మరిచిపోలేని బహుమతి

By | February 03, 2009 8 comments

నేను అప్పుడు ఏడో తరగతి చదువుతున్నా. ఓ మోస్తారుగానే చదివేవాడిని. ఒక రోజు లెక్కల మాష్టారు నారాయణగారు పాఠం చెబుతున్నారు. ఒక లెక్క ఉదాహరణగా చెప్పి రెండో లెక్క మాతో చేయించేవారు ఆయన. అలా ఒకరోజు ఎవరు త్వరగా చేస్తే వాళ్లకు ఒక బహుమతి ఇస్తానన్నారు. నేను టకటకా మొదలెట్టా. నాకంటే బాగా లెక్కలు చేసేవారు మాత్రం "మాష్టారూ! ఏం గిఫ్ట్‌ ఇస్తారు? ఇప్పుడే ఇస్తారా తర్వాత ఇస్తారా?'' ఇలా ప్రశ్నలు అడుగుతున్నారు. నేను ముందుగా చేసి చూపించా. ఆయన వెంటనే తన జేబులోంచి పెన్ను తీసి నాకు బహుమతిగా ఇచ్చారు. ఆ పెన్ను కొన్ని సంవత్సరాల పాటు పోగొట్టకుండా కాపాడుకున్నా.
నేను ఇంటర్‌ చదివేప్పుడు మా క్లాసులో స్వప్న అని ఒక ఫ్రెండ్‌ ఉండేది. ఎవరిదైనా పుట్టినరోజు ఉంటే క్లాస్‌లో వాణి మేడమ్‌ సమక్షంలో ఘనంగా జరుపుకునే వారం. మా క్లాసులో చాలా తక్కువ మందే ఉండేవారు. అలా ఒకరోజు నా పుట్టినరోజు వచ్చింది. క్లాస్‌లోనే కేక్‌ కట్‌ చేయించారు. ఒకరి పుట్టిన రోజు వస్తుందంటే ఎలాగూ రెండు మూడు రోజుల నుంచి చర్చలు జరుగుతాయి. కాబట్టి అందరూ గిఫ్ట్‌లు తీసుకుని వచ్చారు. కానీ స్వప్న మాత్రం నాకు ఎలాంటి బహుమతి ఇవ్వలేదు. (అంటే బహుమతి కోసమే పుట్టిన రోజు జరుపుకున్నామని కాదు) నేనూ లైట్‌ తీస్కున్నా. కానీ కాలేజ్‌ నుంచి వెళ్లేటప్పుడు మాత్రం స్వప్న నా దగ్గరికి వచ్చి "సాయంత్రం మా ఇంటికి వస్తావా?'' అని అడిగింది. నేను ఎందుకని అడిగా. సస్పెన్స్‌ నువ్వు కలువు చెప్తా నంది. అలా సాయంత్రం వాళ్లింట్లో కలిశాం. తను నాకు పుట్టిన రోజు కానుకగా చిన్న కుందేలుని ఇచ్చింది. నేను షాక్‌. ఇలాంటి గిఫ్ట్‌లు కూడా ఇస్తారా? అని సరదాగా అడిగా. "అలా అనకు బాబూ దాని కోసం అది నాలుగు రోజుల నుంచి టౌనంతా తిరిగింది'' అని కిచెన్‌లోంచి వాళ్లమ్మగారు చెప్పారు. నేను అక్కడ ఇంకేం మాట్లాడదల్చుకోలేదు. నాకు పెంపుడు జంతువులు అంటే పెద్దగా ఇష్టం ఉండదు. అదే విషయం తర్వాత రోజు తనతో చెప్పా. అప్పుడు స్వప్న చెప్పిన మాటలకు నా మనసుని కదిలించాయి. "ఆ అందుకే ఇచ్చా. ఇది ఎంత ఆరోగ్యంగా.. ఎంత లావుగా పెరిగితే నేనంటే నీకు అంత ఇష్టం అన్నమాట'' అని చెప్పింది.

8 comments:

Raj said...

బాగుంది.

Ganesh Majji said...

వావ్..! నాకు కుందేలు అంటే చాలా ఇష్టం... చాల రుచిగా వుంటుంది ;)

నేస్తం said...

బాగుంది ..:)

Unknown said...

ఆ కుందేలు ఎలా ఉంది ఇప్పుడు ?

Ajju's said...

manasu pedite ayestalu kooda istaluga marutayannadi aa ammayi aantaryamemo...
anyway nice...

శ్రుతి said...

మరి ఆ కుందేలు ఇప్పుడెలాఉంది? నాకు తెలిసి మీరు ఈ టపా వ్రాసిన రోజు బాగా లావయ్యి ఉండాలి. నిజమేనా?

పిచ్చోడు said...

మొత్తానికి ఆ కుందేలు ఇప్పుడు ఎక్కడ, ఎలా ఉందో చెప్పు బాబూ....... :-) పొరపాటున ఆ గణ గాడు చూస్తాడేమో జాగ్రత్త. కొరుక్కొని తిన్నా తింటాడు వెధవ

Sujata M said...

మీరెవరో గానీ.. చాలా అమాయకంగా రాసారు. చాలా చాలా నచ్చింది. అమాయకత్వంలో చివర్న ఎండింగ్ లో చూపించిన గడుసుతనం (మన ఊహకు వొదిలేయడం .. ఆ కుందేలు గురించి ఆలోచించాలా ఆ పాప గురించి ఆలోచించాలా, మీ గురించి ఆలోచించాలా.. ?) చాలా స్వీట్. నాకు నచ్చిందండీ. థాంక్స్.