Skip to main content

లక్షల రూపాయల విలువైన బైకులు

బ్లాక్‌ మెటల్‌ రోడ్‌... చుట్టూ పర్వతాలు... పచ్చని పొలాలు.. వెనకాల గర్ల్‌ ఫ్రెండ్‌ లేదా బోయ్‌ ఫ్రెండ్‌ వెనకాల మీరు.. 120 మైళ్ల స్పీడులో దూసుకుపోతున్న బైక్‌.. ఒక్కసారి కళ్లు మూసుకుని ఊహించుకోండి. ఎలా ఉంది? "గాల్లో తేలినట్లుందే.. గుండె జారినట్లుందే...'' అన్నట్లుంది కదా ఆ సీన్‌. కానీ అసలు మజా ఆ బైక్‌తో కాదు, ఇలాంటి బైక్‌పై వెళ్తేనే ఉంటుంది. ఇలాంటి అంటే..

హార్లీ డేవిడ్‌సన్‌.. ఆ పేరులోనే చూడండి ఎంత కిక్‌ ఉందో! హెచ్‌డీ(హార్లీ డేవిడ్‌సన్‌) అమెరికాకు చెందిన మోటార్‌ బైకుల బ్రాండెడ్‌ కంపెనీ. ఈ హెవీ బైకులకు మనదేశంలోనే కాదు అన్ని దేశాల్లోనూ మస్త్‌ క్రేజ్‌ ఉంది. మొన్నటి వరకు మనదేశంలో ఎవరైనా హై ఫై గైయ్స్‌ ఈ బైక్‌ కొనాలంటే ఏ దుబాయ్‌ నుంచో, అమెరికా నుంచో తెప్పించుకునేవారు. పవన్‌ కళ్యాణ్‌ నటిస్తున్న 'లవ్‌ ఆజ్‌ కల్‌' రీమేక్‌ సినిమా కోసం ఆయన జూలైలో ఒక హెచ్‌డి బైక్‌ దుబాయ్‌ నుంచే తెప్పించుకున్నారట. కానీ అదే నెలలో మన హైదరాబాద్‌లో బంజారా హెచ్‌డి షోరూమ్‌ ప్రారంభమైంది. బెంగళూరు, ఢిల్లీలలో కూడా ఇప్పుడు మొదలయ్యాయి. హైదరాబాద్‌లో బుకింగ్స్‌ మొదలైన 60 రోజుల్లోనే 25 బైకులు అమ్ముడుపోయాయి. అందులో పెద్ద గొప్పేం ఉందంటారా? నిజమే ధర వేల రూపాయల్లో ఉంటే ఆశ్చర్యపోనక్కర్లేదు కాని లక్షల్లో ఉంటే ముక్కున వేలు వేసుకోవాల్సిందే కదా.


ఆల్‌టైమ్‌ హాట్‌
హార్లీ డేవిడ్‌సన్‌ నిన్నమొన్న వచ్చిన బైక్‌ కాదు. 107 సంవత్సరాలుగా ఆల్‌టైమ్‌ హాట్‌ ఫేవరెట్‌గా ఉంటున్న బైక్‌. దాని ఇంజిన్‌, సాంకేతిక పరిజ్ఞానం, ఆకట్టుకునే మోడల్స్‌ ఈ బైకులకు అంతటి క్రేజ్‌ని తెచ్చిపెట్టాయి. హెచ్‌డీ బైకుల ఇంజిన్‌ కెపాసిటీ ఎంతో తెలుసా? 883 సిసి నుంచి 1800 సిసి వరకు. వీటి ధర 7 లక్షల రూపాయల నుంచి 35 లక్షల వరకు ఉంటుంది. ఇప్పుడు హెచ్‌డీ బైక్స్‌లో స్పోర్ట్‌స్టర్‌, డైనా, సాఫ్టెయిల్‌, వి రాడ్‌, టోరింగ్‌, సివిఒ తదితర ఐదు స్టయిళ్లలో 12 మోడళ్లు దొరుకుతున్నాయి. బ్లాక్‌, రెడ్‌ హాట్‌ సన్‌గ్లో, క్రిమ్‌సన్‌ మిస్ట్‌ బ్లాక్‌, డార్క్‌ స్లేట్‌, ఫ్లేమ్‌ గ్రాఫిక్‌ రంగుల్లో ఈ బైకులు లభ్యమవుతున్నాయి. బంజారా హెచ్‌డీని జూనియర్‌ ఎన్టీఆర్‌ ప్రారంభించారు. స్వయంగా ఎంతో ఇష్టపడి ఒక బైక్‌ కొన్నారని చాలామంది సినిమావాళ్లు చెబుతుంటారు. అల్లు అర్జున్‌, అక్కినేని నాగచైతన్యతో పాటు హీరోయిన్‌ అనుష్క, ముమైత్‌ ఖాన్‌లు కూడా ఈ బైక్‌లు కొన్నవారి లిస్ట్‌లో ఉన్నారని ఫిల్మ్‌నగర్‌ టాక్‌. షోరూమ్‌ డిజిఎమ్‌ దైవిక్‌ భాస్కర్‌ ఎందుకో ఈ విషయంలో సైలెంట్‌ అయిపోయారు. బాలీవుడ్‌లో సంజయ్‌దత్‌, దర్శకుడు సంజయ్‌ గుప్తా, క్రికెటర్సలో ధోని దగ్గర కూడా ఈ హెచ్‌డీ బైక్‌లు ఉన్నాయట.

స్పోర్ట్‌స్టర్‌ స్టయిల్‌
స్పోర్ట్‌స్టర్‌ స్టయిల్స్‌లో ఎక్స్‌ఎల్‌ 883ఎల్‌ స్పోర్ట్‌స్టర్‌, ఎక్స్‌ఎల్‌ 1200ఎన్‌ నైట్‌స్టర్‌, ఎక్స్‌ఎల్‌ 883ఆర్‌ రోడ్‌స్టర్‌, ఎక్స్‌ఆర్‌ 1200ఎక్స్‌ పేరుతో నాలుగు మోడళ్లు దొరుకుతున్నాయి. వీటి ఫీచర్లన్నీ సుమారు ఒకే మాదిరిగా ఉంటాయి. పొడవు 2.225 నుంచి 2,250 మి. మీ ఉంటే ఎత్తు 1,155 మి.మీ. నుంచి 1,160 మి.మీ వరకు ఉన్నాయి. బరువు అన్నింటిది 260 కిలోలే. మొదటి మూడింటి ఫ్యూయల్‌ కెపాసిటి 12.5 లీటర్లు ఉంటే చివరి మోడల్‌ది మాత్రం 13.3 లీటర్లు. నాలుగు మోడళ్లూ ఎయిర్‌ కూల్డ్‌, ఎవెల్యూషన్‌ని కలిగి ఉన్నాయి. వాటి సిసి ఆ బైకు మోడల్‌ పేరులోనే ఉంది. అన్ని బైకులూ మైల్డ్‌ స్టీల్‌, ట్యూబులర్‌ ఫ్రేమ్‌లను కలిగి ఉన్నాయి. 70 ఎన్‌ఎమ్‌ నుంచి 100 ఎన్‌ఎమ్‌ పవర్‌ ఈ రేంజ్‌ బైకులలో ఉంటుంది.

డైనా, సాఫ్టెయిల్‌
డైనా సిరీస్‌లో ఎఫ్‌ఎక్స్‌డిబి స్ట్రీట్‌ బోబ్‌, ఎఫ్‌ఎక్స్‌డిసి సూపర్‌ కస్టమ్‌ మోడళ్లు, సాఫ్టెయిల్‌లో ఎఫ్‌ఎల్‌ఎస్‌టిఎఫ్‌ ఫ్యాట్‌ బోయ్‌, ఎఫ్‌ఎల్‌ఎస్‌టిసి హెరిటేజ్‌ సాఫ్టెయిల్‌ క్లాసిక్‌ మోడళ్లు ఉన్నాయి. డైనా, సాఫ్టెయిల్‌ బైకుల పొడవు సుమారు 2400 మీ.మీ. ఎత్తు 1130 నుంచి 1175 వరకు. బరువు 305 కిలోల నుంచి 400 కిలోల వరకు. డైనా మోడల్స్‌ బైకుల ఫ్యూయల్‌ కెపాసిటీ 17.3 లీటర్లు ఉంటే సాఫ్టెయిల్‌లో 19.7 లీటర్లు. అన్ని మోడల్స్‌లో ఎయిర్‌ కూల్డ్‌ ఇంజిన్‌ ఉంటుంది. డైనాలో ట్విన్‌ క్యామ్‌ 96 ఉంటే, సాఫ్టెయిల్‌లో 96బి ఉంటుంది. అన్ని బైకులు 1584 సిసిని, మైల్డ్‌ స్టీల్‌ ట్యూబులర్‌ ఫ్రేమ్‌లని కలిగి ఉంటాయి. పవర్‌ 117 ఎన్‌ఎమ్‌ల నుంచి 123 ఎన్‌ఎమ్‌లు.

కాస్ట్‌లీ బైక్స్‌
వి రాడ్‌ స్టయిల్‌లో విఆర్‌ఎస్‌సిడిఎక్స్‌ నైట్‌ రోడ్‌ స్పెషల్‌ మోడల్‌, టోరింగ్‌లో ఎఫ్‌ఎల్‌హెచ్‌ఎక్స్‌ స్ట్రీట్‌ గ్లిడ్‌, ఎఫ్‌ఎల్‌హెచ్‌ఆర్‌ రోడ్‌ కింగ్‌ పేరుతో రెండు మోడళ్లు, సివిఒలో ఎఫ్‌ఎల్‌హెచ్‌టి కూజ్‌ సివిఒ ఆల్ట్రా క్లాసిక్‌ మోడళ్లు ఉన్నాయి. ఈ బైకుల పొడవు సుమారు 2500 మి.మీ. బరువు 307 కిలోల నుంచి 430 కీలోలు. వి రాడ్‌ ఫ్యూయల్‌ కెపాసిటీ 18.9 లీటర్లు ఉంటే మిగిలిన మూడు మోడళ్లలో 22.7 లీటర్ల కెపాసిటీ ఉంటుంది. వి రాడ్‌లో లిక్విడ్‌ కూల్డ్‌ ఇంజిన్‌ ఉంటే మిగిలిన మూడు మోడళ్లలో ఎయిర్‌ కూల్డ్‌, ట్విన్‌ క్యామ్‌ ఇంజిన్‌ ఉంటుంది. అన్ని బైకులూ మైల్డ్‌ స్టీల్‌, ట్య్రూబులర్‌ ఫ్రేమ్‌లను కలిగి ఉంటాయి. 111 ఎన్‌ఎమ్‌ల నుంచి 150 ఎన్‌ఎమ్‌ల పవర్‌ ఈ బైక్‌ల సొంతం.


Comments

Rishi said…
ivaalti aandhrajyoti kadhanam kadaa idi?

Popular posts from this blog

ఈ తిట్లు వింటే మీరూ తెగ నవ్వుతారు..

తిట్టడం ఒక యోగం.. తిట్టించడం ఒక భోగం.. తిట్టలేకపోవడం... ఒక రోగం. అదేంటి? జనరల్‌గా ‘నవ్వు’ గురించి కదా ఇలా చెప్తారు. ఇక్కడ నవ్వుకి.. తిట్లకి సంబంధం ఉంది. అందుకే అలా. ఏడుపొస్తే ఆపుకోవడం.. కోపమొస్తే తిట్టకపోవడం.. సెల్‌ఫోన్‌లో బ్యాలెన్స్ ఉండీ అవుట్‌గోయింగ్ చేయలేకపోవడం లాంటిది. అందుకే చీవాట్లెట్టండి. ఫన్నీగా.. తిట్ల గురించి కూడా ముచ్చట్లా? అని తిట్టుకోకండి. గూట్లో దాచిపెట్టి గూగుల్‌లో వెతికే రోజులివి. దేనికోసమో ‘యా’లో సెర్చ్ చేస్తుంటే.. What is the meaning of telugu word ne dumpa tega? (నీ దుంప తెగ అనే తెలుగు పదానికి అర్థమేంటి?) అని ఒక ప్రశ్న కనిపించింది. అడిగింది లండన్‌లో ఉండే మన తెలుగాయనే. ఇండియాకి వచ్చినప్పుడు ఆయన్ని ఎవరు తిట్టారో తెలియదు కానీ.. దానికి ఇద్దరు సమాధానాలిచ్చారు. మొదటిది ఇది తెలుగులో వ్యవహారిక పదం. కాని లిటరల్‌గా అనువదించడానికి సరైన అర్థం లేదు. దీన్ని రకరకాల సందర్భాల్లో వాడతారు. కోపంగా ఉన్నప్పుడు, ఫ్రస్టేషన్‌లో ఇలా తిడతారు. ఆశ్చర్యమేసినప్పుడు కూడా వాడతారు. దీని అర్థం నిజంగా తెలుసుకోవాలంటే.. ఈ మాట అనేవాళ్ల టోన్, ఫేసియల్ ఎక్స్‌వూపెషన్స్ చూడాల్సిం...

'ఛాయ' మిస్టరీ వీడినది

ఈ గుళ్లో ఓ మిస్టరీ దాగి ఉంది. పది శతాబ్దాల పైబడి ఎవరికీ అంతుచిక్కని రహస్యం అది. శివలింగంపై ఒక నీడ పడుతుంది. అది ఎప్పుడూ స్థిరంగానే ఉంటుంది. అది ఎక్కడి నుంచి పడుతుందో కూడా ఎవరికీ తెలియదు. గర్భగుడిలోని ఆ నిగూఢాన్ని ఇప్పుడు చేధించాడో ఫిజిక్స్‌ లెక్చరర్‌.  నల్గొండ పట్టణానికి ఆనుకుని పానగల్‌ ఉంది. ఆ ఊరి చివరన ఉదయ సముద్రం. దాని ఒడ్డున పచ్చని పొలాల మధ్య ఒక పురాతన దేవాలయం. 11వ శతాబ్దపు కుందూరు చోళుల కాలం నాటిది. దీని పేరే ఛాయా సోమేశ్వరాలయం. ఆ పేరులోనే ఉంది దాని మిస్టరీ. మనం ఉదయించే సూర్యునికి ఎదురుగా నిలబడితే మన నీడ ఎక్కడ పడుతుంది? మన వెనకవైపు పడుతుంది కదా. అదే మధ్యాహ్నం నిలబడితే నీడ ముందుకు పడుతుంది. ఈ గుళ్లోని శివలింగంపై పడే నీడ ఉదయం అయినా, మధ్యాహ్నం అయినా ఎప్పుడూ కదలదు. ఇంకో విషయం... ఆ నీడ ఒక స్తంభం నీడలా కనిపిస్తుంది. ఆ గుళ్లో ఎనిమిది స్తంభాలుంటాయి. కానీ ఆ నీడ ఏ స్తంభానిదో ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే ఒక స్తంభం నీడ అని మనం అనుకున్నామనుకోండి. దాని నీడపడినప్పుడు దాన్ని ముట్టుకుంటే మన చేయి నీడ కూడా పడాలి కదా? అలా పడదు. అయితే ఈ నీడ మరి ఎక్కడి నుంచి పడుతోంది, రోజంతా స్థిరంగా ఎలా ఉంటోంది? ఈ వి...

గూగుల్ బతుకమ్మ

‘డిన్నర్ అయ్యాక పడుకోకుండా ఫేస్‌బుక్‌తో పనేంటి?’ అంటూ వాళ్ల డాడీ లతిక దగ్గరికి వచ్చాడు. లతిక కంప్యూటర్ స్క్రీన్ మీద చూస్తూ నోట్‌బుక్‌లో ఏదో రాసుకుంటోంది. ‘ఫేస్‌బుక్ ఓపెన్ చేశావనుకున్నాను ఇదేంటి?’ అని లతిక చేతిలోంచి బుక్ తీసుకున్నాడు. Bathukamma is a spring festival celebrated by the Hindu women of Telangana region in Andhra Pradesh, India. It is also called as Boddemma. This festival falls in the months of September/October called as Ashvin or Aswiyuja. Bathukamma festival is... అని రాసి ఉంది. ‘ఏంటిది బతుకమ్మ గురించి గూగుల్‌లో వెతికి రాసుకుంటున్నావా! ఎందుకు?’ అడిగాడు డాడీ. ‘అవును డాడీ! టీచర్ హోమ్‌వర్క్ ఇచ్చింది. ‘బతుకమ్మ’ గురించి ఎస్సే రాయమన్నది. ఆ ఫ్లవర్స్‌ని గ్యాదర్ చేసి రికార్డ్ తయారు చెయ్యమన్నది’ అని చెప్పింది. ‘మీ మమ్మీని అడక్కపోయావా. ‘మమ్మీకి నాకు చెప్పేంత టైమ్ ఎక్కడిది డాడీ! అందుకే ఇలా రాసుకుంటున్న. కానీ డాడీ.. ఇదేంటో అర్థం కావడం లేదు.. ’ ‘ఏంటది?’ ‘t..a..n..g..e...d..u.. వాట్ ఈజ్ దిస్ తంగెడు డాడీ?’ ‘ఓహ్.. తంగెడు.. అంటే ఫ్లవర్స్.. ఎల్లో కలర్‌లో ఉంటాయి.. మన తె...