Skip to main content

ప్రేమే కదా(కాదు) జీవితం



ప్రేమే కదా జీవితం అంటారు కొందరు. ప్రేమే కాదు జీవితం అంటారు ఇంకొందరు. ఈ రెండూ భిన్న ధృవాలు. రైలు పట్టాలు. ఎప్పుడూ కలవవు. కానీ అవి అతని జీవితంలో కలిశాయి. అదే విధి ఆడిన వింత నాటకం. పది మందీ నేర్పలేని గుణపాఠం.

మాదో చిన్న పల్లెటూరు. వందల్లో ఇల్లు. మందల్లా మనుషులు. ఎవరి పోకడ వారిది. చీమ కదిలినా గుసగుస. అమ్మాయిలతో మాట్లాడటం... అదో పెద్ద తప్పు. నా స్నేహితుని పేరు వెంకట్‌. పెళ్లంటూ చేసుకుంటే ప్రేమించే చేసుకోవాలని వాడిదో కోరిక. కానీ ఏ అమ్మాయీ నచ్చేది కాదు.
వెంకట్‌ హైదరాబాద్‌లో జాబ్‌ చేస్తుండేవాడు. చాలా రోజుల తర్వాత సంక్రాతికి ఊరొచ్చాడు. మా ఊళ్లో సంక్రాంతి క్రీడోత్సవాలు ఘనంగా జరుగుతాయి. అప్పుడు ఊరంతా అక్కడే. కబడ్డీ ఫైనల్స్‌. అందరి కళ్లూ వారిపైనే. కానీ వెంకట్‌ కళ్లు మాత్రం ఎవరికోసమో వెతుకుతున్నాయి. అప్పుడు కనిపించింది ఓ అమ్మాయి లంగా ఓణీలో. సినిమాల్లో తప్ప ఓణీలో అమ్మాయిని చూసి చాలా రోజులైందట. అలానే చూస్తుండి పోయాడు. సడన్‌గా ఆ అమ్మాయి వెంకట్‌ వైపు చూసింది. ఆమె చూపుల్లో కోపం. అతని చూపుల నుండి తప్పించుకోవాలని ఆమె అటూ ఇటూ తిరగసాగింది. కానీ వెంకట్‌ చూపులు ఆమె వెంటే పరుగెత్తాయి. ఎవరా అమ్మాయి? ఆరాతీశాడు. ఆమెది మా ఊరే. పేరు శ్రీలత. వాళ్ల అమ్మానాన్నలకు ఒక్కతే కూతురు. హాస్టల్‌లో ఉండి చదువుకొంటుండేది.
మర్నాడు పొద్దున్నే వెంకట్‌ వాళ్ల ఇంటివైపు వెళ్లాడు. వాళ్ల ఇంట్లో ఒక్కతే ఉందని తెల్సింది. ఇంట్లోకి వెళ్లాడు. మాట్లాడడానికి ప్రయత్నించాడు. కానీ ఆమె మాట్లాడలేదు. బతిమిలాడాడు. భయపెట్టాడు. అయినా మాట్లాడలేదు. ఇరుగుపొరుగు ఇది చూడనే చూశారు. తెల్లారే సరికి ఆ అమ్మాయితోపాటు ఊరంతా తెల్సింది. దీనికి కారణమైన వారిని పట్టుకుని అడిగాడు వెంకట్‌. తన తప్పేం లేదు. నేనే కావాలని వెళ్లానని చెప్పాడు. అదే విషయం వెంకట్‌ని అడగాలని కోపంగా వచ్చిన శ్రీలత మౌనంగా వెనుదిరిగింది. నాదే వారి ప్రేమకు తొలిమెట్టు.
సాయంత్రం కిరాణా కొట్టు దగ్గర కూర్చున్నాడు వెంకట్‌. ఏదో కొనడానికి వచ్చిన ఆ అమ్మాయి అతనితో మాట్లాడింది. "నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను, నీ ధైర్యం నాకు నచ్చింది.'' అని చెప్పింది. ఆ రోజు వెంకట్‌ ఆనందానికి అవధులు లేవు. మా ఫ్రెండ్స్‌ అందరికీ పార్టీ ఇచ్చాడు. రోజూ సాయంత్రం అతని కోసం దుకాణానికి వచ్చేది. తను మాట్లాడే రెండు మాటల కోసం 24 గంటలు వెయిట్‌ చేసేవాడు. ఇలా రెండ్రోజులు గడిచింది. ఆమెతో చాలా మాట్లాడాలని ఆమె ఇంటికి వెళ్లాడు. తను వద్దంది. వేరే దగ్గర కలుద్దామంది. కానీ అవకాశం దొరకలేదు. ఇంతలో సెలవులు అయిపోయాయి. తను కాలేజ్‌కు వెళ్లిపోతుంది. వెంకట్‌ ఆ రోజు ఆ అమ్మాయి వాళ్ల అమ్మానాన్నలకు తెలియకుండా రైలులో వేరే భోగీలో వెళ్లాడు. వారినే ఫాలో అయ్యాడు. సాయంత్రం వాళ్ల అమ్మానాన్న హాస్టల్‌ నుండి వెళ్లిపోయారు. ఆ తర్వాత వెంకట్‌ కలిశాడు. తను షాక్‌ అయ్యింది. అతడొస్తాడని ఊహించానని చెప్పిందట. వెంకట్‌ తన ప్రేమ విషయం చెప్పాడు. తానూ ఒప్పుకుంది. ఆ తర్వాత వెంకట్‌ హైదరాబాద్‌ వెళ్లాడు. తాను తరచూ ఫోన్‌ చేస్తుండేది. వెంకట్‌ అప్పుడప్పుడు హాస్టల్‌కు వెళ్లి కలిసొచ్చేవాడు.
ఆ తర్వాత ఉగాది పండక్కి ఇద్దరూ వచ్చారు. ఆశ్చర్యం! అప్పటికే వాళ్ల విషయం ఊళ్లో అందరికీ తెల్సింది. మరుసటి రోజు వెంకట్‌తో నేను అమ్మాయి వాళ్ల వీధికి వెళ్తుంటే అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. వాళ్ల నాన్న వెంకట్‌ని ఆ వీధికి రావొద్దన్నాడు. ఎందుకు రాకూడదని వెంకట్‌ గొడవపడ్డాడు. మా ముందే శ్రీలతను కొట్టారు. పెద్ద గొడవే అయ్యింది. వెంకట్‌ కూడా గొడవకు దిగాడు. ఈ విషయం వెంకట్‌ వాళ్ల ఇంట్లో తెల్సింది. వాళ్ల నాన్న విషయం అడిగారు. పెళ్లిచేసుకుంటానని చెప్పాడు వెంకట్‌. కొట్టారు. కులం అడ్డు చెప్పారు. హైదరాబాద్‌ వెళ్లిపొమ్మన్నారు. వెంకట్‌ చనిపోవాలనుకున్నాడు. ఆ రాత్రి స్లీపింగ్‌ మాత్రలు మింగాడు. ఆస్పత్రికి తీసుకెళ్లాం. రెండ్రోజులకు తేరుకున్నాడు. తెల్లారే హైదరాబాద్‌ బస్సెక్కాడు.
మళ్లీ ఆమె జ్ఞాపకాలు, వెంకట్‌ మనసు మనసులో లేదు. రెండు రోజుల తర్వాత శ్రీలత చనిపోయింది. ఊళ్లో వాళ్లంతా వెంకట్‌ కోసం ఆత్మహత్య చేసుకుందని పుకారు. కానీ అసలు జరిగిందేంటంటే పరధ్యానంలో ఫ్యాన్‌ను ముట్టుకుంది. కరెంట్‌ షాక్‌కు గురై చనిపోయింది. వెంటనే నేను, ఫ్రెండ్స్‌ హైదరాబాద్‌ వెళ్లాం. వెంకట్‌ శ్రీ లేనిది నేను బతకలేను. చనిపోతానన్నాడు. ప్రేమే కాదు జీవితం. ప్రేమ జీవితంలో ఒక భాగం మాత్రమే. నీకు మంచి భవిష్యత్తు ఉంది దాన్ని పాడుచేసుకోకు అని సర్థిచెప్పాం.
ఆ తర్వాత వెంకట్‌ వాళ్ల నాన్న చనిపోయారు. వెంకట్‌కు ఇద్దరు అక్కలు. ఒక్కడే కొడుకు. కుటుంబానికి ఏకైక మగదిక్కు. ఇద్దరి అక్కల పెళ్లి చేశాడు. తాను పెళ్లి చేసుకోవాలని చూస్తున్నాడు. "మీరు చెప్పింది నిజం రా ఆ రోజు నేను చనిపోతే ఇప్పుడు నా కుటుంబానికి దిక్కు ఎవర్రా.'' అంటాడు వెంకట్‌. ఎంత మార్పు. కాలం మనుషులు ఎంత మారుస్తుంది.


- చంటి

Comments

Anonymous said…
నిజమే. కాలం మనలో చాలా మార్పులు తెస్తుంది.
సగం జీవితకాలం స్నేహితులమయ్యుండీ
కూడా నేనూ, నా ఫ్రెండూ ఇప్పుడు మాట్లాడుకోవట్లేదు.
ఏవో గొడవలు. మొదట్లో చాలా బాధనిపించేది.
ఇప్పుడు అప్పుడప్పుడూ గుర్తుకొస్తున్నారు. రేపింక ఎలా
ఉంటుందో.
vert good andi manchi sandesaanni ichaaru.. bagaaraasaaru keep it up :)
నిజమే.ప్రేమే కాదు జీవితం.ప్రేమ జీవితంలో ఒక భాగం మాత్రమే. కాలం ఎటువంటి గాయాన్నైనా మాన్పుతుంది .
Anonymous said…
nijamenandi kalame annitiki mandu. jeevithantam thodu untaru anukunnavaru okkasariga dooramithe prapancham antha sunyam ga kanapaduthundi. aa badha anubavinchevarike thelusthundi. ala ani madyalo vachina vari kosam manaki janmanichinavarini, thobhuttuvulni vadili chavalanukovatam swardam, neram. preminchina varu dooramayyaru ani badhapadi pranam teesukovali anukune balaheena kshanamlo kastha alochinchagaligi, yedemaina brathakali anna mondi dairyam thechukunte, jeevitham lo malli yetuvanti paristhiti yeduraina sthiramga, dairyam ga vatini yedurukuntam. idi nizam naa sontha anubavam...... nannu chusi nenu inkosari garvapadela chesina chanti gariki thanks....
Anonymous said…
I studied this story in andrajyothi, I guess. But the climax was not there.
Anonymous said…
hi

chaalaa baagundi.... prema anedi kevalam preminchina ammai key kaadu , janmanichchina parents meeda kudaa vunnadani ee story prove chesindi... preminchadam anedi ee rojullo fasion aipoindi...intlo vaallani preminchandi...vaalla santhosham kosam edainaa cheyyandi...adey prema...(my opinion)....

Popular posts from this blog

ఈ తిట్లు వింటే మీరూ తెగ నవ్వుతారు..

తిట్టడం ఒక యోగం.. తిట్టించడం ఒక భోగం.. తిట్టలేకపోవడం... ఒక రోగం. అదేంటి? జనరల్‌గా ‘నవ్వు’ గురించి కదా ఇలా చెప్తారు. ఇక్కడ నవ్వుకి.. తిట్లకి సంబంధం ఉంది. అందుకే అలా. ఏడుపొస్తే ఆపుకోవడం.. కోపమొస్తే తిట్టకపోవడం.. సెల్‌ఫోన్‌లో బ్యాలెన్స్ ఉండీ అవుట్‌గోయింగ్ చేయలేకపోవడం లాంటిది. అందుకే చీవాట్లెట్టండి. ఫన్నీగా.. తిట్ల గురించి కూడా ముచ్చట్లా? అని తిట్టుకోకండి. గూట్లో దాచిపెట్టి గూగుల్‌లో వెతికే రోజులివి. దేనికోసమో ‘యా’లో సెర్చ్ చేస్తుంటే.. What is the meaning of telugu word ne dumpa tega? (నీ దుంప తెగ అనే తెలుగు పదానికి అర్థమేంటి?) అని ఒక ప్రశ్న కనిపించింది. అడిగింది లండన్‌లో ఉండే మన తెలుగాయనే. ఇండియాకి వచ్చినప్పుడు ఆయన్ని ఎవరు తిట్టారో తెలియదు కానీ.. దానికి ఇద్దరు సమాధానాలిచ్చారు. మొదటిది ఇది తెలుగులో వ్యవహారిక పదం. కాని లిటరల్‌గా అనువదించడానికి సరైన అర్థం లేదు. దీన్ని రకరకాల సందర్భాల్లో వాడతారు. కోపంగా ఉన్నప్పుడు, ఫ్రస్టేషన్‌లో ఇలా తిడతారు. ఆశ్చర్యమేసినప్పుడు కూడా వాడతారు. దీని అర్థం నిజంగా తెలుసుకోవాలంటే.. ఈ మాట అనేవాళ్ల టోన్, ఫేసియల్ ఎక్స్‌వూపెషన్స్ చూడాల్సిం...

'ఛాయ' మిస్టరీ వీడినది

ఈ గుళ్లో ఓ మిస్టరీ దాగి ఉంది. పది శతాబ్దాల పైబడి ఎవరికీ అంతుచిక్కని రహస్యం అది. శివలింగంపై ఒక నీడ పడుతుంది. అది ఎప్పుడూ స్థిరంగానే ఉంటుంది. అది ఎక్కడి నుంచి పడుతుందో కూడా ఎవరికీ తెలియదు. గర్భగుడిలోని ఆ నిగూఢాన్ని ఇప్పుడు చేధించాడో ఫిజిక్స్‌ లెక్చరర్‌.  నల్గొండ పట్టణానికి ఆనుకుని పానగల్‌ ఉంది. ఆ ఊరి చివరన ఉదయ సముద్రం. దాని ఒడ్డున పచ్చని పొలాల మధ్య ఒక పురాతన దేవాలయం. 11వ శతాబ్దపు కుందూరు చోళుల కాలం నాటిది. దీని పేరే ఛాయా సోమేశ్వరాలయం. ఆ పేరులోనే ఉంది దాని మిస్టరీ. మనం ఉదయించే సూర్యునికి ఎదురుగా నిలబడితే మన నీడ ఎక్కడ పడుతుంది? మన వెనకవైపు పడుతుంది కదా. అదే మధ్యాహ్నం నిలబడితే నీడ ముందుకు పడుతుంది. ఈ గుళ్లోని శివలింగంపై పడే నీడ ఉదయం అయినా, మధ్యాహ్నం అయినా ఎప్పుడూ కదలదు. ఇంకో విషయం... ఆ నీడ ఒక స్తంభం నీడలా కనిపిస్తుంది. ఆ గుళ్లో ఎనిమిది స్తంభాలుంటాయి. కానీ ఆ నీడ ఏ స్తంభానిదో ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే ఒక స్తంభం నీడ అని మనం అనుకున్నామనుకోండి. దాని నీడపడినప్పుడు దాన్ని ముట్టుకుంటే మన చేయి నీడ కూడా పడాలి కదా? అలా పడదు. అయితే ఈ నీడ మరి ఎక్కడి నుంచి పడుతోంది, రోజంతా స్థిరంగా ఎలా ఉంటోంది? ఈ వి...

గూగుల్ బతుకమ్మ

‘డిన్నర్ అయ్యాక పడుకోకుండా ఫేస్‌బుక్‌తో పనేంటి?’ అంటూ వాళ్ల డాడీ లతిక దగ్గరికి వచ్చాడు. లతిక కంప్యూటర్ స్క్రీన్ మీద చూస్తూ నోట్‌బుక్‌లో ఏదో రాసుకుంటోంది. ‘ఫేస్‌బుక్ ఓపెన్ చేశావనుకున్నాను ఇదేంటి?’ అని లతిక చేతిలోంచి బుక్ తీసుకున్నాడు. Bathukamma is a spring festival celebrated by the Hindu women of Telangana region in Andhra Pradesh, India. It is also called as Boddemma. This festival falls in the months of September/October called as Ashvin or Aswiyuja. Bathukamma festival is... అని రాసి ఉంది. ‘ఏంటిది బతుకమ్మ గురించి గూగుల్‌లో వెతికి రాసుకుంటున్నావా! ఎందుకు?’ అడిగాడు డాడీ. ‘అవును డాడీ! టీచర్ హోమ్‌వర్క్ ఇచ్చింది. ‘బతుకమ్మ’ గురించి ఎస్సే రాయమన్నది. ఆ ఫ్లవర్స్‌ని గ్యాదర్ చేసి రికార్డ్ తయారు చెయ్యమన్నది’ అని చెప్పింది. ‘మీ మమ్మీని అడక్కపోయావా. ‘మమ్మీకి నాకు చెప్పేంత టైమ్ ఎక్కడిది డాడీ! అందుకే ఇలా రాసుకుంటున్న. కానీ డాడీ.. ఇదేంటో అర్థం కావడం లేదు.. ’ ‘ఏంటది?’ ‘t..a..n..g..e...d..u.. వాట్ ఈజ్ దిస్ తంగెడు డాడీ?’ ‘ఓహ్.. తంగెడు.. అంటే ఫ్లవర్స్.. ఎల్లో కలర్‌లో ఉంటాయి.. మన తె...