Skip to main content

Posts

ప్రయివేటు టీచర్‌.కామ్‌

గూగుల్‌ కూడా గుర్తించలేని ఒక మారుమూల తండాలో పుట్టాడు సోమేశ్వర్‌ వంశీ నాయక్‌. అయితే ఇప్పుడు గూగుల్‌లో అతని గురించి ఒక్కసారి వెతికి చూడండి.. మీకు కావాల్సినంత సమాచారం దొరుకుతుంది. అసలు వంశీ గురించి మేమెందుకు తెలుసుకోవాలి అంటారా? ఉద్యోగ వేటలో తనకు ఎదురైన అనుభవాలు మరెవరికీ ఎదురుకాకూడదని ఉపాధ్యాయుల కోసం ఒక ప్రత్యేకమైన వెబ్‌సైట్‌ని రూపొందించాడు. దాని గురించే ఈ కథనం. మీరు టీచర్‌గా పనిచేస్తున్నారా? లేదంటే పనిచేయాలన్న ఆలోచన ఉందా? ఇప్పుడున్న పాఠశాలలో కాకుండా మరో మంచిస్కూల్‌ కోసం వెతుకుతున్నారా? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానం మీకు ఒకే దగ్గర దొరుకుతుంది. అదే ఎడ్యునెస్ట్‌ (www.edunest.org). కేవలం టీచర్ల కోసమే రూపొందించిన వెబ్‌ పోర ్టల్‌ ఇది. దీన్ని డిజైన్‌ చేసింది పెద్ద సాఫ్ట్‌వేర్‌ కంపెనీ కాదు, నిన్న మొన్ననే ఎంఏ పూర్తి చేసిన ఒక సాధారణ టీచర్‌. అసలు అతనికి ఎందుకు ఈ ఆలోచన వచ్చిందో చదవండి. ఓ దసరా పండగ మధ్యాహ్నం.. ట్యాంక్‌బండ్‌పై ఒంటరిగా బెంచీ మీద కూర్చుని ఇలా డైరీ రాసుకుంటున్నాడు వంశీ నాయక్‌. "అందరూ కొత్తబట్టలు వేసుకుని, పండగ జరుపుకుంటూ సంతోషంగా ఉన్నారు. కానీ నా పరిస్థితేంటి ఇలా ఉంది? ఆక...

వీళ్లు గుండె మీద చెయ్యేసి చెప్పేస్తారు...

వారికి ప్రపంచం మ్యూట్‌లో పెట్టిన టీవీలా కనిపిస్తుంటుంది. పసిపాప నవ్వు.. కోకిల పాట.. సెలయేటి హోరు.. రైలు కూత.. ఇలా అన్ని శబ్దాలూ వారికి జీరో డెసిబెల్‌లోనే వినిపిస్తాయి. మరి టీచర్లు చెప్పే పాఠాలు వారికెలా వినిపిస్తాయి? నిన్న బధిరుల దినోత్సవం సందర్భంగా ఎల్‌కేజీ నుంచి పిజీ వరకు కేవలం బధిరుల కోసమే ఉన్న ఒక ఇనిస్టిట్యూట్‌కి వెళ్లాను. అక్కడ అక్కడ ఈ కింది 'మ్యూటీఫుల్‌' సీన్స్‌ కనిపించాయి. సికింద్రాబాద్‌లోని రామకృష్ణాపురం.... నిండా నీళ్లతో నిండు గర్భిణిలా ఉన్న చెరువుని చూస్తూ ఫ్లైఓవర్‌ దిగగానే రైల్వే బ్రిడ్జీ కనిపించింది. బ్రిడ్జీకి కుడివైపు 'హెలెన్‌ కెల్లర్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ రీసెర్చ్‌ అండ్‌ రిహాబిలిటేషన్‌ ఫర్‌ ది డిసేబుల్డ్‌ చ్రిల్డన్‌' అనే బోర్డు ఉంది. ఆ ఇనిస్టిట్యూట్‌లో చాలా 'ప్రత్యేకమైన' పిల్లలు 600 మంది చదువుతున్నారు. ఒకరిద్దరు పిల్లలుంటేనే ఇల్లు మారుమోగిపోతుంది. అలాంటిది అంత మంది పిల్లలున్న ఆ పాఠశాలలో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. ఆశ్చర్యం లేకపోయినా ఏదో ఖాళీ. శబ్దం లోపించిన ఖాళీ. సైగలతో చదువులు, మౌనంగా ఆటలు.. కనిపించాయి అక్కడ. (శారీరక, మాన...

లక్షల రూపాయల విలువైన బైకులు

బ్లాక్‌ మెటల్‌ రోడ్‌... చుట్టూ పర్వతాలు... పచ్చని పొలాలు.. వెనకాల గర్ల్‌ ఫ్రెండ్‌ లేదా బోయ్‌ ఫ్రెండ్‌ వెనకాల మీరు.. 120 మైళ్ల స్పీడులో దూసుకుపోతున్న బైక్‌.. ఒక్కసారి కళ్లు మూసుకుని ఊహించుకోండి. ఎలా ఉంది? "గాల్లో తేలినట్లుందే.. గుండె జారినట్లుందే...'' అన్నట్లుంది కదా ఆ సీన్‌. కానీ అసలు మజా ఆ బైక్‌తో కాదు, ఇలాంటి బైక్‌పై వెళ్తేనే ఉంటుంది. ఇలాంటి అంటే.. హార్లీ డేవిడ్‌సన్‌.. ఆ పేరులోనే చూడండి ఎంత కిక్‌ ఉందో! హెచ్‌డీ(హార్లీ డేవిడ్‌సన్‌) అమెరికాకు చెందిన మోటార్‌ బైకుల బ్రాండెడ్‌ కంపెనీ. ఈ హెవీ బైకులకు మనదేశంలోనే కాదు అన్ని దేశాల్లోనూ మస్త్‌ క్రేజ్‌ ఉంది. మొన్నటి వరకు మనదేశంలో ఎవరైనా హై ఫై గైయ్స్‌ ఈ బైక్‌ కొనాలంటే ఏ దుబాయ్‌ నుంచో, అమెరికా నుంచో తెప్పించుకునేవారు. పవన్‌ కళ్యాణ్‌ నటిస్తున్న 'లవ్‌ ఆజ్‌ కల్‌' రీమేక్‌ సినిమా కోసం ఆయన జూలైలో ఒక హెచ్‌డి బైక్‌ దుబాయ్‌ నుంచే తెప్పించుకున్నారట. కానీ అదే నెలలో మన హైదరాబాద్‌లో బంజారా హెచ్‌డి షోరూమ్‌ ప్రారంభమైంది. బెంగళూరు, ఢిల్లీలలో కూడా ఇప్పుడు మొదలయ్యాయి. హైదరాబాద్‌లో బుకింగ్స్‌ మొదలైన 60 రోజుల్లోనే 25 బైకులు అమ్ముడ...

హుస్సేన్ సాగర్లో ఒక రోజు

మా ఇంట్లో బుజ్జి బొజ్జ గణపయ్య

రంజాన్ కీ ఏక్ రాత్

ఓం వినాయక విగ్రహాయనమః

'ఈ విగ్రహాలన్నీ ఎంతకిస్తావ్‌?' ఓ పెద్దావిడ అడిగింది. 'లేదండీ నేనివ్వను' చెప్పాడతను. 'మహా అంటే లక్షల విలువ చేస్తాయి. నేను కోటి రూపాయలిస్తాను' ఆశ పెట్టింది ఆమె. 'ఎన్ని కోట్లు?' అడిగాడాయన ఆసక్తిగా. 'పదికోట్లిస్తాను' గర్వంగా చెప్పిందామె. 'లేదండి. నేనివ్వను' ఆయన స్థిరంగా అన్నాడు. 'ఇరవై కోట్లిస్తాను' కాస్త పెంచింది. 'అయినా ఇవ్వను' ఆయన ఏమాత్రం దిగలేదు. 'ఇక బేరాలొద్దుగానీ, యాభై కోట్లిస్తాను. నాకిచ్చెయ్‌ ప్లీజ్‌' బతిమాలింది. 'ఎంతాస్తి ఉందేంటి మీకు?' అడిగాడాయన. 'ఓ ఐదువేల కోట్లు' చెప్పిందామె. 'ఆ ఆస్తంతా ఇచ్చినా ఈ విగ్రహాలు ఇవ్వను' కరాఖండిగా చెప్పాడు. లక్షల రూపాయల విలువచేసే విగ్రహాలను యాభై కోట్ల రూపాయలకు కూడా ఆయన ఎందుకివ్వలేదు? అంత విలువైనవా అవి? అవును. చుక్కలన్నీ ఏరి మీ ఇంట్లో దాస్తే.. ప్రపంచాన్ని బంధించి మీ గదిలో పెడితే.. మీరిచ్చేస్తారా? ఆయన కూడా అంతే. అవి కేవలం విగ్రహాలు కావు. ఆయన జీవితం. హైదరాబాద్‌లోని వెస్ట్‌మారేడ్‌పల్లిలో ఆ ఇంటి తలుపుపై వినాయకుని విగ్రహం చెక్కి ఉంటుంది. అలాంటివి ...