శ్రీ జావదాసు

By | November 06, 2011 Leave a Comment

z-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinemaపారే సెలయేళ్లు.. పచ్చిక బయళ్లు.. ఏటి గట్టు.. ఈత చెట్టు.. ఇవన్నీ తన మరదలుతో ‘‘ఏలే.. ఏలే.. మరదలా’’ అని పాడుకుంటూ తిరిగేవాడు చంద్రన్న. చెట్టంత కొడుకు చెట్టు పుట్టల వెంట కాలీపీలీ తిరగడం ఇష్టం లేదు వాళ్ల డాడీకి. అందుకే సిటీకి పంపిద్దామని ప్లాన్ గీసిండు. పండక్కి వచ్చిన వాళ్ల మామతోని హైదరాబాద్‌కి పంపిండు. అలా మామతో సిటీ బాటబట్టిండు చంద్రన్న. బస్సు బయలుదేరింది. పట్నం దగ్గరికొచ్చింది. దుర్గం చెరువులో చిన్న పడవ బయలుదేరింది. బ్యాగ్రౌండ్‌లో ఓ సాంగు..
ఓలెస్సా.. ఓలే ఓలెస్సా..
ఎటయ్యిందె దుర్గం చెర్వు..
ఎందుకీ కులికి పాటు గగరు పాటు
ఎవరో వస్తున్నట్టు.. ఎదురు చూస్తున్నది ఇంటర్‌నెట్టు.. నీ మీదొట్టు.. నాకు కూడా ఎడమ కన్ను అదురుతుంది నీ మీదొట్టు.. మన కంప్యూటర్ సామికి మంచి గడియ రాబోతున్నట్లు...

చంద్రన్నని ఆ మామయ్య తీసుకెళ్లి ఓ పెద్ద కంప్యూటర్ ఇన్‌స్టిట్యూట్‌లో జావా కోర్సులో చేర్పించిండు. ఆ కంపెనీలో అన్నీ కంప్యూటర్లే. అవి జనాలకు చేస్తున్న మేలును చూసి ఫ్లాటయ్యిండు చంద్రన్న.
అంతా కంప్యూటరుమయం...ఈ జగమంతా కంప్యూటరుమయం.. ’’ అని పాడుకుండు.
ఆ రాత్రి అతనికి నిద్రపట్టలేదు. కంప్యూటరు కళ్లలో మెదులుతోంది. ఆ సామికి ఓ హైటెక్ మందిరం కట్టించాలనుకుండు. ఉద్యోగంలో చేరాడు. కానీ అదే ధ్యాస. సామికి గుడి కట్టి అఖిలాండ కోటి బ్రహ్మాండ ఉద్యోగారాధన చేయాలనుకుండు. అందుకు నిధుల సేకరణ మొదపూట్టిండు.

సుభకరుడు.. సురుచిరుడు. ఈజీవర్కుడు.. భగవంతుడెవరు..గూగులోగణఘనుడు.. యాహులో ఘనాఘునుడు ఎవరు?..చిప్పూ తత్వమున చిందులేస్తూ పెరిగిన చిన్నారి చంద్రుడెవరు..ఆనందనందనుడు.. అన్ని పనుల చందనుడు కంప్యూటరుడు గాక ఇంకెవ్వడు..
సేవించరా కంప్యూటరు నామామృతం.. ఆ నామమే దాటించు ఐటీ సాగరం.. అని పాడుకుంటూ ఊరూరా తిరిగి డబ్బులు సంపాదించిండు. దాంతో మందిర నిర్మాణం మొదపూట్టిండు. దీంతో చంద్రన్న కాస్తా.. శ్రీ జావదాసు అయ్యిండు. అది నచ్చని కొందరు అదంతా కంపెనీ పైసల్తోనే కట్టిస్తుండని ఎమ్‌డీకి ఈ-మెయిల్ పంపించారు. దాంతో జావదాసుని అరెస్టు చేయించి హైటెక్ జైల్లో వేశారు. ఆధునిక శిక్షలన్నీ అమలు చేయసాగారు. పనికిరాని పిజ్జాలు.. రుచిలేని బర్గర్ల తిండి పెట్టేవారు. అవి తినలేక శ్రీజావదాసు..

ఎంతో రుచిరా.. ఎంతో.. రుచిరా
ఓ సామి.. కంప్యూటరు సామీ.. నీ నామమెంతో రుచిరా..
కాగితంపై రాతకన్నా.. కీబోర్డు టైపింగులు...
వారానికో లేఖకన్నా.. వెంటనే వెళ్లే ఫైలింగులు..
అందించిన నీ కార్యమెంతో రుచిరా.. అని పాడిండు.

నను బ్రోవమని చెప్పవే ఐటీ శిరోమణి
ననువూబోవమని చెప్పవే సీపీయు తల్లి.. అని బాధగా వేడుకుండు. అయినా ఎవరూ కరుణించలేదు.
విండోసుల తిలకా.. ఇకనైనా పలుకవే కంప్యూటరు సామి..
నను రక్షింపకున్నను రక్షకులు ఎవరింక కంప్యూటరు సామి...
ప్లాట్రాను స్క్రీను నీకు.. సొంపుగా చేయిస్తిని..
ఆ స్క్రీనుకు బట్టే పదివేల రూపాలు.. కంప్యూటరు సామి..
సీపీయు తల్లికి చేయిస్తి.. 1000 జిబీ ర్యామును...
ఆ ర్యాముకు బట్టేను మూడువేల రూపాలు.. అని కోపంగా గొంత్తెత్తిండు.

మరోవైపు అతని అనుచరులు ఆ హైటెక్ సిటీ నిర్మాణం పూర్తి చేసిండ్రు.
ఓ రోజు..
అదిగో అదిగో హైటెక్ సిటీ..
‘ఆంవూధ’జాతికది ఐటీ పురి..
ఏ మైక్రోసాఫ్టు రాయని కథగా...
సకల టెక్నాలజీ తనలో ఒదగా
శ్రీజావదాసు కలల సాకారముగా..
వెలిసెను.. హైదరాబాదున హైటెక్ సిటీ.. అని యూట్యూబ్‌లో కనిపించిన ఒక వీడియో చూసిండు ఆ కంపెనీ ఎమ్‌డీ. తను చేసిన తప్పును తెల్సుకుని శ్రీజావదాసుని రిలీజ్ చేయించిండు.

0 comments: