దెబ్బ తగిలితే పసుపు రాస్తే అది చట్టరీత్యా నేరమట. కురుపులు, అమ్మవారు () వస్తే వేపాకులు వాడినా కూడా బహుళ జాతి సంస్థలు మనపై నేరాలు మోపి కేసులు పెడతాయట. ఎందుకంటే వాటిని వాడే విజ్ఞానం వారే కనుగొన్నారట. దీనిని వారే పేటెంట్ చేసుకున్నారట. ఇదండీ సంగతి! గత దశాబ్దమంతా (1995 - 2005) భారతీయ స్వచ్ఛంద సంస్థలు, భారతీయ ప్రభుత్వం, మేధావి వర్గం యు.ఎస్. పేటెంట్ సంస్థలతో, బహుళజాతి సంస్థలతో విజ్ఞాన యుద్ధాలు చే శారు. చివరికి వేప, పసుపు వాడే విజ్ఞానం దాదాపు భారతదేశమంతటా ఉందని, ఆయుర్వేద గ్రంథాల నిండా వీటిని ఔషధాలుగా పేర్కొనబడినట్టు వారికి నిరూపించడానికి తలప్రాణం తోకకొచ్చింది. వేప, పసుపే కాదు నిమ్మ, జామ, ఉసిరి మొదలైన ఎన్నో మన ఆయుర్వేద ఔషధాలన్నిటికీ ఇదే పరిస్థితి. చివరకు బాసుమతి బియ్యం కూడా పేటెంట్ చేసుకొన్నారు. ఒకప్పుడు వేప, పసుపు మనం వాడుతుంటే మూఢ నమ్మకాలని మనల్ని వెక్కిరించిన పాశ్చాత్యులు వాటిలోని ఔషధీయ విలువలను నేడు తెలుసుకొని వాటిని తామే కనుగొన్నట్లు పేటెంట్ తీసుకుని ప్రచారం చేయడమే కాకుండా మనల్ని వాడకుండా నియంత్రించడం చాలా హాస్యాస్పదంగానూ, దురాగతంగాను ఉన్నది. ఇంతటి రభసలో ఉన్న ఈ వేప, పసుపుల మర్మా...