Skip to main content

అతడు గెలిచాడు.. విధి మీద విజయం సాధించాడు..

ఒక జన్మ..
రెండు జీవితాలు...
ఫస్ట్ హాఫ్ ఆర్డినరీ..
సెకండాఫ్ అడ్వెంచర్...
మొదటిది అందరిలాంటిదే... రెండోది ఎవరికీ అందనిది..
అతడు గెలిచాడు..
విధి మీద విజయం సాధించాడు..
అతనిది వీల్‌చెయిర్ కాదు..
విల్ పవరున్న చెయిర్.
అందుకే ఈ ములాఖత్.

టెన్నిస్‌కి క్రేజ్‌ఎక్కువ. అది గ్లామర్‌తో మిక్స్ అయిన ఆట. అందుకే మన సానియా మీర్జా టెన్నిస్ సెన్సెషన్ అయింది. ప్రస్తుతం ఆమె ర్యాంకు 87. కెరీర్‌లో ఆమె హైహెస్ట్ ర్యాంక్ 27. కానీ ఈ వీల్‌చెయిర్‌లో కూర్చున్న వ్యక్తి ర్యాంకు ఎంతో తెలుసా? 21. టెన్నిస్‌లో కాదు. బ్యాడ్మింటన్‌లో. ఆ రెండూ ఒకటి కాదు. దేని ప్రత్యేకత, పాపులారిటీ.. దానిదే. ఇక్కడ కంపారిజన్ ఆటలు, ర్యాంకుల గురించి కాదు. ఈయనకున్న డిఫంట్ ‘ఎబిలిటీ’ని ఎలివేట్ చేయడం గురించే. ఒకటి కన్నా రెండు పెద్దది.. కానీ ర్యాంకుల్లో రెండుకన్నా ఒకటి పెద్దది. ఇది నిజం. అలాంటి జీవితమే ఈ వన్నెల అంజన రెడ్డిది. కరీంనగర్ జిల్లాలో రాజారాంపల్లి ఒక చిన్న ఊరు. కాలువ పక్కన సాధారణ ఇల్లు.. ఒక పెట్రోల్ బంక్.. రైస్ మిల్.. ఇవన్నీ ఉన్నా ఆయనిది సింపుల్ లైఫ్. ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్ ఇలా ఉన్నాడంటే నమ్మాలనిపించలేదు.
100 పర్సెంట్ ఎబిలిటీ
విధి విజయగర్వంతో విర్రవిగీన క్షణాలను అంజన రెడ్డి చూశాడు. అప్పుడాయనకు 27 ఏళ్లు. పెళ్లయింది. ఇద్దరు పిల్లలు. జీవితం హాయిగా సాగిపోతోంది. మూడేళ్ల క్రితం చిన్నవ్యాపారం మొదపూట్టాడు. భవన నిర్మాణానికి కంకర, ఇసుక సరఫరా చేసే వ్యాపారమది. మెల్లగా పుంజుకుంటోంది బిజినెస్. అది చూసి విధికి ఈర్ష్య పుట్టిందేమో!

1987లో ఒక రోజు... కంకర తెచ్చేందుకు లారీలో వెళ్తున్నాడు అంజనడ్డి. ఉదయం 4 గంటల 30 నిమిషాలు.. షాద్‌నగర్ దగ్గర ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టింది. అంజనడ్డికి బలమైన దెబ్బతగిలింది. కళ్లు తెరిచి చూస్తే ఆస్పవూతిలో ఉన్నాడు. కాళ్లు రెండూ ఇక పనిచేయవని చెప్పారు డాక్టర్లు. సై్పరల్ ఇంజురీ. ఈ విషయం చెబుతున్నప్పుడు ‘‘దీన్ని పారాప్లెజిక్ అంటారు. 100 పర్సెంట్ డిసేబిలిటి అన్నమాట’’ అని ఇంగ్లీష్‌లో పారాప్లెజిక్ స్పెల్లింగ్ కూడా చెప్పారు. ప్రతివిషయంలోనూ అంత క్లారిటీగా ఉంటారాయన. ఒంట్లోకి ఒక కృత్రిమ అవయవం(వీల్ చెయిర్) వచ్చి చేరిందన్న బాధ ఆయన మాటల్లో ఎక్కడా వినిపించదు. దేనికైనా నేను 100 పర్సెంట్ ఏబుల్... అనుకున్నాడు. దటీజ్ విల్ పవర్.

పాజిటివ్ గేర్
యాక్సిడెంట్ అయిన తర్వాత ఒక సంవత్సరం మద్రాసులోని వెల్లూరు సిఎంసి ఆస్పవూతిలో చికిత్స తీసుకున్నాడు అంజనడ్డి. దాంతో వ్యాపారం ఆగిపోయింది. కుటుంబానికి పెద్ద దిక్కు.. కుర్చీన పడ్డాడు. కష్టాలు... కన్నీళ్లు కామన్. అలాంటి సమయంలో ‘ఇప్పటి వరకు ఒక జీవితాన్ని చూశాను. ఇకపై ఇంకో జీవితాన్ని చూడాల్సి ఉంది’ అనుకున్నాడే కానీ ఏ మాత్రం కుంగిపోలేదు. జీవితంలో సర్వస్వం కోల్పోయినా ఒకటి మాత్రం మిగిలే ఉంటుంది.. అదే భవిష్యత్తు. తల్లి శాంతమ్మ నడక నేర్పింది. తండ్రి మల్లాడ్డి బతకడం నేర్పాడు. ఇది చాలు. తాను కోల్పోయింది ఒంట్లో సగాన్నే. నడవడం రాకపోతేనేం? బతకడం తెలుసు. దీన్నే నమ్మాడు. గెలవడం నేర్చుకున్నాడు.

పాస్టెన్స్
అంజనడ్డి వర్తమానం తెలుసుకోవాలంటే.. గతంలో ఆయన గురించిన వాస్తవాలు తెలుసుకోవాలి. అంజనడ్డి 1982లో బిఎస్సీ ఎలక్షిక్టానిక్స్ చదివాడు. మంచి స్పోర్ట్స్ మాన్. 81లో స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్‌గా కూడా పనిచేశాడు. డిగ్రీ పూర్తయ్యాక అరుణని పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు పిల్లలు రాజశేఖర్, అనూష. 1984లో చిన్న బిజినెస్ మొదపూట్టాడు. ఏడుగురికి ఉపాధి కల్పించాడు. ఆ సమయంలోనే యాక్సిడెంట్ అయింది. సంవత్సరం తర్వాత అతనికి ప్రత్యామ్నాయం ఏమీ కనిపించలేదు. బిజినెస్‌నే కొనసాగించాలనుకున్నాడు. ఇంటికి దగ్గరలోనే ఆఫీస్ తీసుకుని వీల్‌చెయిల్‌లో వెళ్లివచ్చేవాడు. మెల్లగా బిజినెస్ పెరిగింది. ఆ తర్వాత నలుగురు పార్ట్‌నర్స్‌తో రైస్ మిల్‌ని ప్రారంభించాడు.

సెకండ్ ఇన్నింగ్స్..
ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి కదా. బ్యాడ్మింటన్ పట్ల అంజన రెడ్డికి ఉన్న ఆసక్తి సెకండ్ ఇన్నింగ్స్ వైపు మళ్లించింది. 2002లో స్పోర్ట్స్ కెరీర్‌ని తిరిగి ప్రారంభించాడు. బెంగళూరు, కౌలాలంపూర్, జెరూసలేమ్, థైవాన్‌లలో జరిగిన ఎనిమిది అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్నాడు. ఒక బంగారు పతకం, ఒక వెండి పతకం, మూడు కాంస్య పతకాలు సాధించాడు. 2004లో ఏషియన్ మొదటి పారాలంపిక్ బ్యాడ్మింటన్ పోటీ, 2005లో వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్, ఐబిఎడి వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లలో పాల్గొన్నాడు. 2003-04లలో వరుసగా ఆంధ్రవూపదేశ్ ప్రభుత్వం బెస్ట్ స్పోర్ట్స్‌మాన్ విత్ డిఫంట్లీ ఏబుల్డ్‌గా గుర్తించింది.

పట్టింది బంగారం..
తాను పట్టింది బంగారం.. అన్నట్లు అంజనడ్డి ఏ పనిచేసిన సక్సెస్ అయ్యేందుకు ప్రయత్నిస్తారు. 2005లో బిపిసిఎల్ రిటైల్ అవుట్‌పూట్ డిఫంట్లీ ఎబుల్డ్ కోటాలో పెట్రోల్ బంక్‌ని ప్రారంభించాడు. నెలకు 50 వేల లీటర్ల ఇంధనాన్ని అమ్మాలని కంపెనీ రూల్. వెల్గటూర్ మండలంలోని చిన్న ఊర్లో అది సాధ్యమా అన్నది వాళ్ల డౌట్. కానీ అంజన రెడ్డి నెలకు రెండున్నర లక్షల లీటర్ల ఇంధనాన్ని అమ్మి 2010లో సిఎమ్‌డి అశోక్ సిన్హా చేతుల మీదుగా ముంబాయిలో అవార్డు అందుకున్నాడు. ఇది నిజంగా విజయమే. ఇదే కాదు తనకున్న భూమిలో లక్షా 50 వేల సు0బాబుల్ చెట్లు నాటి ప్రతిష్టాత్మక ఫాప్సీ అవార్డును కూడా అందుకున్నాడు.

ఎన్‌పీడీవోతో కలిసి..
చేపని పట్టి దానం చెయ్యడం కంటే.. చేపలు పట్టడం నేర్పిస్తే నలుగురు బతుకుతారు కదా. తాను ఉన్నతంగా బతకడమే కాదు.. తనలాంటి మరో నలుగుర్ని గొప్పగా బతికేలా తీర్చిదిద్దాలనుకున్నాడు అంజనడ్డి. అందుకే 2007లో నెట్‌వర్క్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసేబిలిటీస్ ఆర్గనైజేషన్‌తో కలిసి కరీంనగర్‌లో పైలెట్ ప్రాజెక్ట్‌ని ప్రారంభించాడు. ఆ తర్వాత దాన్ని ఐదు జిల్లాలకు విస్తరింజేశాడు. చిన్న చిన్న గ్రామాల్లో ఉన్న ‘విభిన్నమైన’వారికి సలహాలిస్తూ.. అవేర్‌నెస్ క్రియేట్ చేశారు. వారు స్వయంగా ఉపాధి పొందేలా శిక్షణనిస్తూ తన జీవితాన్నే ఉదాహరణగా చెబుతున్నారు.

స్పోర్ట్స్
- ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ ఫర్ డిసేబుల్డ్ ర్యాకింగ్స్ ప్రకారం బాడ్మింటన్ వీల్‌చెయిర్ సింగిల్స్ కేటగిరిలో అంజన రెడ్డిది ఇప్పుడు 21వ ర్యాంకు.
- ఐవాజ్ వరల్డ్ గేమ్స్- 2009 (బెంగళూరు) పోటీల్లో గోల్డ్ మెడల్.
- ఏషియన్ రెండో పారాలంపిక్ కప్ -2008లో కాంస్య పతకం.
-తొమ్మిదవ ఫెసిఫిక్ గేమ్స్ -2006లో (కౌలాలంపూర్, మలేషియా) కాంస్య పతకం.
- ఇజ్రాయెల్ థర్డ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఫర్ డిసేబుల్డ్ - 2003(జెరూసలేమ్) డబుల్ వీల్‌చెయిర్ కేటగిరీలో రెండో స్థానం.
- బ్యాడ్మింటన్ వరల్డ్ కప్ ఫర్ డిసేబుల్డ్ 2002 (బెంగళూరు) ఆఫ్ ఇండియాలో కాంస్య పతకం.

ఇంకా..
- 2004లో స్వయం ఉపాధి పొందిన ఫిజికల్లీ చాలెంజ్డ్ పర్సన్‌గా ఫ్యాప్సీ (ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ) అవార్డు.
- 2006లో ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్‌మెంట్ వారిచ్చే జాతీయ అవార్డు(బెస్ట్ సెల్ఫ్ ఎంప్లాయ్ కేటగిరీ) అందుకున్నాడు.
- భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఎనెర్జింగ్ లైవ్స్ కాంటెస్ట్ - 2010లో రన్నరప్.
దిస్ ఈజ్ ఎబిలిటీ ఆఫ్ అంజన రెడ్డి.























Comments

Popular posts from this blog

ఈ తిట్లు వింటే మీరూ తెగ నవ్వుతారు..

తిట్టడం ఒక యోగం.. తిట్టించడం ఒక భోగం.. తిట్టలేకపోవడం... ఒక రోగం. అదేంటి? జనరల్‌గా ‘నవ్వు’ గురించి కదా ఇలా చెప్తారు. ఇక్కడ నవ్వుకి.. తిట్లకి సంబంధం ఉంది. అందుకే అలా. ఏడుపొస్తే ఆపుకోవడం.. కోపమొస్తే తిట్టకపోవడం.. సెల్‌ఫోన్‌లో బ్యాలెన్స్ ఉండీ అవుట్‌గోయింగ్ చేయలేకపోవడం లాంటిది. అందుకే చీవాట్లెట్టండి. ఫన్నీగా.. తిట్ల గురించి కూడా ముచ్చట్లా? అని తిట్టుకోకండి. గూట్లో దాచిపెట్టి గూగుల్‌లో వెతికే రోజులివి. దేనికోసమో ‘యా’లో సెర్చ్ చేస్తుంటే.. What is the meaning of telugu word ne dumpa tega? (నీ దుంప తెగ అనే తెలుగు పదానికి అర్థమేంటి?) అని ఒక ప్రశ్న కనిపించింది. అడిగింది లండన్‌లో ఉండే మన తెలుగాయనే. ఇండియాకి వచ్చినప్పుడు ఆయన్ని ఎవరు తిట్టారో తెలియదు కానీ.. దానికి ఇద్దరు సమాధానాలిచ్చారు. మొదటిది ఇది తెలుగులో వ్యవహారిక పదం. కాని లిటరల్‌గా అనువదించడానికి సరైన అర్థం లేదు. దీన్ని రకరకాల సందర్భాల్లో వాడతారు. కోపంగా ఉన్నప్పుడు, ఫ్రస్టేషన్‌లో ఇలా తిడతారు. ఆశ్చర్యమేసినప్పుడు కూడా వాడతారు. దీని అర్థం నిజంగా తెలుసుకోవాలంటే.. ఈ మాట అనేవాళ్ల టోన్, ఫేసియల్ ఎక్స్‌వూపెషన్స్ చూడాల్సిం...

'ఛాయ' మిస్టరీ వీడినది

ఈ గుళ్లో ఓ మిస్టరీ దాగి ఉంది. పది శతాబ్దాల పైబడి ఎవరికీ అంతుచిక్కని రహస్యం అది. శివలింగంపై ఒక నీడ పడుతుంది. అది ఎప్పుడూ స్థిరంగానే ఉంటుంది. అది ఎక్కడి నుంచి పడుతుందో కూడా ఎవరికీ తెలియదు. గర్భగుడిలోని ఆ నిగూఢాన్ని ఇప్పుడు చేధించాడో ఫిజిక్స్‌ లెక్చరర్‌.  నల్గొండ పట్టణానికి ఆనుకుని పానగల్‌ ఉంది. ఆ ఊరి చివరన ఉదయ సముద్రం. దాని ఒడ్డున పచ్చని పొలాల మధ్య ఒక పురాతన దేవాలయం. 11వ శతాబ్దపు కుందూరు చోళుల కాలం నాటిది. దీని పేరే ఛాయా సోమేశ్వరాలయం. ఆ పేరులోనే ఉంది దాని మిస్టరీ. మనం ఉదయించే సూర్యునికి ఎదురుగా నిలబడితే మన నీడ ఎక్కడ పడుతుంది? మన వెనకవైపు పడుతుంది కదా. అదే మధ్యాహ్నం నిలబడితే నీడ ముందుకు పడుతుంది. ఈ గుళ్లోని శివలింగంపై పడే నీడ ఉదయం అయినా, మధ్యాహ్నం అయినా ఎప్పుడూ కదలదు. ఇంకో విషయం... ఆ నీడ ఒక స్తంభం నీడలా కనిపిస్తుంది. ఆ గుళ్లో ఎనిమిది స్తంభాలుంటాయి. కానీ ఆ నీడ ఏ స్తంభానిదో ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే ఒక స్తంభం నీడ అని మనం అనుకున్నామనుకోండి. దాని నీడపడినప్పుడు దాన్ని ముట్టుకుంటే మన చేయి నీడ కూడా పడాలి కదా? అలా పడదు. అయితే ఈ నీడ మరి ఎక్కడి నుంచి పడుతోంది, రోజంతా స్థిరంగా ఎలా ఉంటోంది? ఈ వి...

సామ్రాజ్ఞి రుద్రమ (మన చరిత్ర - 1) My new column in Batukamma Sunday Magazine

దాదాపు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం.. సమాజంలో బలంగా వేళ్లూనుకుపోయిన పురుషాధిక్యతపై సవాలు విసురుతూ ఓ వీరనారి రాజ్యాధికారం చేపట్టింది. ఆడదానికి రాజ్యమా? ఆడది పరిపాలించడమా? అని అయిన వాళ్లే ఆమె ఆధిపత్యాన్ని జీర్ణించుకోలేకపోయారు. కొందరు సామంతులు, మండలాధీశులూ ఎదురు తిరిగే ప్రయత్నం చేశారు. అయినా ఆమె అదరలేదు. బెదరలేదు. అలాంటి వారి తలలు వంచి, నోళ్లు మూయించి ధీర వనితగా, శత్రు భయంకర రుద్రరూపిణిగా నిలిచిందామె. నేటి స్వేచ్ఛా మహిళకు ప్రతీకగా, స్త్రీ ఆత్మగౌరవానికి సమున్నత పతాకగా.. గెలిచి నిలిచిన.. ఆమే.. రాజగజకేసరి.. రణరంగ ఖడ్గధారిణి.. కాకతీయ మహాసామ్రాజ్యభార ధారణి.. రాణీ రుద్రమ దేవి..  కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడు అత్యంత పరాక్రమవంతుడు, రాజనీతి కోవిదుడు. ఈయనకు ఇద్దరు కూతుళ్లు. మహిళలు రాజ్యాధికారానికి అనర్హులన్న అప్పటి కాలపరిస్థితులకు భిన్నంగా కూతురు రుద్రమదేవిని కుమారునిగా పెంచాడు. అన్ని విద్యలూ నేర్పించాడు. గణపతి దేవుడు రుద్రమను రాజప్రతినిధిగా ప్రకటించినప్పుడు స్త్రీ పరిపాలనను, స్త్రీ అధికారాన్ని సహించలేని సామంతుల నుంచి, దాయాదుల నుంచి తీవ్ర ప్రతిఘటనలు ఎదురైనాయి. ఈ విపత్తులన్నింటినీ రుద్ర...