాల్లో వాడతారు. కోపంగా ఉన్నప్పుడు, ఫ్రస్టేషన్‌లో ఇలా తిడతారు. ఆశ్చర్యమేసినప్పుడు కూడా వాడతారు. దీని అర్థం నిజంగా తెలుసుకోవాలంటే.. ఈ మాట అనేవాళ్ల టోన్, ఫేసియల్ ఎక్స్‌వూపెషన్స్ చూడాల్సిం...

ప్రేమే కదా(కాదు) జీవితం

ప్రేమే కదా జీవితం అంటారు కొందరు. ప్రేమే కాదు జీవితం అంటారు ఇంకొందరు. ఈ రెండూ భిన్న ధృవాలు. రైలు పట్టాలు. ఎప్పుడూ కలవవు. కానీ అవి అతని జీవితంలో కలిశాయి. అదే విధి ఆడిన వింత నాటకం. పది మందీ నేర్పలేని గుణపాఠం. మాదో చిన్న పల్లెటూరు. వందల్లో ఇల్లు. మందల్లా మనుషులు. ఎవరి పోకడ వారిది. చీమ కదిలినా గుసగుస. అమ్మాయిలతో మాట్లాడటం... అదో పెద్ద తప్పు. నా స్నేహితుని పేరు వెంకట్‌. పెళ్లంటూ చేసుకుంటే ప్రేమించే చేసుకోవాలని వాడిదో కోరిక. కానీ ఏ అమ్మాయీ నచ్చేది కాదు. వెంకట్‌ హైదరాబాద్‌లో జాబ్‌ చేస్తుండేవాడు. చాలా రోజుల తర్వాత సంక్రాతికి ఊరొచ్చాడు. మా ఊళ్లో సంక్రాంతి క్రీడోత్సవాలు ఘనంగా జరుగుతాయి. అప్పుడు ఊరంతా అక్కడే. కబడ్డీ ఫైనల్స్‌. అందరి కళ్లూ వారిపైనే. కానీ వెంకట్‌ కళ్లు మాత్రం ఎవరికోసమో వెతుకుతున్నాయి. అప్పుడు కనిపించింది ఓ అమ్మాయి లంగా ఓణీలో. సినిమాల్లో తప్ప ఓణీలో అమ్మాయిని చూసి చాలా రోజులైందట. అలానే చూస్తుండి పోయాడు. సడన్‌గా ఆ అమ్మాయి వెంకట్‌ వైపు చూసింది. ఆమె చూపుల్లో కోపం. అతని చూపుల నుండి తప్పించుకోవాలని ఆమె అటూ ఇటూ తిరగసాగింది. కానీ వెంకట్‌ చూపులు ఆమె వెంటే పరుగెత్తాయి. ఎవరా అమ్మాయి? ఆరా...

'ఛాయ' మిస్టరీ వీడినది

ఈ గుళ్లో ఓ మిస్టరీ దాగి ఉంది. పది శతాబ్దాల పైబడి ఎవరికీ అంతుచిక్కని రహస్యం అది. శివలింగంపై ఒక నీడ పడుతుంది. అది ఎప్పుడూ స్థిరంగానే ఉంటుంది. అది ఎక్కడి నుంచి పడుతుందో కూడా ఎవరికీ తెలియదు. గర్భగుడిలోని ఆ నిగూఢాన్ని ఇప్పుడు చేధించాడో ఫిజిక్స్‌ లెక్చరర్‌.  నల్గొండ పట్టణానికి ఆనుకుని పానగల్‌ ఉంది. ఆ ఊరి చివరన ఉదయ సముద్రం. దాని ఒడ్డున పచ్చని పొలాల మధ్య ఒక పురాతన దేవాలయం. 11వ శతాబ్దపు కుందూరు చోళుల కాలం నాటిది. దీని పేరే ఛాయా సోమేశ్వరాలయం. ఆ పేరులోనే ఉంది దాని మిస్టరీ. మనం ఉదయించే సూర్యునికి ఎదురుగా నిలబడితే మన నీడ ఎక్కడ పడుతుంది? మన వెనకవైపు పడుతుంది కదా. అదే మధ్యాహ్నం నిలబడితే నీడ ముందుకు పడుతుంది. ఈ గుళ్లోని శివలింగంపై పడే నీడ ఉదయం అయినా, మధ్యాహ్నం అయినా ఎప్పుడూ కదలదు. ఇంకో విషయం... ఆ నీడ ఒక స్తంభం నీడలా కనిపిస్తుంది. ఆ గుళ్లో ఎనిమిది స్తంభాలుంటాయి. కానీ ఆ నీడ ఏ స్తంభానిదో ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే ఒక స్తంభం నీడ అని మనం అనుకున్నామనుకోండి. దాని నీడపడినప్పుడు దాన్ని ముట్టుకుంటే మన చేయి నీడ కూడా పడాలి కదా? అలా పడదు. అయితే ఈ నీడ మరి ఎక్కడి నుంచి పడుతోంది, రోజంతా స్థిరంగా ఎలా ఉంటోంది? ఈ వి...