నాగార్జున సాగర్ దారి
బోటు లో ప్రయాణం
నాగార్జున కొండ పది కిలోమీటర్ల దూరం నుంచి
నాగార్జున కొండ కాస్త దగ్గరగా
కొండ దగ్గరికి వెళ్తున్న బోటు
బోటులో తోటి ప్రయాణికులు
కొండ దగ్గరికి వచేశం
నీళ్ళ మద్యలో..
కొండ మీద
మ్యుజియం
గార్డెన్
కొండ మీద పురాతన స్నానాల వాటిక
లాంగ్ షాట్
కాంటీన్లో
లంచ్ స్టేషన్
స్టేషన్ ముందు హెచ్చరిక
ఇంక్కడి నుంచే కొండ మీదికి ప్రయాణం 14 కి. మీ.
ఈ చౌరస్తా నుంచి కుడివైపు వెళ్తేనే లంచ్ స్టేషన్ వస్తుంది
కొత్త బ్రిడ్జి.. లాంగ్ షాట్
సాగర్ డ్యాం
ఈత కోసం దిగాం
బ్యాక్ టు పవిల్లియాన్
కొత్త బ్రిడ్జి మీద నుంచి డ్యాం
మా తమ్ముడు
రోడ్ సైడ్ బ్రేక్ ఫాస్ట్
సుప్రసిద్ధ బౌద్ధ దార్శనికుడు ఆచార్య నాగార్జునుడు పేర వెలసినది నాగార్జున కొండ (ఆంగ్లం: Nagarjunakonda). శాతవాహన చక్రవర్తి యజ్ఞశ్రీ శాతకర్ణి నాగార్జునుని కొరకు శ్రీపర్వతంపై మహాచైత్య విహారాలను నిర్మించాడని ఇతిహాసం తెలియజేస్తుంది. నాగార్జున సాగర్ నిర్మాణ సమయంలో బయల్పడిన క్రీ.పూ.2వ శతాబ్ధపు బౌద్ధావశేషాలను జలాశయం మధ్య కొండపై నిర్మింపబడిన నాగార్జునకొండ ప్రదర్శనశాల (ఆంగ్లం: Nagarjunakonda Museum) లో భధ్రపరిచారు. ఈ ద్వీపపు మ్యూజియం ప్రపంచంలోనే పురావస్తు ప్రదర్శనశాలలన్నిటిలోనూ అతిపెద్ద ద్వీప ప్రదర్శనశాల (Island Museum). బుద్ధునివిగా చెప్పబడుతున్న దంతావశేషం, కర్ణాభరణం ఇందులో చూడదగ్గవి.
భౌగోళికం :
నాగార్జునకొండ కృష్ణా నదికి దక్షిణ తీరాన 16.31 ఉత్తర అక్షాంశము, 79.14 తూర్పు రేఖాంశములపై ఉన్నది. ఇది గుంటూరు నుండి సుమారు 147 కి.మీ. దూరంలోను, హైదరాబాదు నుండి సుమారు 166 కి.మీ. దూరంలోను ఉన్నది. దగ్గరలోని రైలు కేంద్రము మాచర్ల సుమారు 22 కి.మీ.దూరంలో ఉన్నది.
చరిత్ర :
నాగులు, యక్షులు మొదలైన ప్రాచీనాంధ్ర జాతులు ఈ ప్రాంతంలో నివసించేవారు. ప్రాచీన శాసనాలలో ఈ ప్రాంతం పేరు శ్రీపర్వతం. ఈ లోయ శాతవాహన రాజ్యంలో ఉండేది. దీనికి దగ్గరలో సెఠగిరి ఉండేది. నాగార్జునకొండలో లభించిన వసుసేనుని శాసనం ప్రకారం అభీరసేనుని సేనాని శివసేపుడు సెఠగిరిపై అష్టభుజ స్వామి ఆలయాన్ని నిర్మించాడు. సెఠగిరి జనాదరణ పొందిన హిందూ క్షేత్రం. ఇది శాతవాహన రాజుల ఉపరాజధాని. వీరిలో చివరివాడైన యజ్ఞశ్రీ శాతకర్ణి నారార్జునాచార్యుని కొరకు శ్రీపర్వతం పైన మహాచైత్య విహారాలను నిర్మించాడు.
ఇక్ష్వాకులు ఇక్కడ శాతవాహనుల సామంతులుగా ఉండేవారు. వీరిలో వాసిష్ఠీపుత్ర శ్రీఛాంతమూలుడు నాలుగో పులోమావిపై విజయాన్ని సాధించి స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించాడు. ఈ ప్రాంతంలో "విజయపురి" అనే పేరుతో నగరాన్ని నిర్మించి తమ రాజధానిగా చేసుకున్నారు. నలుగురు ప్రముఖ ఇక్ష్వాకులలో శ్రీఛాంతమూలుడు అశ్వమేధ యాగం చేశాడు. ఇక్ష్వాకుల కాలంలో శ్రీపర్వతం - విజయపురి క్రీ.శ. 200 నుండి 300 వరకు మహోజ్వలంగా విలసిల్లింది.
ఇక్ష్వాకుల తర్వాత ఈ ప్రాంతాన్ని పల్లవులు ఏలినారు. ప్రాచీన పల్లవులలో ఆద్యుడైన సింహవర్మ తమ ప్రత్యర్ధులైన కదంబులకు సాయం చేశారనే నెపంతో ఇక్ష్వాకు వంశాన్ని తుదముట్టించి బౌద్ధక్షేత్రాలను విజయపురిని ధ్వంసంచేశాడు. కర్ణాటకలోని కదంబ వంశ స్థాపకుడైన మయూరశర్మ శ్రీపర్వతాన్ని ఆక్రమించి, స్థావరం చేసికొని బృహద్బాణులను జయించి, పల్లవులతో యుద్ధం చేశాడు. తర్వాత పల్లవులతో సంధిచేసికొని శ్రీపర్వతం వదలివెళ్ళాడు.
ఈ ప్రాంతంలో తర్వాత విష్ణు కుండినులు స్వతంత్ర రాజ్యం స్థాపించి క్రీ.శ. 370 నుండి 570 వరకు పాలించారు. వీరి కులదైవం శ్రీపర్వతస్వామి అనే బుద్ధదేవుడు. వీరు విష్ణుమూర్తి యొక్క తొమ్మిదవ అవతారంగా బుద్ధదేవున్ని ఆరాధించారు.
కొంతకాలం తర్వాత ఈ ప్రాంతము కాకతీయుల పాలనలోకి వచ్చినది. కాకతీయులలో ప్రోలరాజు కుమారుడు బేతరాజు అనుమకొండలో శివాలయాన్ని నిర్మించాడు. కాకతీయుల అనంతరం ఈ ప్రాంతం కొద్దికాలం ఢిల్లీ సుల్తానుల పాలనలో ఉన్నది.
కొండవీడు రాజధానిగా పాలించిన రెడ్డి రాజుల కాలంలో ఈ ప్రాంతం లో నాగార్జునగిరి దుర్గాన్ని నిర్మించి వారి రాజ్యానికి చెందిన సైనిక స్థావరాలలో దక్షిణ దుర్గంగా ఉంచారు. తర్వాత గజపతులు నాగార్జునకొండను వశపరచుకొని వారి ప్రతినిధిని ఉంచారు. పురుషోత్తమ గజపతి కాలంలో ఈ ప్రాంతం అతని ప్రతినిధి శ్రీనాథ రాజసింగరాయ మహాపాత్రుని ఆధీనంలో ఉన్నది. వీరు 1413లో ఇక్కడ నాగేశ్వరలింగ ప్రతిష్ఠ చేశారు.
క్రీ.శ. 1513 నుండి 1519 వరకు శ్రీకృష్ణదేవరాయల కళింగ దండయాత్ర జరిగింది. ఉదయగిరితో మొదలైన ఈ దండయాత్ర కందుకూరు, వినుకొండ, అద్దంకి, కవుతారం, తంగెడ, నాగార్జునకొండ, బెల్లంకొండ వరకు సాగింది. రాయలు గజపతుల సైనిక స్థావరాన్ని నిర్మూలించి వశం చేసుకున్నారు. నాగార్జునకొండలో అయ్యలయ్య, వీరభద్రయ్య అనే సానాధిపతులను ఉంచాడు. వీరు నాగార్జునకొండను రాజకీయ పాలనాకేంద్రంగా చేశారు. నాగార్జునకొండ పేరు మొదటిసారిగా వీరి శాసనాలలో కన్పిస్తుంది. 1565 తళ్ళికోట యుద్ధంలో విజయనగర పతనం తర్వాత ఈ దుర్గం గోల్కొండ నవాబుల ఆదీనమైనది. చివరి కుతుబ్ షాహీ ప్రభువుల శాసనాల ప్రకారం నాగార్జునకొండ దుర్గాన్ని నేటి కడప జిల్లాలోని పుష్పగిరి పీఠానికి అగ్రహారంగా ఇచ్చారు.
శాసనాలు :
నారార్జునకొండలో సుమారు 400 వరకు శాసనాలు లభించాయి. వీనిలో చాలావరకు దానధర్మాలకు సంబంధించినవి. ఇవి ప్రాకృత, సంస్కృత, తెలుగు భాషలలో ఉన్నాయి. ఈ శాసనాలను అధ్యయనం కోసం ఏడు విధాలుగా విభజించారు.
- ఆయక స్తంభ శాసనాలు
- చైత్యగృహాలలో లభించిన శాసనాలు
- పగిలిన శాసనాలు
- శిల్ప ఫలకాపైనున్న శాసనాలు
- ఛాయా స్తంభ శాసనాలు
- బ్రాహ్మణమత ఆలయ సంబంధ శాసనాలు
- ఇతర శాసనాలు
Comments