మూడు కర్రలు : ఉగాదికి ఊరెళ్లినప్పుడు ఈ విషయాలు తెలిశాయి

By | March 30, 2015 Leave a Comment
చిర్క బద్ద : గౌడు కల్లు గీసేందుకు వాడే కత్తిని గీస కత్తి అంటరు. దీన్ని నూరడం భలే ఉంటుంది. ఒక పెద్ద రాయి పక్కన ఒక కర్ర ను పెట్టి చిన్న రాయితో కొడతాడు. రాయి నుంచి కర్ర మీద పడే పొడితే కత్తి నూరుతాడు. ఈ కర్రనే చిర్క బద్ద అంటారు. చిడుత బద్ద, చిరిక కర్ర అనే పేర్లు కూడా ఉన్నాయట. దీన్ని చాలాసార్లే చూశాను. కానీ ఈ చిర్క బద్దను కుంకుడు కర్రతో మాత్రమే తయారు చేస్తారట. 
రోకలి : రోకలి తయారీకి ముఖ్యంగా ఎర్రచందనం కర్రను ఉపయోగిస్తారు. ఎనుమొద్దు, ఏపి కర్రను కూడా ఉపయోగిస్తారు. ఇవి దొరకని పక్షంలో ఊటి, చింత కర్రలను వాడతారు. ఊటి, చింత కర్రలను వాడితే తొందరగా చీలికలు వస్తాయట. అందుకే వీటిని తక్కువగా వాడతారు. మామిడి కర్రతోనా రోకలి చెయ్యటం? అనే సామెత కూడా ఉంది. అయితే మా ఊర్లో మాత్రం రోకలి రేగు కర్రని మాత్రమే వాడతారు.
మటన్ కొట్టే చక్క దిమ్మె (దీని ప్రత్యేక పేరు ఏదైనా ఉందా? : పండుగలప్పుడు యాటలు 
కోసినప్పుడు మా ఊర్లో ఇది కనిపిస్తుంది. మామూలుగా అన్ని మటన్ షాపులలో కూడా ఉంటుంది. అయితే దీనికి మాత్రం చింత చెట్టు మొద్దును మాత్రమే వాడతారట. 


వాడతారట. 
మటన్ కొట్టే చక్క దిమ్మె (దీని ప్రత్యేక పేరు ఏదైనా ఉందా? : పండుగలప్పుడు యాటలు కోసినప్పుడు మా ఊర్లో ఇది కనిపిస్తుంది. మామూలుగా అన్ని మటన్ షాపులలో కూడా ఉంటుంది. అయితే దీనికి మాత్రం చింత చెట్టు మొద్దును మాత్రమే వాడతారట.



0 comments: