
గోల్డెన్ గేట్ కోసం పనిచేయాలనుకుంటాడు...‘మీరా’ రిస్టోరేషన్ ఆర్కిటెక్ట్...
ఇండియాలో ెసెటిలవ్వాలని ఆమె డ్రీమ్. ఇక్కడ విషయం... సినిమా స్టోరీ కాదు.
రిస్టోరేషన్ గురించి... దీపికా డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి....అలాంటి థీమే ఈ అనురాధా నాయక్‌ది.‘లవ్ ఆజ్ కల్’ సినిమా సమయంలో దీపికా పదుకొన్ తాజ్‌మహల్‌ని చూడడానికి మూడుసార్లు వెళ్లిందని అప్పట్లో వార్తలొచ్చాయి. ఆ సినిమాలో ఆర్కిటెక్ట్‌గా పనిచేయడం వల్ల చారివూతాత్మక నిర్మాణాల పట్ల ఆమెకు ఆసక్తి పెరిగిందట. ఆమెకే కాదు... అలాంటి నిర్మాణాలంటే ఎవరికైనా ఆసక్తే ఉంటుంది. అలాంటి కట్టడాలను మనం ఇప్పుడు చూస్తున్నాం..కానీ మన ముందుతరాల వారు చూడగలరా? అప్పటి వరకు అవి కూలిపోకుండా ఉంటాయా? అంటే.. కచ్చితంగా ఉంటాయి. ఉండేలా చేయొచ్చు. అలా పురాతన కట్టడాలను పునరుద్ధరించడాన్నే రిస్టోరేషన్ అంటారు. దేశవిదేశాల్లో చదివి.. సినిమాలో దీపికలా.. ఇండియాలో పురాతన భవనాలను పునరుద్ధరించేందుకు వచ్చింది అనురాధ ఎస్. నాయక్. ఆమె మన హైదరాబాద్ ‘ఆడబిడ్డ’.
104 ఏళ్ల ఇల్లు...
అనురాధ గురించి తెలుసుకునే ముందు ఆమె ఫ్లాష్‌బ్యాక్ కూడా కొంత చదవాల్సిందే. హైదరాబాద్ మొజంజాహీ మార్కెట్ దగ్గరలో ధర్మవీర్ వామన్ నాయక్ మార్గ్ ఉంది. 1907లో వివేకవర్ధినీ పాఠశాలని ఆయన స్థాపించారు. ఆయన వారసుడు, ప్రస్తుతం పాఠశాల ప్రెసిడెంట్‌గా ఉన్న సుధీర్ ఆర్. నాయక్ కూతురే అనురాధా నాయక్. గౌలీగూడ రామమందిరం పక్కన ఒక పురాతన భవనం ఉంటుంది. 104 సంవత్సరాల క్రితం కట్టిన ఆ ప్యాలెస్‌లాంటి ఇంట్లోనే వీళ్లిప్పుడు నివసిస్తున్నారు. ఫ్లాష్‌బ్యాక్‌లోనే ఆ ఫ్లేవర్ ఉంది. అందుకేనేమో ఆమె రిస్టోరేషన్ ఆర్కిటెక్ట్ అయింది.
విదేశీ ‘పునాది’

లోకల్ ‘బిల్డప్’
హైదరాబాద్‌లోని చరివూతాత్మక నిర్మాణం చౌమహల్లా ప్యాలెస్ పునరుద్ధరణలో అనురాధ కీలకపాత్ర పోషించింది. యుకెకి చెందిన ఇన్‌టాచ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్యాలెస్‌ని రిస్టోరేషన్ చేసిన టీమ్‌లో ఆమె ఒక మెంబర్. ఇందుకుగాను ఆమెకు యునెస్కో ఏసియా పసిఫిక్ అవార్డ్ లభించింది. మూతబడిన ప్యాలెస్‌ని సందర్శకుల కోసం తిరిగి తెరిచేందుకు చౌమహల్లా ప్యాలెస్‌ని పునరుద్ధరించారు. ఇందులో ఎగ్జిబిషన్ కోసం హాల్స్‌ని, గ్యాలరీలని ఒరిజినల్ ప్లేవర్స్ మిస్ అవ్వకుండా ఆధునీకరించారు. రూమ్స్ లేఅవుట్, లైటింగ్, స్టక్కో ప్యాటర్న్‌లో ఉన్న సీలింగ్, ఫర్నీచర్‌లను తీర్చిదిద్దారు. 2006లో సంవత్సరం పాటు ఈ ప్రాజెక్ట్ కోసం పనిచేసింది అనురాధ. 2009లో ఈ ప్యాలెస్ టెక్స్‌టైల్స్ కలెక్షన్ హాల్(అఫ్తబ్ మహల్) కోసం కూడా ఆమె పనిచేసింది. నిజాం సిల్వర్ జూబ్లీ ట్రస్ట్ ఆధ్వర్యంలో పురానా హవేలీలోని సిటీ మ్యూజియం రిస్టోరేషన్‌లో కూడా ఆమె కృషి చేసింది.
అనుభవాల ‘నిర్మాణం’

ప్లాస్టరింగ్
జూలై 2011 నుంచి నిజామాబాద్ జిల్లాలోని దోమకొండ గడిని రిస్టోరేషన్ చేస్తోంది అనురాధా నాయక్. అప్పట్లో రామ్‌చరణ్ తేజ్ పెళ్లి కోసం ఈ గడిని సిద్ధం చేస్తున్నట్లు మీడియాలో వార్తలొచ్చాయి కూడా. కామినేని కుటుంబానికి చెందిన ఈ గడి 30 ఎకరాల్లో ఉంటుంది. దీన్ని దాదాపు 300 సంవత్సరాల క్రితం నిర్మించారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ పనిలోనే బిజీగా ఉంది అనురాధ. ఇదే ఏడాది మార్చిలో జైసల్మేర్ మహారాణీ రాజేశ్వరీ సింగ్ అనురాధని ప్రత్యేకంగా ఆహ్వానించింది. జైసల్మేర్ కోటలోని ప్యాలెస్ మ్యూజియాన్ని పునరుద్ధరించేందుకు ఆమెతో ఒప్పందం కుదుర్చుకుంది. దోమకొండ గడి పని పూర్తయ్యాక జైసల్మేర్ వెళ్లే ఆలోచనలో ఉంది ఆమె.
ఫినిషింగ్

అకడమిక్ అవార్డ్స్

-2005లో కొలంబియా యూనివర్సిటీ సొసైటీ ఆఫ్ ఆర్కిటెక్చరల్ హిస్టారియన్స్ జర్నల్‌లో ఆమె గురించి ప్రచురితమైంది.
-2007లో అదే యూనివర్సిటీ నుంచి స్కాట్ ఓప్లర్ ఫెలోషిప్ అవార్డ్‌ని కూడా అందుకుంది.
- 2009లో రాయల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్రిటీష్ ఆర్కిటెక్ట్స్ చార్టెడ్ మెంబర్‌గా ఎన్నికయ్యింది. రాయల్ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్‌లో కూడా ఫెలోషిప్ ఉంది.
పరిశోధనలు
ద లాస్ట్ ఆల్కెమీ : మాస్టర్స్ ఇన్ ఆర్కిటెక్చర్ కోసం ఇండియా, స్కాట్‌లాండ్ మ్యూజియాలకు సంబంధించిన సమకాలీన సిద్ధాంత వ్యాసం.
ద డిజైన్ ఆఫ్ ది ఎడిన్‌బర్గ్ : పోస్ట్‌క్షిగాడ్యుయేషన్ కోసం ఇడెన్‌బర్గ్ కాలేజ్, కలెక్షన్స్ మీద సిద్ధాంత వ్యాసం.
ప్రచురణలు
ద హల్నైషన్ ఆఫ్ ఎడిన్‌బర్గ్
Comments