పాస్టెన్స్ కంటే ఫ్యూచర్ టెన్స్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది కదా. అందుకే ఈ ఫ్యూచర్ సెన్స్

By | November 28, 2011 Leave a Comment
ఇది స్టీవ్ జాబ్స్ కాలం...
ఐడియా జీవితాన్నే మార్చివేయొచ్చు...
టెక్నాలజీ ట్రెండ్ క్రియేట్ చేయొచ్చు.
అలాంటి వాటి గురించి కాదు..
ట్రెండ్ క్రియేట్ చేయబోతున్న వాటి గురించి తెలుసుకుందాం.
ఎందుకంటే పాస్టెన్స్ కంటే ఫ్యూచర్ టెన్స్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది కదా. అందుకే ఈ ఫ్యూచర్ సెన్స్.



లైట్ ఫీల్డ్ కెమెరా
zindhagi talangana patrika telangana culture telangana politics telangana cinemaపొడవు : 11.2 సెంటీమీటర్లు
సెన్స్ : నాలుగు మూలలున్న ఈ లిట్రో కెమెరా లైట్ ఫీల్డ్‌ని క్యాప్చర్ చేస్తుంది. దీనికున్న సెన్సార్లు ఫోటో తీస్తున్న ప్రదేశంలోని కాంతి క్షేత్రాన్ని గ్రహిస్తాయి. అంటే.. కాంతి కిరణాల రంగుని, మెరుపులను.. ఇంటెన్సిటీని యథాతధంగా వెక్టార్ డైరెక్షన్‌లో అందిస్తాయి. ప్రతి పిక్ ఆవుటాఫ్ ఫోకస్‌లో వస్తాయన్నమాట. ఈ ఫొటోల్ని రీఫోకస్ చేయాల్సిన అవసరం ఉండదు.

లి-ఫై
పొడవు : 10 సెంటీమీటర్లు

సెన్స్ : ప్రపంచం మొత్తం వాడుతున్న 5 బిలియన్ల మొబైల్‌ఫోన్లు ప్రతినెలా 6 పెటాబైట్ల డెటాని పంపిణీ చేస్తున్నాయి. అంటే 6 పక్కన 17 సున్నాల బైట్లు అన్నమాట. ఇప్పుడు వాడుతున్న వై-ఫై (రేడియో తరంగాల వైర్‌పూస్ కనెక్షన్)కి ఫ్యూచర్ టెన్స్‌గా లి-ఫై వస్తోంది. ఎడెన్‌బర్గ్ యూనివర్సిటీ ఇన్వెంటర్ హరాల్డ్ హాస్ లైట్ ఇంటెన్సిటీ ఆధారంగా రేడియోతరంగాల ప్రసారాన్ని కనిపెట్టాడు.

ఈ - సెన్స్
పొడవు : 10 సెంటీమీటర్లు
సెన్స్ : టచ్ స్క్రీన్ ఫోన్లు మీకు తెలుసు. ఫ్లాట్‌గా ఉన్న స్క్రీన్ మీద టచ్ చేస్తాం. కానీ నిజంగా బొమ్మని టచ్‌చేసిన ఫీలింగ్ అందులో కలగదు. ఆ ఫీల్‌ని అందించేందుకే ఈ విర్చువల్ టెక్చర్స్ డెవలప్ చేస్తున్నారు. ఇమేజ్ అంటే ఫిక్సెల్ ఉంటాయి. వాటిని టిక్సెల్స్‌గా మార్చి ఎలక్షిక్టికల్ ఫీల్డ్స్‌తో వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తున్నారు. నీటిని ముట్టుకుంటే తడిని, క్లాత్‌ని ముట్టుకుంటే మెత్తని ఫీలింగ్‌ని కలిగిస్తాయన్నమాట.

స్విచ్60 బల్బులు
పొడవు : 11.2 సెంటీమీటర్లు
సెన్స్ : 2014 కల్లా అమెరికాలో ఇప్పుడున్న సంప్రదాయ బల్బులు అంతరించిపోనున్నాయి. వేడెక్కే ఆ బల్బులకు వారు గుడ్‌బై చెప్పనున్నారు. ఎందుకంటే అక్కడ స్విచ్ 60 బల్బులు పాపులర్ అవుతున్నాయి. ఫిలమెంట్‌కు బదులు ఎల్‌ఇడిలు ఉండే ఈ బల్బులు ప్రకాశవంతంగా ఉండడమే కాకుండా ఎక్కువ విద్యుత్‌ని ఆదా చేస్తాయి. 60 వాట్‌ల ఈ బల్బులు కేవలం 12.5 వాట్‌ల విద్యుత్‌నే వినియోగిస్తాయి. 20 ఏళ్ల పాటు పాడవ్వకుండా ఉంటాయి కూడా.

డిజిటల్ అసిస్టెంట్ సిరి
పొడవు : 11.4 సెంటీమీటర్లు
సెన్స్ : లేటెస్ట్ యాపిల్ ఐఫోన్ 4ఎస్‌లో ‘సిరి’ ఒక ఫీచర్. మీకు ఇంటలిజెంట్ పర్సనల్ అసిస్టెంట్‌గా పనిచేస్తుంది. మీ దినచర్యలో మరిచిపోయేవాటిని ఇది గుర్తుచేస్తూ ఉంటుంది. గుర్తుచేయాల్సినవి సెట్ చేసుకోవచ్చు కూడా. మీ వాయిస్‌ని గుర్తుపట్టి.. మీకు చెప్పాల్సినవి.. గుర్తు చేయాల్సినవి.. గుర్తు పెట్టుకుంటుంది. దటీజ్ సిరి.

పర్‌ఫెక్ట్ రేజర్
పొడవు : 14.3 సెంటీమీటర్లు
సెన్స్ : ఇరీడియం హ్యాండిల్, ప్లాటినం స్క్రూలు, షార్ఫ్ బ్లేడ్‌లు కలిస్తే పర్‌ఫెక్ట్ రేజర్. మనిషి జుట్టుకంటే 5 వేల రెట్లు పలుచగా ఉండే బ్లేడ్‌ల వల్ల క్లీన్‌గా షేవ్ చేసుకోవచ్చు. ఈ బ్లేడ్‌లు 20 ఏళ్ల పాటు అంతే షార్ప్‌గా ఉంటాయి. అంటే వాడిపడేయాల్సిన అవసరం ఉండదన్నమాట. దీని ధర మాత్రం లక్ష డాలర్లు ఉంటుందట.

పాల దుస్తులు
పొడవు : 60 సెంటీమీటర్లు ణొంత్ ఆఫ్ ఏ షర్ట్)
సెన్స్ : 28 ఏళ్ల జర్మన్ బయాలజిస్ట్, ఫ్యాషన్ జైనర్ ఆంక్ డొమాస్కే సోర్ మిల్క్(పాలతో పాటు ఇతర ద్రావకాల మిశ్రమం)తో దుస్తులని రూపొందించింది. సిల్క్‌లా ఉండే ఈ క్యూమిల్క్ దుస్తులు ఎలాంటి రసాయనాలు వాడకుండా ఎకోవూఫెండ్లీగా తయారుచేశారు. ఆరు లీటర్ల పాలతో ఒక చొక్కాకి సరిపడ దారాన్ని తీయొచ్చు.

హ్యాండ్‌ఫ్రీ పెన్
పొడవు : 15.4 సెంటీమీటర్లు
సెన్స్ : ఒక బొమ్మ వేయాలని మీ మనసులో అనుకున్నారనుకోండి. మీరు చేయిపెట్టకుండానే ఈ పెన్ బొమ్మ గీసేస్తుంది. ఆల్ట్రాసోనిక్, ఇన్‌వూఫార్డ్ టెక్నాలజీతో రూపొందించిన ఈ పెన్‌ని యుఎస్‌బీతో కంప్యూటర్‌కి కనెక్ట్ చేసుకోవచ్చు. అంటే కంప్యూటర్ జనరేటెడ్ ఇమేజ్‌లని క్రియేట్ చేస్తుందన్నమాట. ఇక బొమ్మలు వేయాలంటే ప్రొఫెషనల్ కానక్కరలేదన్నమాట.

నిఘా పక్షి
పొడవు : 16.5 సెంటీమీటర్లు (క్కలతో కలిపి)
సెన్స్ : ఇది నిజం పక్షి కాదు. నిఘా పక్షి. కాలిఫోర్నియాకు చెందిన ఇంజనీర్లు దీన్ని తయారుచేశారు. హమ్మింగ్ బర్డ్‌లా అరుస్తూ గంటలకు 17.7 కిలోమీటర్ల ఎత్తుకు ఎగరగలదు. అటు ఇటూ తిరుగుతూ పైకీ కిందికి కదలగలదు. రిమోట్ కంట్రోల్‌తో పనిచేసే ఈ బర్డ్‌కి పవర్‌పుల్ సై్ప కెమెరా ఉంటుంది. మనిషి వెళ్లలేని ప్రదేశాలకి వెళ్లి ఇది నిఘా పెట్టగలదు. వీడియోలు తీయగలదు. జాగ్రత్త మరి.

మైండ్ రీడర్
పొడవు : 16.7 సెంటీమీటర్లు
(మనిషి మెదడు పరిమాణం)
సెన్స్ : ఇది చదువుతూ మీరేం ఆలోచిస్తున్నారో చెప్పనా? ఇప్పుడు చెప్పలేక పోవచ్చు. కానీ భవిష్యత్తులో ఐ కెన్. ఎఫ్‌ఎంఆర్‌ఐ స్కాన్‌తో మీరేం కలగన్నారో చెప్పొచ్చు. హాలీవుడ్ సినిమా స్టోరీ కాదిది. హారబుల్ ఫ్యాక్ట్. క్వాంటి మేడలింగ్‌తో రూపొందిస్తున్న సాఫ్ట్‌వేర్‌తో ఇది త్వరలో సాధ్యం కాబోతోంది.

సోలార్ రోల్స్
పొడవు : 34.4 సెంటీమీటర్లు
సెన్స్ : సోలార్ ఎనర్జీ విస్తృతమైనది. దీని వినియోగించుకోవాలంటే చాలా ప్యానల్స్ కావాలి. ప్రత్యేకమైన స్థలం కూడా ఉండాలి. ఇది గతం. కానీ ఇకపై ఆ సమస్య ఉండదు. ఎందుకంటే ఎసెంట్ సోలార్ కంపెనీ సోలార్ రోల్స్‌ని తయారుచేస్తోంది. వీటిని ఇంటికిపైకప్పుగానే కాదు.. కిటికీలకు కర్టెన్లుగా కూడా వాడుకోవచ్చు. అంటే సౌరశక్తి ఇక మీ ఇంట్లోనే అన్నమాట.

మ్యాజిక్ మిర్రర్
పొడవు : 76 సెంటీమీటర్లు
సెన్స్ : మీతో మీరు ఎప్పుడైనా మాట్లాడుకున్నారా? బహుశా అద్దంలో చూసి మాట్లాడి ఉంటారు. కానీ మీ ప్రతిబింబం స్పందించిందా? లేదు కదా. కానీ న్యూయార్క్ టైమ్స్ ఆర్ అండ్ డీ ల్యాబ్ ఒక అద్దాన్ని తయారుచేసింది. దానితో మీరు మాట్లాడొచ్చు. అది కూడా మీతో మాట్లాడుతుంది. మైక్రోసాఫ్ట్ కనెక్ట్ మోషన్ టెక్నాలజీతో పనిచేసే ఆ అద్దం మీ గురించి, మీ డైలీ షెడ్యూల్ గురించి.. చెప్తుంది. వార్తలు, వాతావరణంలో మార్పులు కూడా తెలియజేస్తుంది.

కృత్రిమ ఆకు
పొడవు : 2 సెంటీమీటర్లు
సెన్స్ : ఒక గంట భూమి ఉపరితలాన్ని తాకే సౌరశక్తితో సంవత్సరానికి సరిపడా పవర్‌ని జనరేట్ చేయొచ్చు. దానిలో రోజుకొంత దాచుకున్నా భవిష్యత్తు తరాలు విద్యుత్ కొరతలేకుండా జీవించొచ్చు. ప్రకృతి దీన్ని ఎడాప్ట్ చేసుకుంది. చెట్లలో సంయోజన క్రియ ఇందుకు ఉదాహరణ. దీన్ని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుని ఎంఐటీ ప్రొఫెసర్ డేనియల్ నొసేరా ఒక కృత్రిమ ఆకుని సృష్టించాడు. ఇది సూర్యకాంతిని రసాయన ఇంధనంగా మారుస్తుంది. నీటిని హైడ్రోజన్, ఆక్సిజన్‌గా విడదీసి సూర్యకాంతిని కలుపుకుని ఇంధన శక్తిని విడుదలచేస్తుంది.

0 comments: