Skip to main content

తాజ్‌మహల్‌ని షాజాహాన్‌ కట్టించలేదట..

నవీన కాలంలో ఏడు ప్రపంచ వింతల్లో ఒకటిగా వెలుగొందుతున్న భారతీయ ఆణిముత్యం తాజ్‌మహల్‌ వెనుక దాగిన అసలు కథ ఇది.
ప్రొఫెసర్‌ పి.యన్‌. ఓక్‌ సుప్రసిద్ధ చారిత్రక పరిశోధకుడు తాజ్‌మహల్‌ ది ట్రూ స్టోరీ అనే ఒక పుస్తకాన్ని రాశాడు. అందులో ఓక్‌ రాసిన కొన్ని నిజాలు..
1.    ప్రపంచం నమ్ముతున్నట్లు, ముంతాజ్‌ సమాధిగా పిలవబడే తాజ్‌మహల్‌ షాజహాన్‌ నిర్మించలేదు.
2.    అది ఒక పురాతన రాజప్రసాదం. అందులో ఒక శివాలయం తేజోమహాలయా ఉండేది. ఆగ్రా నగర రాజపుత్రుల ప్రార్థనా స్థలం.
3.    షాజహాన్‌, జయపూర్‌ రాజైన రాజా జయసింగ్‌ నుంచి ఈ ప్రసాదాన్ని వశపరుచుకుని, మరమ్మత్తులు చేసినట్టు ఓక్‌ గారు తన పుస్తకంలో నిరూపించాడు.
4.    బాద్‌షా నామా అనే మొగలుల రాజశాసనాలలో షాజహాన్‌ - రాజా జయసింగ్‌ నుంచీ ఆగ్రాలోని ఈ సుందర మహల్‌ని వశపరుచుకున్నట్టు, అక్కడే తన రాణిని సమాధి చేసినట్టు చెప్పబడింది. (పేజీ 403 - వాల్యూమ్‌ 1)
5.    జయపూర్‌ మాజీరాజు దగ్గర తాజ్‌మహల్‌ ప్రసాదాన్ని అప్పగించిన రహస్య పత్రాలు నేటికీ ఉన్నాయని భోగట్టా (18 డిసెంబర్‌, 1633 తేదీ గల పత్రాలు)
6.    తాజ్‌ ముఖాన్‌ లేదా తాసీమఖాన్‌ అని ఆ ప్రాంతాన్ని పిలిచేవారని, ముంతాజ్‌ మరణానికి ముందే ఆ ప్రాంతాన్ని తాజ్‌మహల్‌గా పిలిచేవారని, ఒక ఫ్రెంచి వ్యాపారవేత్త తవెర్నియర్‌ 1638 - 1643 మధ్య ఆగ్రాను సందర్శించిన తరువాత భారత యాత్ర అనే పుస్తకంలో సూచించాడు. అతను తన పుస్తకంలో ఇంకా...
- తాజ్‌మఖాన్‌ సమీపంలోనే ముంతాజ్‌ సమాధి (నిర్మించాడనీ) ఇంకా, మరో ఆరు విశాలమైన ప్రదేశాలు ఉన్నాయి. అక్కడికి అనేకమంది విదేశీయులు వస్తారు కనుక ముంతాజ్‌ సమాధిని ప్రపంచం సందర్శించి, అభినందిస్తుంది అని షాజహాన్‌ అభిప్రాయం కావచ్చు అని అంటాడు.
- మహల్‌ అనేది అరబిక్‌ పదం కాదు.. ఇది హిందు పదం.
- తాజ్‌, తేజ్‌ అన్నా కాంతి అని సంస్కృతార్థం. ఆ పరిసరాలలోని శివాలయాలను తేజో మహోలయం అని అంటారు. అరబిందో శిష్యురాలు తాజ్‌మహల్‌ వద్ద ధ్యానంలో కూర్చుంటే ఓం నమశ్శివాయ అనే మంత్ర జపం స్పష్టంగా వినిపించినట్టు వెల్లడించారు.
- తాజ్‌మహల్‌ .. జైసింగ్‌పురా, కనాటిపురా అనే రాజ్‌పుట్‌ల వాడల మధ్య ఉంది.
- తాజ్‌మహల్‌ సముదాయంలో ఎన్నో గదులు షాజహాన్‌ కాలం నుంచీ మూసివేయబడి ఉన్నాయి. వానిలోనికి సందర్శకులను అనుమతించరు. ఓక్‌గారు ఆ గదులలో శిధిలమైన శిల్పాలు ఉన్నాయని అభిప్రాయ పడుతున్నారు.
- బ్రూక్లిన్‌ కాలేజ్‌, న్యూయార్క్‌కు చెందిన ప్రొ. మార్విన్‌ మిల్స్‌ తాజ్‌మహల్‌ తలుపులు మీద జరిపిన రేడియో కార్బన్‌ పరీక్షలు తాజ్‌మహల్‌ నిర్మాణం షాజహాన్‌ కాలం కంటే దాదాపు 300 ఏల్ల ముందు నాటిదని నిరూపించాడు.
- తాజ్‌మహల్‌ ప్రపంచ వింతైన సుందర నిర్మాణం. హిందూ దేవాలయంగా వెలసి, ముస్లిం సమాధిగా మారి, అనేక నిర్మాణ శైలులతో అలరారుతున్న అద్భుత భవనం.
గమనిక : ఈ విషయంగ పి.యన్‌. ఓక్‌ దాఖలు చేసినటువంటి ప్రజాప్రయోజనాల వ్యాజ్యాన్ని (పిఐఎల్‌) 2002వ సంవత్సరంలో సుప్రిం కోర్టు తిరస్కరించింది. కొందరు చరిత్రకారులు కూడ పి.యన్‌. ఓక్‌ దృక్పథాన్ని వ్యతిరేకిస్తున్నారు. కాలమే నిజాన్ని నిర్ణయించుగాక.


Comments

ఓక్ గారు రాయని విషయం లేదు పాపమ్ ఎవరూ పట్టించుకోరు ఎందుకంటే అది ఫిక్షన్ కనుక.
Anonymous said…
విచిత్రం.... సుప్రీం కోర్టు కుడా వ్య్తతిరేకించినదానికి మీరు అదిక ప్రచారం కల్పించ దలిచారు... ఇది లేనిపోని అపొహాలు కలిగించేదేకాని వాస్తవం కాజలదు... ఇతరుల దేవాలయన్ని తన భార్య సమాధిగ మార్చటానికి ఇస్లాం అంగికరించదు, అందున భార్యను అత్యంత ప్రేమించే ఒక భర్త, ఒక ప్రేమికుడు, ఒక చక్రవర్తి అలాంటి దుస్సాహసం చేయగలడా?...అసలు ఆగ్రా వెళ్ళి మీరు తాజ్ మహల్ ని చుశారా? pulish the facts which u know ... and ignore the rumors... హైదరబాదు మక్కా మసీదు బ్లాస్ట్ తరువాత అందరూ ముస్లింలే మసీదును పేల్చేసుకున్నారనుకున్నారు.... కాని ఈరోజు కటకటాల వెనుక ఉన్నదెవరు. try to make a good india where we all can live with trust on each other... jai telangana.

Popular posts from this blog

ఈ తిట్లు వింటే మీరూ తెగ నవ్వుతారు..

తిట్టడం ఒక యోగం.. తిట్టించడం ఒక భోగం.. తిట్టలేకపోవడం... ఒక రోగం. అదేంటి? జనరల్‌గా ‘నవ్వు’ గురించి కదా ఇలా చెప్తారు. ఇక్కడ నవ్వుకి.. తిట్లకి సంబంధం ఉంది. అందుకే అలా. ఏడుపొస్తే ఆపుకోవడం.. కోపమొస్తే తిట్టకపోవడం.. సెల్‌ఫోన్‌లో బ్యాలెన్స్ ఉండీ అవుట్‌గోయింగ్ చేయలేకపోవడం లాంటిది. అందుకే చీవాట్లెట్టండి. ఫన్నీగా.. తిట్ల గురించి కూడా ముచ్చట్లా? అని తిట్టుకోకండి. గూట్లో దాచిపెట్టి గూగుల్‌లో వెతికే రోజులివి. దేనికోసమో ‘యా’లో సెర్చ్ చేస్తుంటే.. What is the meaning of telugu word ne dumpa tega? (నీ దుంప తెగ అనే తెలుగు పదానికి అర్థమేంటి?) అని ఒక ప్రశ్న కనిపించింది. అడిగింది లండన్‌లో ఉండే మన తెలుగాయనే. ఇండియాకి వచ్చినప్పుడు ఆయన్ని ఎవరు తిట్టారో తెలియదు కానీ.. దానికి ఇద్దరు సమాధానాలిచ్చారు. మొదటిది ఇది తెలుగులో వ్యవహారిక పదం. కాని లిటరల్‌గా అనువదించడానికి సరైన అర్థం లేదు. దీన్ని రకరకాల సందర్భాల్లో వాడతారు. కోపంగా ఉన్నప్పుడు, ఫ్రస్టేషన్‌లో ఇలా తిడతారు. ఆశ్చర్యమేసినప్పుడు కూడా వాడతారు. దీని అర్థం నిజంగా తెలుసుకోవాలంటే.. ఈ మాట అనేవాళ్ల టోన్, ఫేసియల్ ఎక్స్‌వూపెషన్స్ చూడాల్సిం...

'ఛాయ' మిస్టరీ వీడినది

ఈ గుళ్లో ఓ మిస్టరీ దాగి ఉంది. పది శతాబ్దాల పైబడి ఎవరికీ అంతుచిక్కని రహస్యం అది. శివలింగంపై ఒక నీడ పడుతుంది. అది ఎప్పుడూ స్థిరంగానే ఉంటుంది. అది ఎక్కడి నుంచి పడుతుందో కూడా ఎవరికీ తెలియదు. గర్భగుడిలోని ఆ నిగూఢాన్ని ఇప్పుడు చేధించాడో ఫిజిక్స్‌ లెక్చరర్‌.  నల్గొండ పట్టణానికి ఆనుకుని పానగల్‌ ఉంది. ఆ ఊరి చివరన ఉదయ సముద్రం. దాని ఒడ్డున పచ్చని పొలాల మధ్య ఒక పురాతన దేవాలయం. 11వ శతాబ్దపు కుందూరు చోళుల కాలం నాటిది. దీని పేరే ఛాయా సోమేశ్వరాలయం. ఆ పేరులోనే ఉంది దాని మిస్టరీ. మనం ఉదయించే సూర్యునికి ఎదురుగా నిలబడితే మన నీడ ఎక్కడ పడుతుంది? మన వెనకవైపు పడుతుంది కదా. అదే మధ్యాహ్నం నిలబడితే నీడ ముందుకు పడుతుంది. ఈ గుళ్లోని శివలింగంపై పడే నీడ ఉదయం అయినా, మధ్యాహ్నం అయినా ఎప్పుడూ కదలదు. ఇంకో విషయం... ఆ నీడ ఒక స్తంభం నీడలా కనిపిస్తుంది. ఆ గుళ్లో ఎనిమిది స్తంభాలుంటాయి. కానీ ఆ నీడ ఏ స్తంభానిదో ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే ఒక స్తంభం నీడ అని మనం అనుకున్నామనుకోండి. దాని నీడపడినప్పుడు దాన్ని ముట్టుకుంటే మన చేయి నీడ కూడా పడాలి కదా? అలా పడదు. అయితే ఈ నీడ మరి ఎక్కడి నుంచి పడుతోంది, రోజంతా స్థిరంగా ఎలా ఉంటోంది? ఈ వి...

సామ్రాజ్ఞి రుద్రమ (మన చరిత్ర - 1) My new column in Batukamma Sunday Magazine

దాదాపు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం.. సమాజంలో బలంగా వేళ్లూనుకుపోయిన పురుషాధిక్యతపై సవాలు విసురుతూ ఓ వీరనారి రాజ్యాధికారం చేపట్టింది. ఆడదానికి రాజ్యమా? ఆడది పరిపాలించడమా? అని అయిన వాళ్లే ఆమె ఆధిపత్యాన్ని జీర్ణించుకోలేకపోయారు. కొందరు సామంతులు, మండలాధీశులూ ఎదురు తిరిగే ప్రయత్నం చేశారు. అయినా ఆమె అదరలేదు. బెదరలేదు. అలాంటి వారి తలలు వంచి, నోళ్లు మూయించి ధీర వనితగా, శత్రు భయంకర రుద్రరూపిణిగా నిలిచిందామె. నేటి స్వేచ్ఛా మహిళకు ప్రతీకగా, స్త్రీ ఆత్మగౌరవానికి సమున్నత పతాకగా.. గెలిచి నిలిచిన.. ఆమే.. రాజగజకేసరి.. రణరంగ ఖడ్గధారిణి.. కాకతీయ మహాసామ్రాజ్యభార ధారణి.. రాణీ రుద్రమ దేవి..  కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడు అత్యంత పరాక్రమవంతుడు, రాజనీతి కోవిదుడు. ఈయనకు ఇద్దరు కూతుళ్లు. మహిళలు రాజ్యాధికారానికి అనర్హులన్న అప్పటి కాలపరిస్థితులకు భిన్నంగా కూతురు రుద్రమదేవిని కుమారునిగా పెంచాడు. అన్ని విద్యలూ నేర్పించాడు. గణపతి దేవుడు రుద్రమను రాజప్రతినిధిగా ప్రకటించినప్పుడు స్త్రీ పరిపాలనను, స్త్రీ అధికారాన్ని సహించలేని సామంతుల నుంచి, దాయాదుల నుంచి తీవ్ర ప్రతిఘటనలు ఎదురైనాయి. ఈ విపత్తులన్నింటినీ రుద్ర...