New Year ఆల్కహాలజీ

By | December 26, 2011 1 comment
క్రిస్మస్ అయిపోయింది.. థర్టీ ఫస్ట్ దగ్గరలో ఉంది..
న్యూ ఇయర్ అంటే.. మొదట గుర్తొచ్చేది పార్టీ..
శీతాకాలం చలిలా.. వర్షాకాలం దోమల్లా..


ఎండాకాలం చెమటలా... న్యూ ఇయర్‌ది.. ఆల్కహాల్‌ది విడదీయరాని ప్యాకేజీ!
ఇయర్ ఎండింగ్ అంటే అందరూ పండగ చేసుకుంటారు బాస్. ఎందుకు దండగ అనుకోవడమే ట్రెండ్ మరి. అందుకే ‘ఆల్కహాలజీ’ నేర్చుకోవాలి.
పార్టీ అంటే పీతల్లా తాగేయడం కాదు.. ఏది తాగితే ఎంత ఎఫెక్ట్? ఎందులో ఎంత ఆ్కహాల్ ఉంటుంది? ఏ వైన్ మంచిది? ఇవన్నీ తెలుసుకోవాలి. అందుకే ఆల్కహాల్ గురించి తెలుసుకోవాలి...

వైన్
రెడ్ వైన్‌లో 14 శాతం ఆల్కహాల్ ఉంటుంది. వైట్ వైన్‌లో 12 శాతం ఉంటుంది. ఒక గ్లాస్8 రెడ్ వైన్‌లో 150 క్యాలరీలు, వైట్‌లో 120 క్యాలరీల శక్తి ఉంటుంది. వైన్‌లో కార్బొహైవూడేట్లు తక్కువగా ఉంటాయి. ఒక గ్లాస్8 వైన్లో 5 గ్రాములకు తక్కువవగా ఉంటాయి. రెడ్ వైన్‌లో ఫెనోలిక్ యాసిడ్లు, పోలీఫెనాల్స్ ఎక్కువగా ఉంటాయి. వీటి వల్ల శరీరంలోని కణాలు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది.

బీర్
బీర్‌లో ఆల్కహాల్ పర్సెం తక్కువగా ఉంటుంది. 3 శాతం నుంచి 8 శాతం వరకు ఉంటుంది. క్యాలరీస్8 కూడా ఎక్కువే. లైట్ బీర్ల కంటే స్ట్రాంగ్ బీర్లలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. ఒక గ్లాస్8 మగ్‌లో దాదాపు 150 క్యాలరీలు ఉంటాయి. లైట్ బీర్‌లో 100 క్యాలరీలుంటాయి. ఒక బీరులో 13 గ్రాముల కార్బోహైవూడేట్లు ఉంటే.. లైట్ బీరులో దీంట్లో సగం ఉంటాయి.

కాక్‌టైల్స్
కాక్‌టైల్స్ అంటే మిక్స్‌డ్ ఆల్కహాల్. ఇందులో జనరల్‌గానే బీరు, వైన్‌లకంటే ఆల్కహాల్ పర్సెం ఎక్కువగా ఉంటుంది. ఒక గ్లాసు మై తైలో 200 నుంచి 300 క్యాలరీలు ఉంటాయి. ఇది అందులో కలిపే రమ్ము, ఐస్8ని బట్టి మారుతుంది. రెగ్యులర్ మార్గరీటా గ్లాస్8లో 370 క్యాలరీలు, పినా కొలడాలో 430 క్యాలరీలు, బ్లడీ మ్యారీలో 127 క్యాలరీలుంటాయి.

హార్డ్ లిక్కర్
30 ఎంఎల్ లిక్కర్ వోడ్కాలో 70 క్యాలరీలు.. టెకీలా, బోర్బన్, ఐరిష్ విస్కీల్లో 69 క్యాలరీలు ఉంటాయి. జిన్‌లో 65 క్యాలరీలు ఉంటాయి. వీటిలో మిక్స్ చేసే థమ్సప్, సెవనప్‌ని బట్టి ఇది మారుతూ ఉంటుంది.

షాట్స్
ఇవి కూడా హార్డ్ లిక్కర్‌లాంటివే కాకపోతే పరిమాణం తక్కువగా ఉంటుంది. ఆల్కహాల్ శాతం వీటిలో ఎక్కువే. ఒక షాట్ టకీలాలో 97 క్యాలరీలుంటాయి. ఐదు షాట్‌ల టకీలా తీసుకుంటే 485 క్యాలరీలు ఉంటుందన్నమాట. అంటే ఇది మూడు గ్లాసుల బీరు, ఆరు గ్లాసుల రెడ్ వైన్‌తో సమానం. 60 ఎంఎల్ విస్కీ, వోడ్కా షాట్‌లో 145 క్యాలరీల ఆల్కహాల్ ఉంటుంది.


ప్రతి పెగ్గూ విలువైనదే..
ఒక ఫుల్‌బాటిల్ కోసం మీరెంత ఖర్చు పెడతారు? ఐదువేలు.. పదివేలు..? రెండు లక్షలు ఎప్పుడైనా ఖర్చు చేశారా? కానీ ఈ ప్రీమియర్ లిక్కర్ ప్రతి పెగ్గూ విలువైనదే.
లోయిస్ XIII కోగ్నాక్
ధర : 2 లక్షల రూపాయలు
బాటిల్ ప్రత్యేకత : గోల్డ్, క్రిస్టల్
ఎక్కడ దొరుకుతుంది? : ఒబెరాయ్, లీలా ప్యాలెస్8, తాజ్ లాంటి హోటళ్లలో..

గ్లెన్‌ఫిడిచ్ 50
ధర : ఆన్ రిక్వెస్ట్
బాటిల్ ప్రత్యేకత : ఎలగాంట్ డిజైన్,
ఎక్కడ దొరుకుతుంది? :
లగ్జరీ హోటళ్లలో

drinks talangana patrika telangana culture telangana politics telangana cinemaదల్మోర్ 40
ధర : 1.5 లక్షల రూపాయలు
బాటిల్ ప్రత్యేకత : డెలికేట్ హ్యాండ్ కటింగ్, ఐకానిక్ స్టాగ్
ఎక్కడ దొరుకుతుంది? : లగ్జరీ హోటళ్లలో


రాయల్ శాల్యూట్ 62 గన్
ధర : 1.15 లక్షల రూపాయలు
బాటిల్ ప్రత్యేకత : డబుల్ వాల్ క్రిస్టల్, గోల్డ్ ప్లేటెడ్ కాలర్
ఎక్కడ దొరుకుతుంది? : న్యూ ఢిల్లీ

మ్యాథ్స్
1 బాటిల్ = 750 ఎంఎల్
1 లార్జ్ పెగ్ = 60 ఎంఎల్
1 బాటిల్ = 12 పెగ్స్
బాటిల్ రూ. 1.5 లక్షల అయితే ఒక పెగ్ = రూ. 12000
థింక్ బి4 డ్రింగ్
న్యూ ఇయర్ పార్టీ అంటే స్నేహితులతో కలిస్తే తప్పకుండా మద్యం సేవించాల్సి వస్తుంది. అలాంటప్పుడు వారి నుంచి తప్పించుకోవాలంటే కొన్ని చిట్కూస్.
1. ‘హెల్త్ బాలేదు. మెడిసిన్ వాడుతున్నాను. డాక్టర్ ఆల్కాహాల్ తీసుకోవద్దని చెప్పార’ని చెప్పండి.
2. ఆల్రెడీ తాగినట్లు చెప్పండి. వాసన వచ్చేలా ప్లాన్ చేసుకోండి.
3. అయినా తప్పకపోతే. ఇక చాలు.. ఇంతకంటే ఎక్కువ తాగితే బయటికి వస్తుంది ఈ మధ్య అని చెప్పండి.
4. డ్రైవింగ్ చేస్తూ ఇంటికి వెళ్లాలి కాబట్టి నేనింత వరకే తాగుతానని కండీషన్ పెట్టండి.
5. రివర్స్ సైకాలజీ : ‘‘రేయ్.. ఎందుకు తాగుతున్నార్రా! మీకు అప్పుడే ఎక్కింది’’ అని రివర్స్ పంచ్ ఇవ్వండి.

కంట్రోల్ చేసుకోండిలా!
1. మీరు ఎన్ని పెగ్గులు తాగగలరో అంతే తాగండి.
2. జస్ట్ సిప్ చేయండి. ఓ.. దొరికింది కదా అని నింపేయకండి.
3. తక్కువ ఆల్కాహాల్ పర్సం ఉన్న వాటిని ఎంచుకోండి.
4. మంచి బ్రాండ్ ఆల్కాహాల్ బెటర్ ఆప్షన్.
5. అకేషనల్ తాగకుండా ఎందుకు మానేయకూడదు?

1 comments:

ఎందుకో ? ఏమో ! said...

Caution : మద్యపానము (ఆల్కాహాల్) ఆరోగ్యానికి హానికరము

:) Thanks For the nice info

?!