
నన్ను ప్రేమించేవారు, ఇష్టపడేవారు చాలా మందే ఉన్నారు. నా కోసం ఏమైనా చేయగలిగిన వారు కూడా ఉన్నారు. కానీ వారంతా ఇప్పుడు నా కోసం ఏమీ చేయలేకపోతున్నారు.
నేనిప్పుడు పిచ్చిదానిలా చదువుతున్నాను. ఇంతకముందు కూడా నాకు వీలు దొరికినప్పుడల్లా పుస్తకాలు చదివేదాన్ని. ఇప్పుడంతా నాకు వీలే. వారానికి ఒక పుస్తకం చదవడం పూర్తి చేస్తున్నాను. జీవితంలో లోతుపాతులను తెలుసుకోవాలంటే నాకు ఎప్పుడూ ఆసక్తే. ఇప్పుడు నేను విలాసంగా, ఆనందంగానే ఉన్నాను. కానీ ఏదో తెలియని బాధ.
నిజం చెప్పాలంటే క్యాన్సర్ నా హృదయాన్ని తొలచివేస్తోంది. నాకు ఎనిమిది కంటే ఎక్కువ కెమో చికిత్సలు చేయాలి. 35 రకాల రేడియేషన్ సెషన్లు. 2010 జనవరి వరకు ఇలాగే ట్రీట్‌మెంట్. అదొక ప్లాన్. నేనూ చేయగలను. కానీ ఎందుకు చేయాలి?
నా పాత జీవితం నాకు తిరిగి కావాలి. భవిష్యత్తును తలచుకొని, గతాన్ని
గుర్తుచేసుకుని నరకం అనుభవిస్తున్నాను. ఇది వసంతం. ఒక మొక్కని కూడా నాటలేని స్థితిలో నేను ఉన్నాను. గతంలో ఎన్ని మొక్కలు నాటేదాన్ని. గతంలో ఎందరో పేషెంట్లకు కౌన్సెలింగ్ ఇచ్చాను. ధైర్యం చెప్పాను. నా వరకు వచ్చేసరికి ఎందుకు ఇలా? దేవుడి దయ వల్ల నాకు నయం అయ్యి, మళ్లీ మంచి రోజులు వస్తే.. నా పిచ్చి... పేద భర్త నా పక్కనే కూర్చుని నాతో కలిసి పార్టీ చేసుకునేవాడు.
క్యాన్సర్ లేని ప్రపంచం ఉంటే బావుంటుందని నేను చాలా సార్లు అనుకునేదాన్ని. కానీ మీకందరికీ తెలుసా? క్యాన్సర్ అనే రైలు ప్రయాణంలో ఎందరు ఉన్నారో! కొందరు మధ్యలోనే దిగిపోతున్నారు. ఇంకొందరు చివరి వరకు ప్రయాణం చేస్తున్నారు. అసలు ఈ ప్రయాణం ఎందుకు? అదే లేకుంటే... నేను చాలా ఆనందంగా ఉండేదాన్ని. నిజం. ఇదంతా నా గురించేనని మీకు తెలుసా?
ప్రేమతో
ది లిటిల్ క్యాన్సర్ ఇంజిన్ మార్త
(మార్త ఫెయిర్‌బెర్న్ అమెరికాలో ఒక స్టాఫ్ నర్స్. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారి కోసం ఆమె పనిచేసేది. ఆమె నవంబర్ 2008 నుంచి బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతోంది. ఇప్పుడు క్యాన్సర్ స్టేజ్ టులో ఉంది. జనవరి 2009 నుంచి ఆమెకు న్యూ హెవెన్ హాస్పటల్‌లో చికిత్స మొదలైంది. వ్యాధిగ్రస్తులకు ఆమె చేసిన సేవలు, తాను అనుభవిస్తున్న బాధను ఆమె తరచూ రాసుకుంటుండేది. అందులోని ఓ భాగమే ఇది.)
Comments
inka chaalaa inspiring gaa undi.
నాకు నిజ జీవితంలో కాన్సర్ వ్యాధి గ్రస్థులు పరిచయమున్నారు. మొన్న 4 రోజుల క్రితం మా జిం మాష్టర్ జగన్మోహన్ కాన్సర్తో పోరాడి చనిపోయాడు. అతను ఎప్పుడు "దేముడు లేడు... ఉంటే చూపించండీ.." అంటూ సరదాగా వాదులాడే వాడు. అతనికి కాన్సర్ వచ్చిందని, మంచం మీద ఉన్నాడనీ 8 రోజుల క్రితమే నాకు తెలిసింది. నేను వెళ్లి చూసొద్దాము అనుకునే లోపలే ఇలా జరిగింది. నాకు చాలా బాధ వేసింది. అతనికి నేను చాయగల సాయం ఏమీ లేదని తెలుసు. కానీ కనీసం మానసిక ఓదార్పునిచ్చి ఉండేవాడినేమో...?