Skip to main content

Posts

Showing posts from March, 2015

మూడు కర్రలు : ఉగాదికి ఊరెళ్లినప్పుడు ఈ విషయాలు తెలిశాయి

చిర్క బద్ద : గౌడు కల్లు గీసేందుకు వాడే కత్తిని గీస కత్తి అంటరు. దీన్ని నూరడం భలే ఉంటుంది. ఒక పెద్ద రాయి పక్కన ఒక కర్ర ను పెట్టి చిన్న రాయితో కొడతాడు. రాయి నుంచి కర్ర మీద పడే పొడితే కత్తి నూరుతాడు. ఈ కర్రనే చిర్క బద్ద అంటారు. చిడుత బద్ద, చిరిక కర్ర అనే పేర్లు కూడా ఉన్నాయట. దీన్ని చాలాసార్లే చూశాను. కానీ ఈ చిర్క బద్దను కుంకుడు కర్రతో మాత్రమే తయారు చేస్తారట.  రోకలి : రోకలి తయారీకి ముఖ్యంగా ఎర్రచందనం కర్రను ఉపయోగిస్తారు. ఎనుమొద్దు, ఏపి క ర్రను కూడా ఉపయోగిస్తారు. ఇవి దొరకని పక్షంలో ఊటి, చింత కర్రలను వాడతారు. ఊటి, చింత కర్రలను వాడితే తొందరగా చీలికలు వస్తాయట. అందుకే వీటిని తక్కువగా వాడతారు. మామిడి కర్రతోనా రోకలి చెయ్యటం? అనే సామెత కూడా ఉంది. అయితే మా ఊర్లో మాత్రం రోకలి రేగు కర్రని మాత్రమే వాడతారు. మటన్ కొట్టే చక్క దిమ్మె (దీని ప్రత్యేక పేరు ఏదైనా ఉందా? : పండుగలప్పుడు యాటలు  కోసినప్పుడు మా ఊర్లో ఇది కనిపిస్తుంది. మామూలుగా అన్ని మటన్ షాపులలో కూడా ఉంటుంది. అయితే దీనికి మాత్రం చింత చెట్టు మొద్దును మాత్రమే వాడతారట.  వాడతారట.  మటన్ కొట్టే చక్క ...

ఒక నజియా కోసం.. : 1947 నాటి చరిత్రాత్మక వీర తెలంగాణ ప్రేమకథ (నవల)

అరవై ఆరెళ్ళ తర్వాత ఒక ఉత్తరం తిరిగొచ్చింది.. మా తాత తన ప్రేయసి నజియాకు రాసింది.. అది చూసి ఆయన గుండె వేగం పెరిగింది.. హాస్పిటల్ బెడ్ మీద కొన ఊపిరితో ఆమెను కలవరిస్తున్నారాయన.. ఎవరీ నజియా? ప్రేమించుకుని ఎందుకు పెళ్ళి చెసుకోలేక పోయారు? తాత వస్తానని ఉత్తరం రాసి.. ఎందుకు వెళ్ళలేదు? ఎవరీ నిజాం? అసలు ఆయన్ని ఎందుకు చంపాలనుకున్నాడు? మరి నజియా ఏమై పోయింది? నేనిప్పుడు గుచ్చుకుంటున్న ఈ ప్రశ్నల కత్తులు గుండె ఒరలో పెట్టుకుని.. ముంబై నుంచి హైదరాబాద్ బయలుదెరుతున్నాను. నా ప్రయాణం సమాధానాల కోసం, తాత కోసం మాత్రమే కాదు.. నాకు తెలియని నా ములాల కోసం కూడా.. ఈ కార్తీక్ రామస్వామి అన్వేషణ ఒక నజియా కోసం.. నా హీరోయిన్.. ఐదేళ్ల క్రితం ఆంధ్రజ్యోతి కోసం రాసిన కథనం ఇది. (25.2.2010) ఇదిగో ఈ ఫోటోలో ఎరుపు రంగు చీరలో వెలిగిపోతుంది చూశారా? తనే నా హీరోయిన్.  ఇబ్రహీంపట్నం నుంచి నాయినంపల్లి వెళ్లే మార్గంలో వినోభానగర్ ఉంది. అక్కడ పచ్చని చెట్ల మధ్య పాలరాతి శిల్పంలా కనిపిస్తుంది ఓ ఆశ్రమం. జనజీవనానికి దూరంగా ఆహ్లాదకర వాతావరణంలో కనిపిస్తుంది "మాతాపితరుల సేవాసదనం.' అనాథలుగా మిగిలిన...