Skip to main content

చామంతి పువ్వులతో తయారు చేసే టీ

Blooming-tea talangana patrika telangana culture telangana politics telangana cinema
టీ గురించి కొత్తగా చెప్పేదేముంది అనుకోకండి. 
అస్సామ్ గోల్డ్స్ రిచ్ మాల్టీనెస్... 
చమోమిలే ఛాయ్ ఫ్లవరీ 
ఈజిప్టియన్ పెప్పర్‌మింట్ ఫ్లేవర్... 
ఇలా.. ఫ్లవర్లు.. ఫ్లేవర్లు.. ఇంకా టీ కప్పులో తుఫాను సృష్టిస్తూనే ఉన్నాయి. 
అలాంటి టీ ట్రెండ్స్ గురించే ఈ కథనం. 

ఛాయ్‌ది ఐదు వేల సంవత్సరాల చరిత్ర. క్రీస్తు పూర్వం 2737వ సంవత్సరంలో చైనాలో పుట్టింది. ఆ తర్వాత యూరప్, అమెరికాల మీదుగా అన్ని దేశాల్లో పాపులర్ డ్రింక్‌గా మారింది. తేనీరు ముఖ్యంగా నాలుగు రకాలు. వైట్, బ్లాక్, గ్రీన్.. ఇంకా ఊలాంగ్. బ్లాక్, గ్రీన్‌టీల నుంచి పుట్టిందే ఊలాంగ్. తేయాకుని ఎండబెట్టే విధానాన్ని బట్టే వైట్, బ్లాక్, గ్రీన్‌టీలు తయారవుతాయి. వైట్, గ్రీన్ టీలలో కెఫిన్ తక్కువగా ఉంటుంది. బ్లాక్‌టీలో ఎక్కువగా ఉంటుంది. 

ఐస్డ్ టీ 
అమెరికాలో తప్ప మిగిలిన అన్ని దేశాల్లో దాదాపు వేడి వేడి ఛాయ్‌ని తాగడానికే ఇష్టపడతారు. కానీ అమెరికాలో ఐస్డ్ టీ బాగా పాపులర్. అమెరికాలో చాలామంది చైనా గ్రీన్ టీని తాగుతారు. 1904లో రీచెర్డ్ బ్లెకెండెన్ అనే ఆయన ఐస్ టీని పరిచయం చేశాడు. ఇప్పుడు అమెరికాలో 5 శాతం మంది దీన్నే తాగుతున్నారు. ప్యాక్డ్ డ్రింక్‌గా కూడా లభిస్తుంది. దీంట్లో ఐదారు రకాల వెరైటీలు కూడా ఉన్నాయి.

బ్లూమింగ్ టీ
A-cup-of-tea-Wallpaper talangana patrika telangana culture telangana politics telangana cinemaదీన్నే ఫ్లవరింగ్ టీ అని కూడా అంటారు. చైనాలో కొన్ని రకాల పుష్పాలతో తయారుచేసే ఈ టీ సంప్రదాయం ఇప్పుడు అన్ని ప్రపంచ దేశాల టీ స్థానం సంపాదించుకుంది. అయితే ఎండిన పుష్పాలను వేడి నీటిలో కలిపి తయారు చేసే ఈ టీ ఇప్పటికీ మిస్టరీనే. దీని పరిమళం, చిక్కదనం.. ఫ్లోరల్ ప్లేవర్.. దీని ఆదరణ కు కారణం. తేయాకు, జాస్మీన్, లిల్లీ, మందారం, క్రిషాంతిమమ్ పువ్వులను ఎక్కువగా వాడతారు. ఎండిన ఈ పువ్వులను వేడి నీటిలో వేయగానే విచ్చుకుంటాయి. గాజు టీపాట్‌లలో సర్వ్ చేసేప్పుడు ఈ టీ ప్రత్యేక ఆకర్షణీయంగా ఉంటుంది.

చామంతి చాయ్ (చమోమిలే)
ఎండిన చామంతి పువ్వులతో తయారు చేసే టీ ఇది. కమాయ్ మిలాన్ అనే గ్రీకు పదం నుంచి చమోమిలే పుట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువమంది ఇష్టపడుతున్న హెర్బల్ టీలలో ఇది కూడా ఒకటి. జర్మన్ హెర్బాలజీలో దీన్ని అలేస్ జుట్రాత్ అంటారు. అంటే ఈ టీ సర్వరోగ నివారణి అన్నమాట. దగ్గు, పడిశం, నిద్రలేమి, కీళ్ల నొప్పులు, పక్షవా ం తగ్గించేందుకు ఇది ఉపయోగపడుతుందట. చామంతి పువ్వులు ప్రపంచవ్యాప్తంగా కాస్తాయి. కానీ అన్నింటికంటే ఈజిప్ట్‌లోని నైలు నది పరివాహక ప్రాంతంలో పూసే చామంతి పూలు ఫైనెస్ట్ అని చాలామంది భావిస్తారు. 

టీ కాక్‌టెయిల్స్
a-cup-of-tea talangana patrika telangana culture telangana politics telangana cinemaట్రెండీయెస్ట్ నైట్ లైఫ్‌లో టీ కాక్‌టెయిల్స్ ఇప్పుడు పాపులర్ డ్రింక్. ఎంతో పాతదైన టీ ఇప్పుడు ఇన్నోవేటివ్ ఆదరణ పొందుతోంది. గ్రీన్ టీ డీలైట్, ద ఎల్ గ్రే మార్టినీ, మొరాకాన్ మోజిటో పేరుతో టీ కాక్‌టెయిల్స్ లభిస్తున్నాయి. 20 రకాల టీ వోడ్కాలు, ఆల్కాహాలిక్ టీలు విదేశాల్లో పాపులర్ డ్రింక్స్‌గా మారిపోతున్నాయి.

టీ రూమ్స్ 
‘టీ కొట్టుతో బతుకుతారు కొందరు.. టీ కొట్టి బతుకుతారు అందరూ..’ అని ఒక తెలుగు సినిమా పాట. కానీ ఇప్పుడు టీ కొట్టు పాతబడిపోయింది. టీకోసం ఎక్స్‌క్లూజివ్ షాప్‌లు, టీరూమ్‌లు, టీ సెంటర్‌లు వెలుస్తున్నాయి. అందమైన ఇంటీరియర్‌తో, ఆకట్టుకునే కెటిల్స్, మగ్గులు, టీపాట్స్‌తో సర్వ్ చేయడం ఇప్పటి ట్రెండ్. బెంగళూరు, ముంబై, కోల్‌కత్తా, హైదరాబాద్‌లాంటి నగరాల్లో కాఫీ బార్‌లకు సమాంతరంగా టీ బార్‌లు వెలుస్తున్నాయి. 

టీ షాప్స్
టీ సెంటర్, ముంబై

ముంబై డౌన్‌టౌన్‌లోని టీ సెంటర్ దశాబ్ధాలుగా ముంబై వాసులకు తేనీటి విందుని అందిస్తోంది. ఆల్ట్రామోవూడన్ ఇంటీరియర్ డిజైన్, బ్లాక్ అండ్ వైట్ వాల్ ఫోటోలతో బైగాన్ ఎరాని టచ్ చేస్తుంది. ఎప్పుడైనా వెళ్తే అక్కడి స్టాఫ్‌ని అడిగి మంచి ఇంగ్లీష్ టీ ఫ్లేవర్‌ని చేయండి.

డోల్లీస్ ద టీ షాప్, కోల్‌కత్తా
దక్షిణపాన్ షాపింగ్ సెంటర్ క్రౌడ్‌లో ఈ టీ షాప్ మీకు కనిపిస్తుంది. కోల్‌కత్తాలో దీ బెస్ట్ టీని చేయాలంటే డోల్లీస్‌లో అడుగుపెట్టాల్సిందే. ఈ షాప్ మెనూలో మీకు 50 రకాల టీలు కనిపిస్తాయి. ఫైనాఫిల్, మ్యాంగో, ఆరెంజ్ ఫ్లేవర్లతో ఐస్ టీ కూడా దొరుకుతుంది.

ఫిన్‌జాన్ టీ హౌస్,హైదరాబాద్
టోలీచౌకీ స్పెషల్ టీ ఇది. ఇక్కడ 30 రకాల టీలు లభిస్తాయి. కేవలం టీనే కాదు ఇక్కడ ఇంటీరియర్‌ని, టీపాట్స్‌ని, కెటిల్స్‌ని కూడా ఎంజాయ్ చేయొచ్చు. బంజారాహిల్స్‌లో కూడా దీని బ్రాంచీ ఉంది.

టీ టైమ్‌లైన్
120లో బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మనదేశానికి టీని పరిచయం చేసింది. 
140 నుంచి అస్సాం టీ కంపెనీ వ్యాపారాన్ని ప్రారంభించింది. 
1904లో జరిగిన వరల్డ్ ఫెయిర్‌లో ఐస్ టీ పుట్టింది.
190 నుంచి టీ పొడిని ప్యాకెట్ల రూపంలోకి మార్చారు. 

Comments

Popular posts from this blog

ఈ తిట్లు వింటే మీరూ తెగ నవ్వుతారు..

తిట్టడం ఒక యోగం.. తిట్టించడం ఒక భోగం.. తిట్టలేకపోవడం... ఒక రోగం. అదేంటి? జనరల్‌గా ‘నవ్వు’ గురించి కదా ఇలా చెప్తారు. ఇక్కడ నవ్వుకి.. తిట్లకి సంబంధం ఉంది. అందుకే అలా. ఏడుపొస్తే ఆపుకోవడం.. కోపమొస్తే తిట్టకపోవడం.. సెల్‌ఫోన్‌లో బ్యాలెన్స్ ఉండీ అవుట్‌గోయింగ్ చేయలేకపోవడం లాంటిది. అందుకే చీవాట్లెట్టండి. ఫన్నీగా.. తిట్ల గురించి కూడా ముచ్చట్లా? అని తిట్టుకోకండి. గూట్లో దాచిపెట్టి గూగుల్‌లో వెతికే రోజులివి. దేనికోసమో ‘యా’లో సెర్చ్ చేస్తుంటే.. What is the meaning of telugu word ne dumpa tega? (నీ దుంప తెగ అనే తెలుగు పదానికి అర్థమేంటి?) అని ఒక ప్రశ్న కనిపించింది. అడిగింది లండన్‌లో ఉండే మన తెలుగాయనే. ఇండియాకి వచ్చినప్పుడు ఆయన్ని ఎవరు తిట్టారో తెలియదు కానీ.. దానికి ఇద్దరు సమాధానాలిచ్చారు. మొదటిది ఇది తెలుగులో వ్యవహారిక పదం. కాని లిటరల్‌గా అనువదించడానికి సరైన అర్థం లేదు. దీన్ని రకరకాల సందర్భాల్లో వాడతారు. కోపంగా ఉన్నప్పుడు, ఫ్రస్టేషన్‌లో ఇలా తిడతారు. ఆశ్చర్యమేసినప్పుడు కూడా వాడతారు. దీని అర్థం నిజంగా తెలుసుకోవాలంటే.. ఈ మాట అనేవాళ్ల టోన్, ఫేసియల్ ఎక్స్‌వూపెషన్స్ చూడాల్సిం...

'ఛాయ' మిస్టరీ వీడినది

ఈ గుళ్లో ఓ మిస్టరీ దాగి ఉంది. పది శతాబ్దాల పైబడి ఎవరికీ అంతుచిక్కని రహస్యం అది. శివలింగంపై ఒక నీడ పడుతుంది. అది ఎప్పుడూ స్థిరంగానే ఉంటుంది. అది ఎక్కడి నుంచి పడుతుందో కూడా ఎవరికీ తెలియదు. గర్భగుడిలోని ఆ నిగూఢాన్ని ఇప్పుడు చేధించాడో ఫిజిక్స్‌ లెక్చరర్‌.  నల్గొండ పట్టణానికి ఆనుకుని పానగల్‌ ఉంది. ఆ ఊరి చివరన ఉదయ సముద్రం. దాని ఒడ్డున పచ్చని పొలాల మధ్య ఒక పురాతన దేవాలయం. 11వ శతాబ్దపు కుందూరు చోళుల కాలం నాటిది. దీని పేరే ఛాయా సోమేశ్వరాలయం. ఆ పేరులోనే ఉంది దాని మిస్టరీ. మనం ఉదయించే సూర్యునికి ఎదురుగా నిలబడితే మన నీడ ఎక్కడ పడుతుంది? మన వెనకవైపు పడుతుంది కదా. అదే మధ్యాహ్నం నిలబడితే నీడ ముందుకు పడుతుంది. ఈ గుళ్లోని శివలింగంపై పడే నీడ ఉదయం అయినా, మధ్యాహ్నం అయినా ఎప్పుడూ కదలదు. ఇంకో విషయం... ఆ నీడ ఒక స్తంభం నీడలా కనిపిస్తుంది. ఆ గుళ్లో ఎనిమిది స్తంభాలుంటాయి. కానీ ఆ నీడ ఏ స్తంభానిదో ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే ఒక స్తంభం నీడ అని మనం అనుకున్నామనుకోండి. దాని నీడపడినప్పుడు దాన్ని ముట్టుకుంటే మన చేయి నీడ కూడా పడాలి కదా? అలా పడదు. అయితే ఈ నీడ మరి ఎక్కడి నుంచి పడుతోంది, రోజంతా స్థిరంగా ఎలా ఉంటోంది? ఈ వి...

సామ్రాజ్ఞి రుద్రమ (మన చరిత్ర - 1) My new column in Batukamma Sunday Magazine

దాదాపు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం.. సమాజంలో బలంగా వేళ్లూనుకుపోయిన పురుషాధిక్యతపై సవాలు విసురుతూ ఓ వీరనారి రాజ్యాధికారం చేపట్టింది. ఆడదానికి రాజ్యమా? ఆడది పరిపాలించడమా? అని అయిన వాళ్లే ఆమె ఆధిపత్యాన్ని జీర్ణించుకోలేకపోయారు. కొందరు సామంతులు, మండలాధీశులూ ఎదురు తిరిగే ప్రయత్నం చేశారు. అయినా ఆమె అదరలేదు. బెదరలేదు. అలాంటి వారి తలలు వంచి, నోళ్లు మూయించి ధీర వనితగా, శత్రు భయంకర రుద్రరూపిణిగా నిలిచిందామె. నేటి స్వేచ్ఛా మహిళకు ప్రతీకగా, స్త్రీ ఆత్మగౌరవానికి సమున్నత పతాకగా.. గెలిచి నిలిచిన.. ఆమే.. రాజగజకేసరి.. రణరంగ ఖడ్గధారిణి.. కాకతీయ మహాసామ్రాజ్యభార ధారణి.. రాణీ రుద్రమ దేవి..  కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడు అత్యంత పరాక్రమవంతుడు, రాజనీతి కోవిదుడు. ఈయనకు ఇద్దరు కూతుళ్లు. మహిళలు రాజ్యాధికారానికి అనర్హులన్న అప్పటి కాలపరిస్థితులకు భిన్నంగా కూతురు రుద్రమదేవిని కుమారునిగా పెంచాడు. అన్ని విద్యలూ నేర్పించాడు. గణపతి దేవుడు రుద్రమను రాజప్రతినిధిగా ప్రకటించినప్పుడు స్త్రీ పరిపాలనను, స్త్రీ అధికారాన్ని సహించలేని సామంతుల నుంచి, దాయాదుల నుంచి తీవ్ర ప్రతిఘటనలు ఎదురైనాయి. ఈ విపత్తులన్నింటినీ రుద్ర...