వన్ స్టోరీ.. 4 స్ర్కీన్ ప్లేస్ !!2!! (ప్రపంచంలోనే అతి చిన్న ప్రేమ కథ : universal love story)

By | November 01, 2014 Leave a Comment

కథ
ఒక అబ్బాయి ప్రపోజ్ చేశాడు. 
అమ్మాయి ఒప్పుకోలేదు.
ఆ తర్వాత ఇద్దరూ సంతోషంగా జీవించారు. 


స్ర్కీన్ ప్లే 1
తనని చూడగానే ఇంప్రెస్ అయ్యాను. నచ్చావని చాలాసార్లు చెప్పాలనుకున్నాను. 
చివరికి ఒకరోజు ప్రపోజ్ చేశాను. కానీ అమ్మాయి ఒప్పుకోలేదు. చాలా ప్రయత్నించాను. కానీ తన మనసు మారలేదు. 
ఇక తనని మర్చిపోవడానికి ప్రయత్నించాను. 
వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. 
సంతోషంగా జీవించాను. 

స్ర్కీన్ ప్లే 2
అతడు అప్పుడప్పుడూ కనిపిస్తూ ఉండేవాడు. అదోలా చూసేవాడు. 
ఒకరోజు సడెన్ గా వచ్చి ప్రపోజ్ చేశాడు. నాకేం అర్థం కాలేదు. కుదరదన్నాను. 
అయినా సతాయించాడు. 
ఆ తర్వాత ఏమయ్యిందో కనిపించలేదు. 
ఇంట్లో వాళ్లు చూసిన సంబంధం చేసుకున్నాను. 
హ్యాపీగా జీవించాను. 

స్ర్కీన్ ప్లే 3
తన చూడగానే ఫ్లాట్ అయిపోయాను. నచ్చావని చెప్పాను. మాట్లాడలేదు. 
ఒకరోజు ప్రపోజ్ చేశాను. అమ్మాయి ఒప్పుకోలేదు. చాలా ప్రయత్నించాను. తన మనసు మారింది. 
ఇంట్లో వాళ్లని ఒప్పించి పెళ్లి చేసుకున్నాం. 
ఇద్దరం సంతోషంగా జీవించాం. 

స్ర్కీన్ ప్లే 4
తను ఎక్కడ తగిలాడో తెలియదు. ఆ కళ్లెప్పుడూ నన్నే వెతికేవి. 
చూసి నవ్వే వాడు తప్ప మాట్లాడేవాడు కాదు. 
ఒకరోజు సడెన్ గా ప్రపోజ్ చేశాడు. నాకేం అర్థం కాలేదు. 
అడగ్గానే ఒప్పుకుంటే అమ్మాయిని ఎలా అవుతాను. కుదరదన్నాను. 
అయినా వదల్లేదు. నచ్చాడు. 
ఇంట్లో చెప్పాను. చూద్దాం అన్నారు. తన వాళ్లు వచ్చి అడిగారు. 
మా వాళ్లు ఒప్పుకోవడంతో పెళ్లి చేసుకున్నాం. 
ఇంకేముంది ఆల్ హ్యాపీస్.

0 comments: