నాగప్రసాద్... నెవర్ గివప్ పరిస్థితులు రౌండప్ చేసి కన్‌ఫ్యూజ్ చేశాయి అదే ఇంకొకరైతే... అక్కడికక్కడే కుప్పకూలిపోయేవారు మళ్లీ కోలుకోవడం కూడా కష్టమయ్యేది కానీ అతను ఆ కన్‌ఫ్యూజన్‌లో కసి పెంచుకున్నాడు
‘కసి’ ఉంటే మనుషులు విజేతలవుతారని ప్రూవ్ చేశాడు తన జీవిత కథనే పాఠంగా చెబుతూ మోటివేట్ చేస్తున్న నాగవూపసాద్ ములాఖాత్ ఇది.
ఆశలకు.. అవసరాలకు.. మధ్య కొట్టుమిట్టాడే మధ్యతరగతి కటుంబంలో అల్లకల్లోలం.. చెల్లి ప్రేమ పేరుతో తోడును వెతుక్కుంది, తల్లిదంవూడులు విడిపోయారు, నాన్న ఇంకో పెళ్లి చేసుకున్నాడు. అమ్మ చనిపోయింది. అప్పుడు నాగవూపసాద్‌కు ఇరవై రెండేళ్లు. కోపం.. ప్రేమపెళ్లి చేసుకుందని చెల్లిమీద.. అమ్మకి విషమిచ్చి చంపేశాడని నాన్నమీద.. ఆ విషయం మొరపెట్టుకున్నా ఆత్మహత్యగా కేసు మూసేసిన పోలీసుల మీద... శవాన్ని చూడడానికి ఐదొందల రూపాయలు లంచం తీసుకున్న ఆస్పత్రి మీద! ఆవేశంలో తండ్రి, అతని బంధువుల మీద దాడి చేశాడు. దీనికంతటికీ కారణమైన చెల్లి కనిపిస్తే ఆమెని కూడా కొట్టాడు.
కసి వెనుక కథ
‘‘నేను ఆవేశంతో చేసిన పనులవల్ల కన్నవారు, అయినవారు అందరూ దూరమయ్యారు. నేను ఒంటరిని. అలాంటి సమయంలో నాకు ఉన్న ఒకే ఒక్క ఆశ. నేను ప్రేమించిన అమ్మాయి. కానీ ఆమె ప్రేమ కూడా నాకు దక్కలేదు. ఆమె ఉద్యోగం ఉన్న మరో అబ్బాయిని పెళ్లి చేసుకుంది. మళ్లీ ఓడిపోయాను. ఆ ఆలోచనల నుంచి తేరుకుంటున్నప్పుడు... యాక్సిడెంట్ అయింది. చేయి విరిగింది. ముఖానికి గాయాలు... సర్జరీ చేయాల్సి వచ్చింది. కానీ డబ్బులేదు. స్నేహితుల సహాయంతో సర్జరీ చేయించుకున్నాను. నాకే ఎందుకిలా అవుతోంది? అసలు నా భవిష్యత్తు ఏంటి? నన్ను నేను ప్రశ్నించుకున్నాను. ఓడిపోతున్నానని కూర్చుంటే ఓటమి మళ్లీ ఓడిస్తుంది. అందుకే నేను గెలవాలి. గెలిచి చూపించాలి అనుకున్నాను’’ అని తన కసి వెనుక కథని చెప్పాడు నాగవూపసాద్.

జీవితంలో సర్వస్వం కోల్పోయినా ఒకటి మాత్రం మిగిలే ఉంటుంది. అదే భవిష్యత్తు. నాగవూపసాద్ దాన్నే నమ్ముకున్నాడు. గతం చేసిన గాయం ఎన్నో పాఠాలు నేర్పింది. దాని పర్యవసానం మంచి ప్రతిఫలం కావాలని కోరుకున్నాడు. కానీ ఏం చేయాలి? ఆలోచిస్తూ కూర్చున్నాడు. చేతిలోకి కాగితం తీసుకుని రాకెట్ చేసి విసిరాడు. ఒకదాని తర్వాత ఒకటి చేస్తూనే ఉన్నాడు. ఒక ఆలోచన.. 60 నిమిషాల్లో 265 రాకెట్లు చేసి ఒకాయన లిమ్కా రికార్డ్ సాధించినట్లు ఎవరో చెప్పారు. దాన్ని బ్రేక్ చేయాలనుకున్నాడు. 265 కాదు.. గంటలో 505 రాకెట్లు చేసి అనుకున్నది సాధించాడు. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకున్నాడు.
వరుస రికార్డులు...
నాగవూపసాద్ లక్ష్యం మొదలైంది. లక్ష్యం తర్వాత లక్ష్యం. అనుకున్నది చేయడం.. చేసేవరకు ఉడుం పట్టు పట్టడం... నాగవూపసాద్ స్టైల్. అందుకే 2002లో మరో రికార్డ్ సాధించాడు. 35 గంటల 45 నిమిషాలు ఏకధాటిగా కంప్యూటర్ మీద టైప్ చేసి మళ్లీ లిమ్కా రికార్డు సంపాదించాడు. మరో ఏడాది.. ఆగిపోయిన ఇంజినీరింగ్ (గోగ్తే ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, బెల్గామ్) చదువు పూర్తి చేయాలనుకున్నాడు. కష్టపడి చదివి 2003లో రెండు అటెంప్ట్స్‌లో 53 (24+29) సబ్జెక్టులు పాసయ్యాడు. ఇది కూడా ఒక లిమ్కా రికార్డే. తర్వాత హైదరాబాద్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్లానింగ్ అండ్ మేనేజ్‌మెంట్‌లో ఎంబిఏ చదివాడు.
హైదరాబాదీగా...
ఏ ఊరికి చెందిన వారో కచ్చితంగా తెలియదు కానీ... నాగవూపసాద్ తల్లిదంవూడులు కర్ణాటకకు వలస వెళ్లారు. చిన్నప్పటి నుంచి ఒంటరిగా పెరిగిన నాగ్ బొమ్మలు వేయడంలో కూడా చేయి తిరిగినవాడు. స్పోర్ట్స్ పట్ల కూడా ఆసక్తి ఉండేది. రైఫిల్ షూటింగ్ అంటే మహాఇష్టం. దాంట్లో ప్రావీణ్యం సంపాదించేందుకు 2004లో హైదరాబాద్ వచ్చి సెటిలయ్యాడు. ఎంబిఏ చదువుతూ ‘ఏ ఆఫ్ టూ గ్రేట్ నేషన్స్’ అనే పుస్తకం కూడా రాశాడు. తర్వాత మరో రికార్డ్ కోసం ప్రయత్నం మొదపూట్టాడు. మారథాన్ టైపింగ్ గిన్నిస్ రికార్డ్ కోసం స్పాన్సర్లను వెతుక్కునేందుకు ముంబై వెళ్లాడు. అక్కడ జరిగిన ప్రమాదంలో మరోసారి తీవ్ర గాయాలపాలయ్యాడు. అయినా తన లక్ష్యాన్ని వదలకుండా 2006లో 10 గంటల మారథాన్ టైపింగ్ చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా స్థానం సంపాదించాడు.
మోటివేటర్‌గా..
జీవితంలో ఇన్ని రకాల ఎత్తు పల్లాలను... ఒడిదుడుకులను చూసిన నాగవూపసాద్ జీవితం కచ్చితంగా ఒక వ్యక్తిత్వ వికాస పాఠమే. అందుకే ఆయన తన జీవితాన్నే పాఠంగా చెబుతూ మోటివేషన్ క్లాసులు చెబుతున్నాడు. యువరాజ్ మోటివేటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఆంధ్రవూపదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో తరగతులు నిర్వహిస్తున్నాడు. ఖైదీల నుంచి పోలీసుల దాకా, హైస్కూల్ నుంచి కాలేజీ విద్యార్థుల దాకా.. కలిపి ఇప్పటి వరకు 39 వేల మందికి మోటివేషన్ క్లాసులు చెప్పాడు. ఆ అనుభవంతో ‘ఏ స్పిరిట్ దట్ రెఫ్యూజెస్ టు గివ్ అప్’ అనే పుస్తకాన్ని రాస్తున్నాడు. వ్యక్తిత్వ వికాసానికి సంబంధించి ఒక ఎన్‌కైక్లోపీడియాగా దీన్నిరూపొందించే పనిలో ఉన్నాడు.
నాగవూపసాద్ జీవితం నుంచి ఒక్క విషయం అర్థం చేసుకోవచ్చు. మీ లక్ష్యం పది మైళ్లయితే... మీ గురి మాత్రం పదకొండో మైలు మీద ఉండాలి. విజయం కచ్చితంగా మీ సొంతమవుతుంది. నెవర్ గివ్ అప్. ఆల్ ద బెస్ట్.
షూటింగ్.. షూటింగ్...
వరుస విజయాలతో ప్రపంచ రికార్డులు సాధించిన నాగవూపసాద్ చిరకాల స్వప్నం రైఫిల్ షూటింగ్. అందులో విజయం సాధించేందుకు ఇంకా ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాడు. రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రవూపదేశ్‌లో సభ్యత్వం కూడా సంపాదించాడు. రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్న నాగవూపసాద్ కామన్ వెల్త్ క్రీడల్లో పాల్గొనాలని కలలు కంటున్నాడు. కలలు కనడం సాకారం చేసుకోవడం నాగవూపసాద్‌కు కొత్తేం కాదు.
వెబ్‌సైట్: www.nagaprasad.com
Comments