ఎవరికీ తెలియని సెవెంత్ సెన్స్ సంపత్ జీవితం

By | November 16, 2011 Leave a Comment

master-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinema
karate-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinemaface is the index of mind
(వ్యక్తి మొఖాన్ని చూసి మనస్తత్వం చెప్పొచ్చు)
never judge a book by its cover
(ముఖ చిత్రాన్ని చూసి పుస్తకం ఎలా ఉందో చెప్పలేం)
ఈ రెండు మాటలు ఒకదానికొకటి చాలా భిన్నమైనవి.
కానీ ఈయన విషయంలో ఈ మాటలే విభిన్నమైనవి.
ఈయన్ని చూసి వయస్సు చెప్పలేం.
ఈయన రాసిన పుస్తకాల్ని చూసి
అందులో ఏముందో చెప్పొచ్చు.
కై్వట్ కాంట్రాస్ట్. అలాంటి వ్యక్తి ములాఖత్ ఇది.


ఉపాధ్యాయుడు పాఠం చెప్పి.. పరీక్ష పెడతాడు. జీవితం పరీక్షలు పెట్టి పాఠాలు నేర్పుతుంది. అందుకే జీవితం.. ఒక పోరాటం. ఇదో నానుడి. పోరాటాలే జీవితం.. ఇది ‘నా’ నుంచి.. ఇక్కడ నా అంటే.. ఎస్. సంపత్‌కుమార్. ఆయన రాసిన మార్షల్ ఆర్ట్స్ పుస్తకం మనోగతంలో ఇలా రాసుకున్నారు.

యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారతః
ఎక్కడయితే ధర్మానికి బాధకల్గుతుందో అక్కడ యుద్ధానికి అంకురం పడుతుంది. కానీ.. ఇప్పుడు ఆత్మరక్షణ కోసం యుద్ధం చేయాలి. మనిషి మనుగడకోసం.. పోరాటం చేయాలి. ఇదిప్పుడు ఒక ఆరాటం కాదు.. అవసరం.. అలా కుస్తీతో మొదలైంది సంపత్‌కుమార్ జీవితం.

1974లో ఒకరోజు..
‘‘మరుభూమిలో మడుమల్ తాకులాడగా.. నిజాముకు ముచ్చెమటలు పట్టించిన మురిళీ కొడుకువా నీవు?’’ సంపత్‌కుమార్‌ని చూసి అన్నాడు షేక్ ఆలీ. ‘గట్టెపల్లి’ మురళీధర్ రావు.. ఎంతటి యోధుడో ఆ షేక్‌కు తెలుసు! కానీ తన తండ్రి గొప్పతనం అప్పుడు సంపత్‌కు తెలియదు. మురళీధర్ రావు.. వీరుడు. నిజామును గడగడలాడించిన ధీరుడు. కుండుమర్మ, మర్మాది, జలస్తంభన, వాయిదినీ.. లాంటి ప్రాచీన విద్యల్లో ఆరితేరినవాడు. అందుకే ఆయన శరీరం.. 48 బుల్లెట్లను తట్టుకోగలిగింది. ఆ రక్తాన్నే పంచుకుని పుట్టాడు సంపత్‌కుమార్. ‘నువ్వు బాగా చదివి డాక్టర్ కావాలి’ అన్నాడు మురళీధర్. ‘నేను మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటా’ అన్నాడు సంపత్. అది తండ్రికి నచ్చలేదు. అమ్మ లక్ష్మీ బాయి.. మాక్సిమ్ గోర్కీ నవలలో అమ్మలాంటిది. కొడుకు కోరికను కాదనలేకపోయింది.

100 ఆయుధాలు వాడగలడు..
అప్పుడు సంపత్‌కుమార్ కుటుంబం కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో ఉండేది. రోజూ ఆర్యసమాజ్‌లో వ్యాయామానికి వెళ్లేవాడు. రకరకాల ఆయుధాలు వాడడం నేర్చుకోవాలనుకున్నాడు. కర్రసాము, కత్తిసాము, బాక్సింగ్‌లో ప్రావీణ్యం సంపాదించాలనుకున్నాడు. మహారాష్ట్రకు వెళ్లి మంగల్‌కొండి దగ్గర చేరాడు. ఆయన చూడడానికి ఐదు అడుగులే ఉండేవాడు. కానీ బ్రూస్‌లీ కంటే డేంజర్. చిన్న బెత్తంతో పదిమందిని ఎదుర్కొనగల నేర్పరి. 100 ఆయుధాలు వాడడంలో నేర్పరి. కొంతకాలం ఆయన శిష్యరికం చేసి కర్రసాము, కత్తిసాము, లాఠి, చుర్రీ(బాకు), పట్టా, త్రిశూల్, తల్వార్, రణ్‌బాన్.. ఇలా నూరు ఆయుధాల విద్య నేర్చుకున్నాడు సంపత్. 1974లో చ్నైకి వెళ్లి ఆర్‌విటి మణి దగ్గర కరాటే నేర్చుకున్నాడు.

బ్లాక్ బెల్ట్ సిక్త్స్ డిగ్రీ
‘‘30 సంవత్సరాలుగా కరాటే అంటే యువకుల్లో క్రేజ్ పెరిగిపోయింది. మేము నేర్చుకునే రోజుల్లో మద్రాస్ వెళ్లి కరాటే నేర్చుకోవాల్సి వచ్చేది. దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించిన తర్వాతే క్లాస్‌లో చేర్చుకునే వాళ్లు. ఈ రోజుల్లో వీధి వీధినా కరాటే తరగతులు నిర్వహిస్తున్నారు. బ్లాక్ బెల్ట్ సాధించాలంటే.. మూడు సంవత్సరాలు ప్రాక్టీస్ చేయాలి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు’’ అని చెప్పిన సంపత్‌కుమార్ మాటలు నిజమే అనిపిస్తాయి. అప్పట్లో ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం 11 గంటల కఠోర సాధన చేసేవారు. బేసిక్స్, కటా, స్పారింగ్, బ్రేకింగ్‌లలో ప్రావీణ్యం పొందిన తర్వాతే పోటీలకు వెళ్లాలి. సంపత్‌కుమార్ బ్లాక్‌బెల్ట్ మాత్రమే కాదు.. అందులో ఆరో డాన్(2006)గా కూడా అవార్డు సాధించాడు. 12 రకాల పోటీల్లో విజేతలైతేగానీ.. ఆ డిగ్రీ లభించదు.

కరాటే మాస్టర్‌గా..
మార్షల్ ఆర్ట్స్‌లో ఎంతో ప్రావీణ్యం సంపాదించిన సంపత్‌కుమార్.. 300 షీల్డులను సంపాదించాడు. నాలుగుసార్లు కరా నేషనల్ ఛాంపియన్‌గా పది సార్లు స్టేట్ ఛాంపియన్‌గా నిలిచాడు. ఈ ప్రస్థానంలో సికింవూదాబాద్‌లోని ఓకినోవా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ మాస్టర్ ఎస్. శ్రీనివాసన్ ప్రోత్సాహం మరవలేనిది అంటారాయన. శ్రీనివాసన్ సెవెన్ పిల్లర్స్ ఆఫ్ కరా చెప్పిన వారిలో సంపత్‌కుమార్ కూడా ఉన్నారు. ‘ఇక చాలు ఆపేయ్’ అన్నారు పెద్దలు. అలా 1979లో పీఈటీగా మారాడు సంపత్. జమ్మికుంట నుంచి కరీంనగర్ దాకా పది ఊర్ల ప్రస్థానంలో.. 30 ఏళ్ల అనుభవం ఉంది. పదివేల మందికి శిక్షణ ఇచ్చాడు. మూడు వందల మందిని బ్లాక్ బెల్ట్ హోల్డర్స్‌గా తీర్చిదిద్దాడు. పోయిన ఏడాదే రిటైర్‌మెంట్ తీసుకున్నారు. ఆయన్ని చూస్తే అలా అన్పించదు. ‘‘రిటైర్‌మెంట్ వృత్తికి మాత్రమే. ప్రవృత్తికి కాదు’’ అంటారాయన. దటీజ్ సంపత్‌కుమార్.

రచనలే ప్రవృత్తి
ఉపాధ్యాయునిగా పనిచేస్తూనే ఎన్నో టోర్నమెంట్స్ నిర్వహించారు సంపత్‌కుమార్. దాదాపు 250 పోటీలకు రెఫరీ జడ్జీగా, చీఫ్ అఫీషియల్‌గా వ్యహరించారు. రెండు అంతర్జాతీయ కరాటే టోర్నమెంట్స్‌లో కూడా పాల్గొన్నారు. 2006లో ప్రతిష్టాత్మక షిహాన్ (డాక్టర్) అవార్డుని, 2008లో బెస్ట్ టీచర్ అవార్డుని సాధించాడు. ఇంతటి అనుభవం.. జ్ఞానం వేస్ట్ కాకూడదు. ‘నాపూడ్జ్ హిడెన్ ఈజ్ నాలెడ్జ్ వేస్టెడ్’ అంటారు.. అందుకే సంపత్‌కుమార్ ఆ అనుభవాన్నంతా అక్షరాల్లో పెట్టాలనుకున్నారు. రచయితగా మారి ‘కరాటే నేర్చుకుందాం’, ‘మార్షల్ ఆర్ట్స్’.. లాంటి పుస్తకాలు రాశారు. ‘‘వృత్తిరీత్యా వ్యాయామ ఉపాధ్యాయునిగా పనిచేస్తూ మెళకువల్ని ఎలా నేర్పాలో నేర్చుకున్నాను. మారుతున్న పరిస్థితులను, మనస్తత్వాలను గమనిస్తూ వాటికి అనుగుణంగా శోధన చేస్తున్నాను. నేను నిరంతరం విద్యార్థినే’’ అంటారు సంపత్.

యోగాచార్యగా..
sampath-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinemaసంపత్‌కుమార్‌ని డాక్టర్‌గా చూడాలనుకున్నారు ఆయన తండ్రి. కానీ సంపత్ మార్షల్ ఆర్ట్స్‌లో డాక్టర్(షిహాన్) అయ్యారు. తండ్రి కోరిక తీర్చలేదన్న బాధ ఉంది. రోగం వచ్చాక చికిత్స చేయడం కంటే.. రోగం రాకుండా జాగ్రత్త పడడం బెటర్ కదా.. అనుకున్నారు. ఇక ఆలోచించకుండా యోగ మీద పరిశోధనలు మొదలుపెట్టారు. హిమాలయాలకు వెళ్లి యోగాచార్యులను కలిశారు. దేశవిదేశాల్లో సెమినార్లకు హాజరయ్యారు. యోగకి, వ్యాయామానికి వ్యత్యాసాన్ని చెబుతూ ఇప్పటి వరకు 20 పుస్తకాలు రాశారు. ఇంకా రాస్తూనే ఉన్నారు. మనం గట్టిగా ఊపిరి పీల్చమంటే.. ఛాతి ముందుకు వచ్చేలా పీలుస్తాం. కానీ అది కాదు.. శ్వాస కడుపులోంచి రావాలి.. అంటే.. ఏ పనినైనా పూర్తి నైపుణ్యంతో చేయటమే యోగా. అంటే సరిగా పీల్చటం కూడా యోగానే. అలా అయితే ప్రతి ఒక్కరూ యోగ శిక్షణ పొందాల్సిందే’ అంటారాయన. ఇప్పుడు యోగ ఎన్‌సైక్లోపిడియా రాసే పనిలో ఉన్నారు. ప్రాచీన యుద్ధవిద్యలన్నిటినీ గ్రంథస్థం చేయడంలో బిజీగా ఉన్నారు. కరాటే ప్రతిజ్ఞ (జపాన్) : మేము మా హృదయాలను, శరీరాలను ఒక నిశ్చలమైన ఆత్మతో సాధన చేస్తాము. మా జీవితం క్రమశిక్షణతో మలచబడింది. కరాటే బాటలో జీవిత పరిపూర్ణత కోసం వెతుకుతాము. సంపత్ కుమా ఇంకా వెతుకుతూనే ఉన్నారు.
ఓస్ (నమస్తే)

బీరెడ్డి నగేష్‌రెడ్డి
ఫోటోలు : అవురునేని బాలకిషన్ రావు
(కరీంనగర్)

0 comments: