Skip to main content

వేప, పసుపు కోసం యుద్ధాలు!

దెబ్బ తగిలితే పసుపు రాస్తే అది చట్టరీత్యా నేరమట. కురుపులు, అమ్మవారు () వస్తే వేపాకులు వాడినా కూడా బహుళ జాతి సంస్థలు మనపై నేరాలు మోపి కేసులు పెడతాయట. ఎందుకంటే వాటిని వాడే విజ్ఞానం వారే కనుగొన్నారట. దీనిని వారే పేటెంట్‌ చేసుకున్నారట. ఇదండీ సంగతి! గత దశాబ్దమంతా (1995 - 2005) భారతీయ స్వచ్ఛంద సంస్థలు, భారతీయ ప్రభుత్వం, మేధావి వర్గం యు.ఎస్‌. పేటెంట్‌ సంస్థలతో, బహుళజాతి సంస్థలతో విజ్ఞాన యుద్ధాలు చే శారు. చివరికి వేప, పసుపు వాడే విజ్ఞానం దాదాపు  భారతదేశమంతటా ఉందని, ఆయుర్వేద గ్రంథాల నిండా వీటిని ఔషధాలుగా పేర్కొనబడినట్టు వారికి నిరూపించడానికి తలప్రాణం తోకకొచ్చింది. వేప, పసుపే కాదు నిమ్మ, జామ, ఉసిరి మొదలైన ఎన్నో మన ఆయుర్వేద ఔషధాలన్నిటికీ ఇదే పరిస్థితి. చివరకు బాసుమతి బియ్యం కూడా పేటెంట్‌ చేసుకొన్నారు.
ఒకప్పుడు వేప, పసుపు మనం వాడుతుంటే మూఢ నమ్మకాలని మనల్ని వెక్కిరించిన పాశ్చాత్యులు వాటిలోని ఔషధీయ విలువలను నేడు తెలుసుకొని వాటిని తామే కనుగొన్నట్లు పేటెంట్‌ తీసుకుని ప్రచారం చేయడమే కాకుండా మనల్ని వాడకుండా నియంత్రించడం చాలా హాస్యాస్పదంగానూ, దురాగతంగాను ఉన్నది. ఇంతటి రభసలో ఉన్న ఈ వేప, పసుపుల మర్మాలేమిటో మనం తెలుసుకుందాం.
వేప

గ్రామాల్లో నేటికీ ప్రతి ఇంటి ముంగిటా వేపచెట్టు నాటుకుంటారు. గొడ్లను కట్టేస్తారు. వేసవి కాలంలో వేపచెట్టు నీడనే రాత్రిళ్లు పడుకుంటారు. వేప పుల్లలతో పళ్ళు తోముకోవడం నేటికీ భారతదేశమంతా 60 శాతం పైగా ప్రజలు పాటిస్తున్న విషయమే.
వేపాకులను నూరి, ఆ పసరును వంటికి రుద్దుకొని స్నానం చేస్తారు.
వేపగింజల నుంచి నూనెలు, సబ్బులు తయారుచేయడం కూడా దాదాపుగా నాలుగైదు వందల సంవత్సరాలుగా మనకు తెలిసిన విషయమే.
వేప తైలాన్ని వంద శాతం ఫలవంతమైన గర్భ నిరోధక పూతగా స్త్రీలు వాడేవారు.
సన్యాసులు తమ కామ ప్రవృత్తులను తగ్గించుకోవడానికి కూడా ఔషధంగా వాడేవారు.
వేపనూనె దీపారాధనకు ఎంతో శ్రేష్టమైనది.
వేప కలపతో గృహోపకరణాలు (మంచాలు, కుర్చీలు, బల్లలు మొదలైనవి) తయారు చేసుకోవచ్చు.
ఉపవన వినోది అనే సంస్కృత గ్రంథంలో వేపను వ్యవసాయంలో ఎలా వాడాలో వివరించి ఉన్నారు.
వేప ఒక మంచి క్రిమిసంహారిగా పేర్కొని అది సంహరించే దాదాపు 200 కీటకాల పేర్లను కూడా తెలిపి ఉన్నారు. వేప చెట్టులోని ఏ భాగమైనా ప్రకృతి సహజ ఎరువుగా భూసారాన్ని పెంచుతుంది.
సశ్రుత, చరక సంహితలలో, వేపయొక్క ఔషధీయ విలువలను సుస్పష్టంగా పేర్కొన్నారు.
గత 50 ఏండ్లుగా ఎన్నో స్వచ్ఛంద సంస్థలు, ఆయుర్వేద నిపుణులు పరిశోధనలు చేసి వేప నుంచి ఎన్నో ఔషధాలు, సౌందర ్య ప్రయోగాలలో ఉపయోగించారు.
వేపపైన పేటెంట్‌ పోరు వివరాలు
1.    1995 ః ది యూరోపియన్‌ పేటెంట్‌ ఆఫీసు (మ్యూనిచ్‌) అమెరికా ప్రభుత్వ రంగ సంస్థ అయిన డిపార్టుమెంట్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌, డబ్ల్యు ఆర్‌ గ్రేస్‌ అనే బహుళ జాతి సంస్థకి పేటెంట్లు మంజూరు చేసింది.
2.    2000 ః ఈ పేటెంటు భారతీయుల అభ్యంతరం, కోర్టు కేసుల ద్వారా రద్దు చేయబడినది. విజ్ఞాన యుద్ధంలో ప్రముఖ పాత్ర పోషించినది వందనాశివ అనే పర్యావరణ పరిరక్షకులు.
3.    2001 ః ఈ పేటెంటు రద్దుపై బహుళజాతి సంస్థలు తిరిగి అప్పీలు చేసుకున్నాయి.
4.    2005 ః ఆ అప్పీలు కొట్టివేయబడింది. ఈ సంప్రదాయక విజ్ఞానం ఇదివరకే ఎందరో ఉపయోగించినట్లు నిర్థారణ అయింది. వేపపైన ఆ సంస్థలకి ఇచ్చిన పేటెంటు రద్దు చేయబడినది.

పసుపు
ముత్యమంత పసుపు ముఖమెంత ఛాయ అనేది భారత ముత్తయిదువుల సౌభాగ్యవరం. పసుపు కాళ్లకు, ముఖానికి రాసుకోకుండా ఏ సుమంగళి స్నానం చేసేది కాదు. అది కేవలం చర్మసౌందర్యం కోసం మాత్రమే కాక చర్మకాంతి, నునుపు, పగుళ్లు లేని పాదాలు, మొదలైన ఆరోగ్యదాయక పదార్థంగా వాడబడేది.
పసుపు కొమ్ములను దంచి, నిమ్మరసంలో మూడు రోజులు నానబెట్టి బాగా ఎండబెట్టి పొడిచేసి స్వచ్ఛమైన కుంకుమ తయారు చేస్తారు. ఆ కుంకుమనే స్త్రీలు నుదుట మాంగల్య చిహ్నంగా ధరిస్తారు. పేరంటాళ్లకు పంచుతారు.
ఇంతేకాక ప్రతి భారతీయ గగడప పసుపు కుంకుమలతతో శోభిల్లుతుంటాయి. ఇంటి ముందు మంగళకరంగా ఉండాలని పసుపు నీళ్లు చల్లుతారు.
ఈ పసుపు కొమ్ములను కలశ పూజల్లో కూడా వాడతారు. వంటలలో పసుపు వాడకం భారతీయ ఆనవాయితి, పసుపు వాడకం కేవలం రంగు కోసమే కాక ఆరోగ్యదాయకం కూడా. గొంతు బొంగురుపోయినప్పుడు, దగ్గు జబుబు తగ్గడానికి పాలల్లో పసుపు వేసిస్తారు. నీరు మరగబెట్టి పసుపు వేసి ఆవిరి పడితే ఊపిరితిత్తులో ్ల చేరిన శ్లేష్మం బయటికొచ్చేస్తుందంటారు.
పసుపును అద్దకపు రంగుగా కూడా వాడతారు. పసుపుతో తయారుచేసే ఔషధాలు ఎన్నో. అవి ఆయుర్వేద గ్రంథాల నిండా వివరించబడి ఉంది. దెబ్బ తగిలితే పసుపు రాయడంలో దాని యాంటీసెప్టిక్‌ లక్షణాలు తెలియజేస్తుంది.
హిందూలో ప్రచురించిన వ్యాసం ః (25, ఏప్రిల్‌ 2005)లో మతిమరుపు, ఉద్రేక ప్రవర్తనకు పసుపు వాడితే రోగం నయమవుతున్నదని కనుగొన్నారు. రోగనివారణిగా కూడా చెప్పారు. అంతేకాకుండా డాక్టర్‌ చింతపల్లి వి. రామ్‌ న్యూయార్క్‌లోని అమెరికన్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ సభ్యుడు, అతని సహ డాక్టర్లు పసుపుని క్యాన్సర్‌ జబ్బును నయం చేసే ఔషధంగా వాడటం కనుగొన్నారు.
ఈ పసుపుపైన మే 1995లో అమెరికా పేటెంట్‌ ఆఫీసు మిసిసిపి మెడికల్‌ సెంటర్‌కు పేటెంట్‌ మంజూరు చేసింది (5401504). దీని ప్రకారం దెబ్బ తగిలితే పసుపును పూసే విజ్ఞానం వారి సొంతమైనట్లే.
డాక్టర్‌ ఆరే మషల్‌కల్‌ అనే భారతీయ శాస్త్రజ్ఞుడు ఈ పేటెంట్‌ మంజూరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేసు వేశారు. వారు అమెరికా పేటెంట్‌ ఆఫీసుతో విజ్ఞాన యుద్దం జరిపి ఈ మధ్యకాలంలోనే అది ప్రాచీన విజ్ఞానమని నిరూపించారు. చివరికి పసుపుపై పేటెంట్‌ రద్దు అయింది.
ఇలా విజ్ఞాన యుద్ధాలతో మన శక్తి యుక్తుల్ని ధారపోసుకోవలసిందేనా? మన ప్రాచీన వైద్య గ్రంథాలలో దాదాపు 1,50,000 ఔషధ మొక్కల వివరణలు ఉన్నాయి. వీటిని పేటెంట్‌ కాకుండా కాపాడాలంటే వాటినంతా డిజిటలైజ్‌ చేయాలి. అంటే డాటా బేస్‌ తయారు చేయాలి. ఇది ఒక మహత్తర యజ్ఞం. చాలా శ్రమతో, ఖర్చుతో కూడిన పని. అయినా దీన్ని ఒక సవాలుగా తీసుకుని ఎందరో దేశభక్తులు ఉద్యుక్తులైనారు. ఒక అంచనా ప్రకారం 2000 సంవత్సరం నాటికి 5,000లకు పైగా పేటెంట్‌లు భారతీయ ఔషధాలపై ఇవ్వబడ్డాయట. మన ప్రాచీన విజ్ఞానాన్ని కాపాడుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది.



Comments

Popular posts from this blog

ఈ తిట్లు వింటే మీరూ తెగ నవ్వుతారు..

తిట్టడం ఒక యోగం.. తిట్టించడం ఒక భోగం.. తిట్టలేకపోవడం... ఒక రోగం. అదేంటి? జనరల్‌గా ‘నవ్వు’ గురించి కదా ఇలా చెప్తారు. ఇక్కడ నవ్వుకి.. తిట్లకి సంబంధం ఉంది. అందుకే అలా. ఏడుపొస్తే ఆపుకోవడం.. కోపమొస్తే తిట్టకపోవడం.. సెల్‌ఫోన్‌లో బ్యాలెన్స్ ఉండీ అవుట్‌గోయింగ్ చేయలేకపోవడం లాంటిది. అందుకే చీవాట్లెట్టండి. ఫన్నీగా.. తిట్ల గురించి కూడా ముచ్చట్లా? అని తిట్టుకోకండి. గూట్లో దాచిపెట్టి గూగుల్‌లో వెతికే రోజులివి. దేనికోసమో ‘యా’లో సెర్చ్ చేస్తుంటే.. What is the meaning of telugu word ne dumpa tega? (నీ దుంప తెగ అనే తెలుగు పదానికి అర్థమేంటి?) అని ఒక ప్రశ్న కనిపించింది. అడిగింది లండన్‌లో ఉండే మన తెలుగాయనే. ఇండియాకి వచ్చినప్పుడు ఆయన్ని ఎవరు తిట్టారో తెలియదు కానీ.. దానికి ఇద్దరు సమాధానాలిచ్చారు. మొదటిది ఇది తెలుగులో వ్యవహారిక పదం. కాని లిటరల్‌గా అనువదించడానికి సరైన అర్థం లేదు. దీన్ని రకరకాల సందర్భాల్లో వాడతారు. కోపంగా ఉన్నప్పుడు, ఫ్రస్టేషన్‌లో ఇలా తిడతారు. ఆశ్చర్యమేసినప్పుడు కూడా వాడతారు. దీని అర్థం నిజంగా తెలుసుకోవాలంటే.. ఈ మాట అనేవాళ్ల టోన్, ఫేసియల్ ఎక్స్‌వూపెషన్స్ చూడాల్సిం...

'ఛాయ' మిస్టరీ వీడినది

ఈ గుళ్లో ఓ మిస్టరీ దాగి ఉంది. పది శతాబ్దాల పైబడి ఎవరికీ అంతుచిక్కని రహస్యం అది. శివలింగంపై ఒక నీడ పడుతుంది. అది ఎప్పుడూ స్థిరంగానే ఉంటుంది. అది ఎక్కడి నుంచి పడుతుందో కూడా ఎవరికీ తెలియదు. గర్భగుడిలోని ఆ నిగూఢాన్ని ఇప్పుడు చేధించాడో ఫిజిక్స్‌ లెక్చరర్‌.  నల్గొండ పట్టణానికి ఆనుకుని పానగల్‌ ఉంది. ఆ ఊరి చివరన ఉదయ సముద్రం. దాని ఒడ్డున పచ్చని పొలాల మధ్య ఒక పురాతన దేవాలయం. 11వ శతాబ్దపు కుందూరు చోళుల కాలం నాటిది. దీని పేరే ఛాయా సోమేశ్వరాలయం. ఆ పేరులోనే ఉంది దాని మిస్టరీ. మనం ఉదయించే సూర్యునికి ఎదురుగా నిలబడితే మన నీడ ఎక్కడ పడుతుంది? మన వెనకవైపు పడుతుంది కదా. అదే మధ్యాహ్నం నిలబడితే నీడ ముందుకు పడుతుంది. ఈ గుళ్లోని శివలింగంపై పడే నీడ ఉదయం అయినా, మధ్యాహ్నం అయినా ఎప్పుడూ కదలదు. ఇంకో విషయం... ఆ నీడ ఒక స్తంభం నీడలా కనిపిస్తుంది. ఆ గుళ్లో ఎనిమిది స్తంభాలుంటాయి. కానీ ఆ నీడ ఏ స్తంభానిదో ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే ఒక స్తంభం నీడ అని మనం అనుకున్నామనుకోండి. దాని నీడపడినప్పుడు దాన్ని ముట్టుకుంటే మన చేయి నీడ కూడా పడాలి కదా? అలా పడదు. అయితే ఈ నీడ మరి ఎక్కడి నుంచి పడుతోంది, రోజంతా స్థిరంగా ఎలా ఉంటోంది? ఈ వి...

గూగుల్ బతుకమ్మ

‘డిన్నర్ అయ్యాక పడుకోకుండా ఫేస్‌బుక్‌తో పనేంటి?’ అంటూ వాళ్ల డాడీ లతిక దగ్గరికి వచ్చాడు. లతిక కంప్యూటర్ స్క్రీన్ మీద చూస్తూ నోట్‌బుక్‌లో ఏదో రాసుకుంటోంది. ‘ఫేస్‌బుక్ ఓపెన్ చేశావనుకున్నాను ఇదేంటి?’ అని లతిక చేతిలోంచి బుక్ తీసుకున్నాడు. Bathukamma is a spring festival celebrated by the Hindu women of Telangana region in Andhra Pradesh, India. It is also called as Boddemma. This festival falls in the months of September/October called as Ashvin or Aswiyuja. Bathukamma festival is... అని రాసి ఉంది. ‘ఏంటిది బతుకమ్మ గురించి గూగుల్‌లో వెతికి రాసుకుంటున్నావా! ఎందుకు?’ అడిగాడు డాడీ. ‘అవును డాడీ! టీచర్ హోమ్‌వర్క్ ఇచ్చింది. ‘బతుకమ్మ’ గురించి ఎస్సే రాయమన్నది. ఆ ఫ్లవర్స్‌ని గ్యాదర్ చేసి రికార్డ్ తయారు చెయ్యమన్నది’ అని చెప్పింది. ‘మీ మమ్మీని అడక్కపోయావా. ‘మమ్మీకి నాకు చెప్పేంత టైమ్ ఎక్కడిది డాడీ! అందుకే ఇలా రాసుకుంటున్న. కానీ డాడీ.. ఇదేంటో అర్థం కావడం లేదు.. ’ ‘ఏంటది?’ ‘t..a..n..g..e...d..u.. వాట్ ఈజ్ దిస్ తంగెడు డాడీ?’ ‘ఓహ్.. తంగెడు.. అంటే ఫ్లవర్స్.. ఎల్లో కలర్‌లో ఉంటాయి.. మన తె...